రాశిఫలాలు 30 మార్చి 2026: ఈరోజు చంద్రుడి ప్రభావంతో మకరం, మీనం సహా కొన్ని రాశులకు మంచి విజయాలు
horoscope today 30 March 2026 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు శూల యోగం ప్రభావంతో మకరం, మీనం సహా ఈ 5 రాశులకు మంచి విజయం లభించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే.
Daily Horoscope in Tel Mar30
horoscope today 30 March 2026 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సోమవారం రోజున చంద్రుడు సింహ రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై మాఘ నక్షత్ర ప్రభావం ఉంటుంది. మరోవైపు శూల, గండ యోగాలు ఏర్పడనున్నాయి. ఈ శుభ యోగాల ప్రభావంతో మేషం సహా కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు రానున్నాయి. ఈరోజు చంద్రుడి స్థానం బలంగా ఉండటం కారణంగా శివయ్య ఆశీస్సులు కూడా లభించే అవకాశాలున్నాయి. మరికొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు శుభ ఫలితాలు రానున్నాయి, ఎవరికి అశుభ ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ప్రముఖ పండితులు ‘‘ఆచార్య క్రిష్ణ దత్త శర్మ’’ మాటల్లో తెలుసుకుందాం.
మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)
మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)
మేష రాశి వారికి ఈరోజు చంద్రుడి అనుగ్రహంతో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం సింహ రాశిలో సంచారం చేస్తున్న చంద్రుడి కారణంగా శుభ ఫలితాలొచ్చే అవకాశం ఉంది. ఈరోజు మీ వైవాహిక జీవితంలో ఆనందంగా ఉంటుంది. మరోవైపు మూడో స్థానం నుంచి గురు గ్రహం సంచారం కారణంగా మీరు పిల్లల నుంచి శుభవార్తలు వినొచ్చు. ఈరోజు సాయంత్రం పెండింగులో ఉన్న పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. ఈరోజు రాత్రి మీ ప్రియమైన వారిని కలుసుకుని ఆనందంగా గడుపుతారు.
వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)
వృషభ రాశి వారికి ఈరోజు సానుకూల ఫలితాలు పొందే అవకాశాలున్నాయి. రాజకీయాల్లో ఉండే వ్యక్తులు ఈరోజు చేసే ప్రయత్నాలన్నింట్లో మంచి విజయం సాధించొచ్చు. ప్రభుత్వంతో అధికారంలో ఉన్నవారితో పొత్తులు ప్రయోజనకరంగా మారొచ్చు. కాంట్రాక్టులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. సమాజంలో మీకు కీర్తి, ప్రతిష్టలు పెరిగే అవకాశం ఉంది. మీ పిల్లల వైపు నుంచి కొన్ని శుభవార్తలు వింటారు. రాత్రిపూట కొందరు వ్యక్తులను కలవడం వల్ల అనవసరమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.
మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)
మిథున రాశి వారికి ఈరోజు ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈరోజు మీరు విలువైన వస్తువును పోగొట్టుకునే అవకాశాలున్నాయి. మీ పిల్లలు చదువులో లేదా ఏదైనా పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం ఉంది. దీంతో మీరు చాలా సంతోషంగా గడుపుతారు. ఈరోజు పెండింగులో ఉన్న మీ పనులన్నీ పూర్తవుతాయి. ఈరోజు మీరు కొన్ని శుభకార్యాల్లో పాల్గొనే అవకాశాలున్నాయి. అయితే ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)
కర్కాటక రాశి నుంచి చంద్రుడు ఈరోజు రెండో స్థానం నుంచి సంచారం చేయడం కారణంగా మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. కెరీర్ పరంగా పురోగతి లభించే అవకాశాలున్నాయి. సమాజంలో మీ కీర్తి, గౌరవం పెరుగుతుంది. మీకు పిల్లల పట్ల బాధ్యతలు నెరవేరొచ్చు. మీ ప్రయాణాలు ఆహ్లాదకరంగా ఉంటాయి. ఈరోజు సాయంత్రం నుంచి రాత్రి వరకు మీ ప్రియమైన వారిని కలిసే అవకాశం ఉంది. దీంతో మీరు కొన్ని శుభవార్తలు వింటారు.
సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)
సింహ రాశి వారికి ఈరోజు చంద్రుడి అనుగ్రహంతో కొత్త ఆదాయ వనరులు లభించే అవకాశాలున్నాయి. మీ మాటతీరుతో అందరినీ ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తారు. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. పోటీ పరీక్షల్లో మీరు విజయం సాధించే అవకాశాలున్నాయి. మీ ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయించే అవకాశాలున్నాయి. అయితే సూర్యుడి ప్రభావంతో మీకు ఆరోగ్య పరంగా కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.
కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)
కన్య రాశి వారికి అధిపతి అయిన బుధుడి ప్రభావంతో మీ ధైర్యం పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగులకు, వ్యాపారులకు ఈరోజు శుభ ఫలితాలు రానున్నాయి. మీరు చేసే ప్రయత్నాలన్నింట్లో మంచి విజయం సాధించే అవకాశం ఉంది. మీకు పిల్లల నుంచి శుభవార్తలు వినిపించొచ్చు. కోర్టు సంబంధిత కేసుల్లో మీకు అనుకూలంగా తీర్పు రావొచ్చు. సమాజంలో మీకు కీర్తి, ప్రతిష్టలు పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలొచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులకు ప్రమోషన్ గురించి శుభవార్తలు వినిపించొచ్చు.
తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)
తులా రాశి వారికి ఈరోజు కుటుంబ జీవితంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యులందరితో సంతోషంగా గడిపే అవకాశం ఉంది. ఆర్థిక పరమైన విషయాల్లో మెరుగైన ఫలితాలు రావొచ్చు. మీరు ప్రత్యర్థులపై ఆధిపత్యం సాధించొచ్చు. ఈరోజు మీరు దూర ప్రయాణాలు చేయాల్సి రావొచ్చు. మీ ప్రేమ సంబంధాలు బలపడే అవకాశం ఉంది. వ్యాపారులు మెరుగైన లాభాలు పొందాలంటే మరింత కష్టపడాల్సి ఉంటుంది. మీ కష్టానికి తగిన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.
వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)
వృశ్చిక రాశి వారికి ఈరోజు శని, కుజుడి ప్రభావంతో ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆరోగ్య పరంగా కొన్ని సమస్యలు ఇబ్బంది కలిగించొచ్చు. మీ కుటుంబ జీవితంలో వాతావరణం ప్రతికూలంగా ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో నిరాశజనకమైన ఫలితాలు పొందే అవకాశం ఉంది. వ్యాపారులు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే నష్టపోయే ప్రమాదం ఉంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలంటే మరింత కష్టపడాలి. మరోవైపు అకస్మాత్తుగా విదేశాలకు ప్రయాణం చేసే అవకాశం లభించొచ్చు.
ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)
ధనస్సు రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలొచ్చే అవకాశం ఉంది. మీరు చేసే పనులకు ప్రత్యర్థుల నుంచి ప్రశంసలు లభించొచ్చు. రాజకీయ నాయకులకు ప్రజాదరణ పెరిగే అవకాశం ఉంది. మీకు బంధువుల నుంచి గణనీయమైన ప్రయోజనాలు కలిగే అవకాశాలున్నాయి. సాయంత్రం నుంచి రాత్రి వరకు సానుకూల ఫలితాలు రానున్నాయి. సమాజంలో మీకు గౌరవం లభించే అవకాశం ఉంది. ఈరోజు మీరు కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలున్నాయి.
మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)
మకర రాశి వారికి ఈరోజు కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. ఆర్థిక పరమైన విషయాల్లో మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉంది. ఈరోజు మీరు చేపట్టే కొత్త ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఉద్యోగులకు కార్యాలయంలో సహోద్యోగుల నుంచి మంచి సహకారం లభిస్తుంది. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. ఈరోజు సాయంత్రం ఎలాంటి వివాదాలల్లో చిక్కుకోకుండా జాగ్రత్తగా ఉండాలి. మీ తల్లిదండ్రుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)
కుంభ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు రానున్నాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య పరంగా కొంత ఇబ్బంది ఉండొచ్చు. శని దేవుని ప్రభావంతో మీకు కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలున్నాయి. మీ ప్రత్యర్థుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని ప్రతికూల వార్తలు వినడం వల్ల మీరు నిరాశకు గురయ్యే అవకాశం ఉంది. ఈరోజు వివాదాలకు దూరంగా ఉండాలి.
మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)
మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)
మీన రాశి వారికి ఈరోజు శని, సూర్యుడి అనుగ్రహంతో సానుకూల ఫలితాలొచ్చే అవకాశం ఉంది. మీ వైవాహిక జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నింటికీ పరిష్కారం లభిస్తుంది. మీ భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. మీ సంబంధాలు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీరు కొన్ని పుణ్యక్షేత్రాల సందర్శన చేయొచ్చు. దానధర్మాల కారణంగా మీ ఖర్చులు పెరగొచ్చు. ఈరోజు ప్రయాణం చేసేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. గురువు ప్రభావంతో కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే ప్రమాదం ఉంది.
గమనిక : ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు.