రాశిఫలాలు 28 మార్చి 2026: ఈరోజు సుకర్మ యోగం ప్రభావంతో మేషం, కర్కాటకం సహా కొన్ని రాశులకు ఆర్థిక లాభ సూచనలు
horoscope today 28 March 2026 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు సుకర్మ యోగం ప్రభావంతో మేషం, కర్కాటకం సహా ఈ 5 రాశులకు ఆర్థిక పరంగా మంచి లాభాలొచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే.
Daily Horoscope in Tel Mar28
horoscope today 28 March 2026 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శనివారం రోజున చంద్రుడు కర్కాటక రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై పుష్య నక్షత్ర ప్రభావం ఉంటుంది. మరోవైపు చంద్రుడు, గురుడు, శుక్రుడు, సూర్యుడి ప్రభావంతో సుకర్మ, ఉభయచారి యోగాలు ఏర్పడనున్నాయి. ఈ శుభ యోగాల వేళ మేషం, కన్య సహా కొన్ని రాశుల వారికి శని దేవుని ఆశీస్సులు లభించొచ్చు. మరికొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు శుభ ఫలితాలు రానున్నాయి, ఎవరికి అశుభ ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ప్రముఖ పండితులు ‘‘ఆచార్య క్రిష్ణ దత్త శర్మ’’ మాటల్లో తెలుసుకుందాం.
మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)
మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)
మేష రాశి వారికి ఈరోజు శుక్రుడి ప్రభావంతో అనుకూల ఫలితాలొచ్చే అవకాశం ఉంది. మీ మాటతీరు మెరుగుపడొచ్చు. మీరు చాలా మందిని ఆకట్టుకోవచ్చు. మీ కుటుంబ జీవితంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మీ ప్రేమ జీవితంలోనూ సానుకూల ఫలితాలొచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు రావొచ్చు. ఈరోజు కొత్త వాహనం కొనేందుకు ప్లాన్ చేస్తారు. శని స్తోత్రం పఠించడం ద్వారా శని దేవుని ఆశీస్సులు పొందుతారు.
వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)
వృషభ రాశి వారికి శనిదేవుని అనుగ్రహం వల్ల శుభప్రదంగా ఉంటుంది. ఈరోజు మీ పెండింగ్ పనులన్నీ విజయవంతంగా పూర్తయ్యే అవకాశం ఉంది. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం గురించి శుభవార్తలు వినిపించొచ్చు. ఈరోజు మీరు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు. మీ బాధ్యతలను చాలా విశ్వాసంగా నిర్వర్తిస్తారు. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. పొరుగువారితో మీకు మంచి సంబంధాలు ఏర్పడతాయి.
మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)
మిథున రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. మీ శక్తి, సామర్థ్యాలు బాగా మెరుగుపడతాయి. అయితే గ్రహాల కదలిక కారణంగా మీ కుటుంబ జీవితంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఈరోజు మీరు ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం లభిస్తుంది. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. శని దేవుని అనుగ్రహంతో మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఉద్యోగులకు సహోద్యోగులు, ఉన్నతాధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. వ్యాపారులకు అపారమైన ప్రయోజనాలు కలగనున్నాయి.
కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)
కర్కాటక రాశి వారికి ఈరోజు చంద్రుడి అనుగ్రహంతో శుభ ఫలితాలు రానున్నాయి. మీ ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది. గ్రహాల కదలిక కారణంగా ఉదయం నుంచే చాలా చురుగ్గా ఉంటారు. మీ శక్తి, సామర్థ్యాలు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. మీ కోరికలన్నీ నెరవేరే అవకాశం ఉంది. మీ మనసులో సంతోషంగా ఉంటుంది. మీకు మతపరమైన, ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీరు కుటుంబంతో కలిసి విహారయాత్రకు లేదా ప్రయాణానికి ప్రణాళికలు రూపొందిస్తారు. మీ ఆత్మవిశ్వాసం పెరిగే అవకాశం ఉంది.
సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)
సింహ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలొచ్చే అవకాశం ఉంది. ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ వైవాహిక జీవితంలో కొన్ని విభేదాలు రావొచ్చు. ఇతరుల భావాలను గుర్తించి, దానికి అనుగుణంగా ప్రవర్తించడానికి ప్రయత్నించాలి. ఉద్యోగులు కార్యాలయంలో జాగ్రత్తగా ఉండాలి. సహోద్యోగుల సహకారంతో మీ పనులన్నీ పూర్తి చేసే అవకాశం ఉంది.
కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)
కన్య రాశి వారికి ఈరోజు శుభప్రదమైన ఫలితాలొచ్చే అవకాశం ఉంది. ఈరోజు మీరు చేసే పనులన్నింట్లో మంచి విజయం సాధించొచ్చు. కెరీర్ పరంగా పురోగతి లభించొచ్చు. ఈరోజు మీరు చేసే పనుల్లో అద్భుతమైన ఫలితాలు పొందే అవకాశం ఉంది. మీ భాగస్వామితో కలిసి బయటకు వెళ్లేందుకు ప్రణాళికలు రూపొందిస్తారు. మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. మీకు స్నేహితులు, సన్నిహిత బంధువుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. మీ భాగస్వామితో కలిసి బయటకు వెళ్తారు. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది.
తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)
తులా రాశి వారికి ఈరోజు ఆనందంగా ఉంటుంది. గ్రహాల కదలికతో ఏర్పడే శుభయోగాల కారణంగా మీరు స్నేహితులు, బంధువులతో సంతోషంగా గడుపుతారు. చంద్రుని అనుగ్రహంతో ఆర్థిక పరంగా మంచి లాభాలు పొందే అవకాశాలున్నాయి. మీ వైవాహిక జీవితంలో ఆనందంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. ఈరోజు కొన్ని ఊహించని వార్తలు వినడం ద్వారా సంతోషిస్తారు. మీ పెండింగ్ పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. ఈరోజు మీ శక్తి, సామర్థ్యాల మేరకు పేదలకు దానాలు చేయాలి.
వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)
వృశ్చిక రాశి వారికి ఈరోజు అనేక ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. మీ లక్ష్యాన్ని పూర్తి చేయడంపై ఎక్కువ శ్రద్ధ చూపుతారు. ఈరోజు ప్రారంభంలో కొన్ని శుభవార్తలు వింటారు. ఈరోజు మీరు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. దీన్నుంచి మీకు మంచి ఫలితాలు రావొచ్చు. వ్యాపారులకు మంచి లాభాలొచ్చే అవకాశాలున్నాయి. మీ వైవాహిక జీవితంలో ఆనందంగా ఉంటుంది. ఈ కారణంగా మీరు చాలా ప్రయోజనాలు పొందుతారు.
ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)
ధనస్సు రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు రానున్నాయి. మీకు గత బాధ్యతల నుంచి మంచి ఉపశమనం లభించొచ్చు. మీరు చేసే పనుల్లో సానుకూల ఫలితాలు రానున్నాయి. ఈరోజు మీ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కొన్ని నిత్యావసర వస్తువులను కొనుగోలు చేయాల్సి రావొచ్చు. కాబట్టి బడ్జెట్ బ్యాలెన్స్ తప్పకుండా చూసుకోవాలి. మీ కుటుంబంతో ఎక్కువ సమయం గడిపేందుకు ప్రయత్నించాలి.
మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)
మకర రాశి నుంచి చంద్రుడు ఈరోజు సప్తమ స్థానం నుంచి సంచారం చేయనున్నాడు. ఈ కారణంగా మీరు దూర ప్రయాణాలు చేయాల్సి రావొచ్చు. మరోవైపు కొన్ని శుభకార్యాలకు హాజరయ్యే అవకాశం లభిస్తుంది. మీరు ఈరోజు ఒక పాత స్నేహితుడిని కలవడం వల్ల ఆనందంగా గడుపుతారు. ఆర్థిక పరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా అప్పు అడిగితే అస్సలు ఇవ్వకండి. ఎందుకంటే అవి తిరిగొచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
కుంభ రాశి వారికి ఈరోజు అనేక రంగాల్లో సానుకూల ఫలితాలొచ్చే అవకాశం ఉంది. ఈ కాలంలో పెండింగులో ఉన్న పనులన్నీ విజయవంతంగా పూర్తయ్యే అవకాశం ఉంది. శని దేవుని అనుగ్రహం కారణంగా మీకు శుభ ఫలితాలు రానున్నాయి. అంతేకాదు లక్ష్మీదేవి అనుగ్రహం కారణంగా మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది. మీకు కొత్త ఆలోచనలు, మార్పులు రావడానికి మంచి అవకాశాలు లభిస్తాయి. పెండింగులో ఉన్న పనులు పూర్తి చేసుకోవడానికి మంచి అవకాశాలు లభిస్తాయి. మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. మీ సంబంధాలలో చాలా మాధుర్యం ఉంటుంది.
మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)
మీన రాశి వారికి అధిపతి గురువు గత కొన్ని రోజులుగా మిథునంలో అంటే నాలుగో స్థానం నుంచి సంచారం చేస్తున్నాడు. మరోవైపు చంద్రుడు పంచమ స్థానం నుంచి సంచారం చేస్తూ ఆదాయాన్ని పెంచేందుకు అనుకూల ఫలితాలు ఇవ్వనున్నాడు. ఈ కారణంగా మీ సంపద పెరిగే అవకాశం ఉంది. ఈరోజు మీకు రావాల్సిన బకాయిలను తిరిగి పొందుతారు. కష్టమైన సమస్యలను సులభంగా పరిష్కరించే అవకాశం ఉంది.
గమనిక : ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు.