స్లీప్‌ అప్నియా మెషిన్‌ సాయంతో జైల్లో నిద్రపోతున్న అంబటి రాంబాబు.. ఎందుకంటే

 స్లీప్‌ అప్నియా మెషిన్‌ సాయంతో జైల్లో నిద్రపోతున్న అంబటి రాంబాబు.. ఎందుకంటే

Ambati Rambabu Sleep Apnea Machine: మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. సీఎం చంద్రబాబును దూషించిన కేసులో ఆయనకు కోర్టు 14 రోజుల పాటూ రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. అయితే అంబటి రాంబాబు జైలులో స్లీప్ అప్నియా మెషిన్ సాయంతో నిద్రపోతున్నట్లు తెలుస్తోంది. శ్వాస సంబంధిత ఇబ్బందులు ఉండటంతో జైలు అధికారులు కోర్టు ఆదేశాలతో ఈ పరికరాన్ని సమకూర్చినట్లు చెబుతున్నారు.

హైలైట్:
రాజమహేంద్రవరం జైలులో అంబటి రాంబాబు
జైల్లో స్లీప్ అప్నియా మెషిన్ సాయంతో నిద్ర
శ్వాసకోశ సమస్యలు ఉండటంతోనే ఇలా

Ambati Rambabu
స్లీప్‌ అప్నియా పరికరంతో అంబటి రాంబాబు జైలు నిద్ర(ఫోటోలు

రాజమహేంద్రవరం జైలులో మాజీ మంత్రి అంబటి రాంబాబు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే అంబటి కోసం స్లీప్ అప్నియా అనే పరికరాన్ని అందజేసినట్లు తెలుస్తోంది. రాంబాబు జైలులో ‘స్లీప్‌ అప్నియా’ పరికరం సాయంతో నిద్రపోతున్నట్లు చెబుతున్నారు. కోర్టు ఆదేశాలతో ఆయన కోసం ఈ పరికరాన్ని జైలు అధికారులు సమకూర్చారని సమాచారం. ఈ స్లీప్ అప్నియా పరికరాన్ని శ్వాస సంబంధిత సమస్యలున్న వారు ఉపయోగిస్తారని డాక్టర్లు అంటున్నారు. శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నవాళ్లు నిద్రపోతున్న సమయంలో.. ఒక్కోసారి శ్వాతస తీసుకోవడంలో ఇబ్బందిపడుతుంటారట.. అయితే కొద్దిసేపటికి మళ్లీ శ్వాస తీసుకోవడంలో రికవర్ అవుతారట. అయితే ఆ సమయంలో ఆక్సిజన్ శాతం పడిపోకుండా ఈ స్లీప్ అప్నియా పరికరం ఉపయోగపడుతుందని చెబుతున్నారు. నిద్రిస్తున్న సమయంలో ఈ సమస్య ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి నిద్రపోయే ముందు ఈ పరికరాన్ని అమర్చుతుంటారట. అంబటికి కూడా ఈ స్లీప్ అప్నియా మెషిన్‌ను అమర్చారు.

జగన్‌కు మా నాన్న ఆ రోజు ఎందుకు గుర్తుకురాలేదు.. బలి పశువును చేస్తారేమో: ముద్రగడ కుమార్తె క్రాంతి
ఆ డీఎస్పీకి డిమోషన్.. CI స్థాయికి తగ్గిస్తూ రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం

జనసేన పార్టీ పదవులకు సీనియర్ నేత గుడ్ బై.. పవన్ కళ్యాణ్‌ ఇబ్బంది పడకూడదనే
ఏపీ సీఎం చంద్రబాబును దూషించిన కేసులో అంబటి రాంబాబుపై కేసులు నమోదయ్యాయి. ఆ వెంటనే ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేయగా.. అనంతరం కోర్టులో హాజరుపర్చగా 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం ఆయన్ను రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. అంబటిపై రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 16 కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. తాజాగా అంబటి రాంబాబుపై నెల్లూరు జిల్లాలో కూడా రెండు కేసులు నమోదయ్యాయి. మనబోలు పోలీస్ స్టేషన్‌, దుత్తలూరు పోలీస్ స్టేషన్‌లో టీడీపీ నేతల ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేశారు. ఈ కేసులకు సంబంధించి త్వరలోనే పీటీ వారెంట్ వేసే అవకాశం ఉందంటున్నారు. మరోవైపు అంబటి రాంబాబును కస్టడీకి ఇవ్వాలని గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీఎంపై చేసిన వ్యాఖ్యల వెనుక కుట్ర కోణం ఉందని.. విచారణ చేయడానికి ఐదు రోజుల పాటూ కస్టడీకి ఇవ్వాలని కోరారు. ఇదిలా ఉంటే అంబటి రాంబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై ఇవాళ విచారణ జరగనుంది.

మరోవైపు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై నెల్లూరు దర్గామిట్ట, పొదలకూరు పోలీసుస్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్‌లను కించపరిచేలా మాట్లాడట.. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరించారని ఆయనపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో కాకాణిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారు. మాజీ మంత్రి విడదల రజినిపై కూడా యడ్లపాడు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.. టీడీపీ నేతల ఫిర్యాదుతో ఆమెతో పాటుగా 21మందిపై కేసు ఫైల్ చేశారు. జనవరి 30న బోయపాలెంలో జరిగిన ఘటనలో కేసులు నమోదయ్యాయి.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *