విజయవాడ సింగర్ శ్రీలలిత పాడిన పాటను ట్వీట్ చేసిన ప్రధాని మోదీ
విజయవాడ సింగర్ శ్రీలలిత పాడిన పాటను ట్వీట్ చేసిన ప్రధాని మోదీ
PM Modi Posts Vijayawada Singer Srilalitha Song: విజయవాడకు చెందిన శ్రీ లలిత పాడిన పాటను ప్రధాని మోదీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యింది. విజయవాడ దుర్గమ్మపై శ్రీ లలిత కనకదుర్గా మహా ప్రమావిత అంటూ ఓ పాట పాడారు. ఈ పాట యూట్యూబ్ లింక్‌ను ప్రధాని షేర్ చేశారు. ప్రధాని ఈ పాటను పోస్ట్ చేయడంపై విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి స్పందించి ధన్యవాదాలు తెలిపారు.
హైలైట్:
విజయవాడ సింగర్ పాట పోస్ట్ చేసిన ప్రధాని మోదీ
కనకదుర్గా మహా ప్రమావిత అంటూ శ్రీ లలిత పాట
యూట్యూబ్ లింక్‌ను పోస్ట్ చేసిన నరేంద్ర మోదీ
Srilalitha Song
గాయని శ్రీలలిత పాటను పోస్ట్ చేసిన ప్రధాని
ప్రధాని నరేంద్ర మోదీ తెలుగమ్మాయి శ్రీ లలిత పాడిన పాటకు సంబంధించిన యూట్యూబ్ లింక్‌ను పోస్ట్ చేశారు. విజయవాడ సత్యనారాయణపురానికి చెందిన సింగర్ శ్రీ లలిత ఎన్నో పాటలు పాడారు. ఆమె విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మపై కనకదుర్గా మహా ప్రమావిత అంటూ ఓ పాట పాడారు. ప్రధాని మోదీ ఈ పాట యూట్యూబ్ లింక్‌ను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. ‘జగదాంబ మాత ఆరాధిస్తే మనసు అంతులేని శక్తి, బలం నిండిపోతుంది. ఆ మాత మన హృదయాన్ని దైవ చైతన్యంతో ప్రకాశింపజేస్తుంది’ అన్నారు ప్రధాని. తెలుగమ్మాయి శ్రీ లలిత పాడిన పాటను ప్రధాని పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది.
శ్రీ లలిత పాడిన పాటను ప్రధాని పోస్ట్ చేయడంపై విజయవాడ పశ్చిమ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే సుజనాచౌదరి స్పందించారు. ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. విజయవాడకు చెందిన శ్రీ లలిత పాడిన ఈ పాటను స్వయంగా దేశ ప్రధాని ప్రజలతో పంచుకోవడం నగరవాసులందరికీ గర్వకారణమన్నారు. ‘విజయవాడ, సత్యనారాయణపురానికి చెందిన సీతారాం గారి ధర్మపత్ని శ్రీమతి లలిత గారు ఆలపించిన భక్తి గీతాన్ని గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు స్వయంగా సోషల్ మీడియా వేదికగా దేశ ప్రజలతో పంచుకోవడం మన విజయవాడ వాసులందరికీ గర్వకారణం. ఈ సందర్భంగా శ్రీమతి లలిత గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తున్నాను’ అంటూ ట్వీట్ చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పండగలు, ముఖ్యమై కార్యక్రమాలు ఉంటే తెలుగులోనే ట్వీట్ చేస్తున్నారు. ఇటీవల ఉగాది రోజు తెలుగులో శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది పండుగ సందర్పంగా ప్రతిఒక్కరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.
సంప్రదాయాలతో ముడిపడి ఉండటంతో ప్తాటు కొత్త శక్తికి, ఆరంభాలకు ఉగాది పండుగ ప్రతీక అన్నారు. నూతన సంవత్సరానికి ఉగాది నాంది పలుకుతుంది. రాబోయే సంవత్సరం ఆనందాలు, విజయాలు, ఆరోగ్యంతో నిండి ఉండాలని ప్రార్థిస్తున్నాను అన్నారు. తమ ఆకాంక్షలను చిత్తశుద్దితో కొనసాగించేలా, సమాజ శ్రేయస్సుకు సానుకూలతతో దోహదపడేలా ఈ ఏడాది ప్రతి ఒక్కరినీ ప్రేరేపించాలని
కోరుకుంటున్నాను.