06 ఫిబ్రవరి 2026:ఈరోజు త్రిగ్రాహి యోగం వేళ ధనస్సు, మకరం సహా ఈ 5 రాశులకు మూడింతల ప్రయోజనాలు..!

 06 ఫిబ్రవరి 2026:ఈరోజు త్రిగ్రాహి యోగం వేళ ధనస్సు, మకరం సహా ఈ 5 రాశులకు మూడింతల ప్రయోజనాలు..!

horoscope today 06 February 2026 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు త్రిగ్రాహి యోగం వేళ ధనస్సు, మకరం సహా ఈ 5 రాశులకు మూడు రెట్ల లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే…

horoscope today 06 February 2026 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శుక్రవారం రోజున చంద్రుడు తులా రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై హస్తా నక్షత్ర ప్రభావం ఉంటుంది. మరోవైపు బుధుడు, శుక్రుడు, గురుడి ప్రభావంతో లక్ష్మీనారాయణ, నవ పంచమ, త్రిగ్రాహి యోగాలు ఏర్పడనున్నాయి. ఈ శుభ యోగాల వేళ మకరం, ధనససు సహా ఈ 5 రాశులకు లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం లభించనుంది. ఈ కాలంలో మీరు మూడింతల ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. వ్యాపారులకు మెరుగైన ప్రయోజనాలు కలగనున్నాయి. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు అదృష్టం రానుంది. 12 రాశుల వారు ఎలాంటి పరిహారాలు పాటించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం…

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)
​మేష రాశి వారికి ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. అయితే ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ సమస్యలన్నింటికీ పరిష్కారం కనుగొంటారు. మీరు చేసే పనుల్లో బిజీగా ఉంటారు. మీ భాగస్వామితో నాణ్యమైన సమయం గడుపుతారు. ఉద్యోగులకు కార్యాలయంలో సీనియర్ అధికారుల నుంచి సహకారం లభిస్తుంది. మీ ఆత్మవిశ్వాసం పెరిగే అవకాశం ఉంది. వ్యాపారులు పురోగతి సాధించే అవకాశం ఉంది. ార్థిక పరంగా ప్రయోజనాలు పొందుతారు.

ఈరోజు మీకు 60 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు తల్లిదండ్రుల ఆశీస్సులు పొందాలి.

వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)
​వృషభ రాశి వారికి ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. మీ శక్తి, సామర్థ్యాలను పెంచుకుంటారు. లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆర్థిక పరంగా అనేక ప్రయోజనాలు చేకూరనున్నాయి. మీ పెండింగ్ పనులన్నీ పూర్తయ్యే అవకాశం ఉంది. వ్యాపారులకు ఈరోజు మెరుగైన ఫలితాలు రానున్నాయి. ఉద్యోగులకు కార్యాలయంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం ఉంది.

ఈరోజు మీకు 72 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు గురువు లేదా పెద్దల ఆశీస్సులుత తీసుకోవాలి.

మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)
మిథున రాశి వారికి ఈరోజు ప్రతికూల ఫలితాలు రానున్నాయి. కాబట్టి ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఆరోగ్యం కూడా క్షీణించే అవకాశం ఉంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించాలంటే మరింత కష్టపడాలి. ఆర్థిక పరంగా ప్రతికూల ఫలితాలు రానున్నాయి. వ్యాపారులకు ప్రత్యర్థుల నుంచి కొన్ని ఇబ్బందులు ఎదరవుతాయి. ఉద్యోగులకు కార్యాలయంలో వాతావరణం ప్రతికూలంగా ఉంటుంది.

ఈరోజు మీకు 82 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు లక్ష్మీదేవిని పూజించాలి.

కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)
కర్కాటక రాశి వారికి ఈరోజు చాలా రంగాల్లో సానుకూల ఫలితాలు రానున్నాయి. మీరు చేసే పనులన్నింట్లో విజయం సాధిస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్ గురించి శుభవార్తలు వినిపిస్తాయి. మీ ఇంట్లో ఏదైనా శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. వాగ్దానాలను నెరవేర్చడంలో వైఫల్యం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. వ్యాపారులకు ఈరోజు మెరుగైన లాభాలు కలగనున్నాయి. మీ ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది.

ఈరోజు మీకు 85 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు లక్ష్మీదేవిని పూజించాలి.

సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)
సింహ రాశి వారు ఈరోజు చాలా ఉత్సాహంగా ఉంటారు. మీ కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. మీకు ఆర్థిక పరంగా విశేష లాభాలొచ్చే అవకాశం ఉంది. మీ ఆర్థిక పరిస్థితి కూడా బలోపేతం అవుతుంది. అవివాహితులకు మంచి వివాహ సంబంధాలొచ్చే అవకాశం ఉంది. వ్యాపారులు ఈరోజు మెరుగైన లాభాలు పొందే అవకాశాలున్నాయి. మీ ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. వ్యాపారులు మెరుగైన లాభాలు పొందే అవకాశాలున్నాయి.

ఈరోజు మీకు 92 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు వినాయకుడికి లడ్డూ సమర్పించాలి.

కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)
కన్య రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. మీరు చేసే పనుల్లో అధికారుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. కెరీర్ పరంగా పురోగతి లభిస్తుంది. ఉద్యోగులు కార్యాలయంలో మెరుగైన ఫలితాలు పొందే అవకాశం ఉంది. రాజకీయాల్లో ఉండే వ్యక్తులకు ప్రజాదరణ పెరుగుతుంది. మీ కుటుంబంతో సంతోషంగా ఉంటారు. మీరు చేసే పనుల్లో ఎదురయ్యే ఆటంకాలన్నీ అధిగమిస్తారు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ కుటుంబ జీవితంలో సంతోషకరంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది.

ఈరోజు మీకు 84 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు శివ చాలీసా పారాయణం చేయాలి.

తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)
తులా రాశి వారికి ఈరోజు కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యుల నుంచి అన్ని రంగాల్లో సంపూర్ణ మద్దతు లభిస్తుంది. వ్యాపారులు మెరుగైన లాభాలు పొందే అవకాశం ఉంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం ఉంది. మీ ఆర్థిక ప్రణాళికలు విజయవంతం అవుతాయి. మీ వైవాహిక జీవితంలో ఆనందంగా ఉంటుంది.

ఈరోజు మీకు 85 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు సరస్వతీ దేవిని పూజించాలి.

వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)
వృశ్చిక రాశి వారు ఈరోజు చేసే పనుల్లో మంచి విజయం సాధిస్తారు. ఆర్థిక పరంగా మెరుగ్గా ఉంటుంది. అయితే మీ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో బాగా రాణిస్తారు. ఈరోజు ఎవరికీ అప్పులు ఇవ్వకండి. వ్యాపారులకు ఈరోజు మిశ్రమ ఫలితాలు రానున్నాయి. బీమా రంగంలో పని చేసే వారికి శుభ ఫలితాలు రానున్నాయి. మీ ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది.

ఈరోజు మీకు 95 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు తెల్లని వస్తువులను దానం చేయాలి.

ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)
ధనస్సు రాశి వారికి ఈరోజు అనేక రంగాల్లో అదృష్టం కలిసొస్తుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించాలంటే మరింత కష్టపడాలి. ప్రభుత్వ పనుల్లో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది. మీ కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడుపుతారు. ఉద్యోగులకు కొత్త ప్రాజెక్టులలో పని చేసే అవకాశం లభిస్తుంది. కెరీర్ పరంగా మీకు పురోగతి లభిస్తుంది.

ఈరోజు మీకు 72 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు శివలింగానికి పాలు సమర్పించాలి.

మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)
మకర రాశి వారు ఈరోజు లక్ష్మీదేవి అనుగ్రహంతో అనేక ప్రయోజనాలు పొందుతారు. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో ఆనందంగా ఉంటుంది. మీ భాగస్వామితో అద్భుతమైన సామరస్యాన్ని కలిగి ఉంటారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం ఉంది. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. మీ పెండింగ్ పనులన్నీ పూర్తయ్యే అవకాశం ఉంది. వ్యాపారులు మెరుగైన ఫలితాలను పొందే అవకాశాలున్నాయి. రియల్ ఎస్టేట్‌ రంగంలో ఉండే వ్యక్తులకు మంచి ఫలితాలు రానున్నాయి.

ఈరోజు మీకు 92 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు హనుమంతుడికి సింధూరం సమర్పించాలి.

కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)
కుంభ రాశి వారికి ఈరోజు ఆనందం, శ్రేయస్సు పెరుగుతాయి. లక్ష్మీనారాయణ యోగం ప్రభావంతో అనేక ప్రయోజనాలు కలగనున్నాయి. వ్యాపారులు ఊహించిన దాని కంటే ఎక్కువ లాభాలు పొందుతారు. మీ కోరికలన్నీ నెరవేరే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ ప్రేమ జీవితంలో ఆనందంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో మిశ్రమ ఫలితాలు రానున్నాయి. ఆస్తి, వాహన సంబంధిత సౌకర్యాలను పొందే అవకాశం ఉంది.

ఈరోజు మీకు 85 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు వినాయకుడికి లడ్డూ సమర్పించాలి.

మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)
మీన రాశి వారు ఈరోజు ఆర్థిక పరంగా ముఖ్యమైన ప్రయోజనాలు పొందుతారు. మీ మనసులో సంతోషకరంగా ఉంటుంది. కెరీర్ పరంగా మీకు పురోగతి లభిస్తుంది. వ్యాపారులకు అనేక సవాళ్లు ఎదురవుతాయి. ఉద్యోగులు కార్యాలయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సహోద్యోగుల నుంచి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. మీ వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.

ఈరోజు మీకు 95 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు చీమలకు పిండి పదార్థాలు తినిపించాలి.

గమనిక : ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *