రాశిఫలాలు 24 మార్చి 2026: ఈరోజు ఆయుష్మాన్ యోగం ప్రభావంతో సింహం, ధనస్సు సహా కొన్ని రాశులకు మంచి లాభాలు

 రాశిఫలాలు 24 మార్చి 2026: ఈరోజు ఆయుష్మాన్ యోగం ప్రభావంతో సింహం, ధనస్సు సహా కొన్ని రాశులకు మంచి లాభాలు

రాశిఫలాలు 24 మార్చి 2026: ఈరోజు ఆయుష్మాన్ యోగం ప్రభావంతో సింహం, ధనస్సు సహా కొన్ని రాశులకు మంచి లాభాలు

horoscope today 24 March 2026 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు ఆయుష్మాన్ యోగం వేళ సింహం, ధనస్సు, వృశ్చికం సహా ఈ 4 రాశులకు మంచి లాభాలొచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే.

Daily Horoscope in Tel Mar24

horoscope today 24 March 2026 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మంగళవారం రోజున చంద్రుడు వృషభరాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై రోహిణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. మరోవైపు ఈరోజు ప్రీతి యోగం, ఆయుష్మాన్‌ యోగంతో పాటు అనేక శుభ యోగాలు ఏర్పడనున్నాయి. ఈ కారణంగా మంగళవారానికి మరింత ప్రాధాన్యత పెరిగింది. ఈ శుభ యోగాల వేళ మేషం, సింహం సహా నాలుగు రాశుల వారికి కష్టానికి తగిన ఫలితాలు రానున్నాయి. ఈరోజు కుజ గ్రహ స్థానం బలపడనుంది. అంతేకాదు శ్రీ హనుమాన్ అనుగ్రహం కూడా లభిస్తుంది. ఈ కారణంగా మీరు శత్రువులపై విజయం సాధించొచ్చు. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు శుభ ఫలితాలు రానున్నాయి, ఎవరికి అశుభ ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ప్రముఖ పండితులు ‘‘ఆచార్య క్రిష్ణ దత్త శర్మ’’ మాటల్లో తెలుసుకుందాం.

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)
మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)
​మేష రాశి వారికి ఈరోజు అనేక శుభ యోగాల వల్ల శుభ ఫలితాలు రానున్నాయి. మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ పనులన్నీ సకాలంలో పూర్తయ్యే అవకాశాలున్నాయి. మీకు నాయకత్వం వహించడానికి ఒక మంచి అవకాశం లభిస్తుంది. ఈరోజు మీరు ధైర్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఈ కారణంగా మీరు పనిలో మంచి విజయాలు సాధించొచ్చు. మీరు పనులన్నీ చాలా ఉత్సాహంగా పూర్తి చేసే అవకాశాలున్నాయి. మీకు అన్నదమ్ముల నుంచి పూర్తి లభిస్తుంది. ఉద్యోగులకు అధికారుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. ఈరోజు ఏదైనా శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం కూడా మీకు లభించొచ్చు.

వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)
వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)

వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)
​వృషభ రాశి వారికి ఈరోజు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఈ రాశి వారికి అధిపతి అయిన శుక్రుడు పన్నెండో స్థానం నుంచి సంచారం చేయడం కారణంగా మీకు ప్రతికూల ఫలితాలు రావొచ్చు. కుజుడి ప్రభావంతో మీ శత్రువులు మరింత బలపడతారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. చంద్రుడి అనుగ్రహంతో మీ పనులు సకాలంలో పూర్తవ్వొచ్చు. మీ వైవాహిక జీవితంలో ఆనందంగా ఉంటుంది.

మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)

మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)
మిథున రాశి వారు ఈరోజు చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మరోవైపు ఈరోజు మీకు రావాల్సిన బకాయిలను తిరిగి పొందే అవకాశాలున్నాయి. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాల వల్ల సానుకూల ఫలితాలు రానున్నాయి. ఈరోజు సాయంత్రం కొన్ని శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం లభిస్తుంది.

కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)

కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)
కర్కాటక రాశి వారు ఈరోజు కుటుంబ జీవితంలో సంతోషంగా గడుపుతారు. మీ తోబుట్టువుల నుంచి సంపూర్ణ మద్దతు లభించే అవకాశం ఉంది. ఈరోజు మీ కష్టానికి తగిన ఫలితాలు రావొచ్చు. ఈరోజు మీరు చాలా ఉత్సాహంగా గడుపుతారు. అంతేకాదు ఆధ్యాత్మిక కార్యకలాపాలపై ఆసక్తి చూపుతారు. మీ మాటతీరుతో చాలా మందిని ఆకట్టుకుంటారు.

సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)

సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)
సింహ రాశి వారికి ఈరోజు హనుమంతుని ప్రత్యేక అనుగ్రహం లభించనుంది. ఈరోజు మీ పనులన్నీ సులభంగా పూర్తవుతాయి. మీరు గొప్ప విజయాలు సాధించే అవకాశం ఉంది. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. కెరీర్ పరంగా మీకు మంచి పురోగతి లభిస్తుంది. మీ పూర్వీకుల నుంచి ఆస్తి ప్రయోజనాలు పొందొచ్చు. ఉద్యోగులకు ఈరోజు సమయం అనుకూలంగా ఉంటుంది. మీకు ప్రమోషన్ గురించి శుభవార్తలు వినిపించొచ్చు. మీకు సహోద్యోగుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. మీ ధైర్యాన్ని చూసి శత్రువులు కూడా భయపడే అవకాశాలున్నాయి.

కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)

కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)
కన్య రాశి వారికి ఈరోజు మంచిగా ఉంటుంది. ఈరోజు మీరు ఆరోగ్య పరంగా మెరుగైన ఫలితాలు సాధించొచ్చు. మీకు పిల్లల నుంచి శుభవార్తలు అందే సూచనలు ఉన్నాయి. మీకు మేనల్లుడి నుంచి మద్దతు లభించే అవకాశాలున్నాయి. మీ మాటలను అదుపులో ఉంచుకోవాలి. సమాజంలో మీకు కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగులకు కార్యాలయంలో వాతావరణం సానుకూలంగా ఉంటుంది.

తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)

తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)
తులా రాశి వారిలో విద్యార్థులకు ఈరోజు సానుకూల ఫలితాలు రానున్నాయి. మీకు విద్య పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీకు తల్లిదండ్రుల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తుంది. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. ఉద్యోగులకు కార్యాలయంలో సానుకూల ఫలితాలు రానున్నాయి. ఉపాధ్యాయుల పట్ల గౌరవం ఉండాలి. ఈరోజు మీరు చేసే పనుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మీరు నష్టపోవాల్సి రావొచ్చు.

వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)

వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)
వృశ్చిక రాశి వారికి ఈరోజు తాము చేసే పనులన్నీ సకాలంలో పూర్తయ్యే అవకాశం ఉంది. కాబట్టి జీవితంలో మీరు పూర్తి శాంతిని పొందుతారు. ఈరోజు మీరు కొన్ని శుభవార్తలు పొందొచ్చు. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. మీ పెండింగ్ పనులన్నీ సులభంగా పూర్తవ్వొచ్చు. మీ వ్యాపార నైపుణ్యాలు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం లభించొచ్చు. విదేశాలకు సంబంధించిన పనులు చేసే వారికి సానుకూల ఫలితాలు రానున్నాయి. ఈరోజు విహారయాత్రలకు కూడా ప్లాన్ చేస్తారు.

ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)

ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)
ధనస్సు రాశి వారికి ఈరోజు హనుమంతుని ప్రత్యేక అనుగ్రహం లభించే అవకాశం ఉంది. మీ జీవితంలోని అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. వ్యాపారులకు మెరుగైన ప్రయోజనాలు కలగనున్నాయి. మీ ఆదాయంలో కూడా మెరుగుదల ఉంటుంది. ఈరోజు మీరు పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి ప్రయోజనాలు పొందొచ్చు. అయితే అనవసర ఖర్చులను నియంత్రించుకోవడం లభించొచ్చు. ఈ కారణంగా మీరు గొప్ప విజయాలు సాధించొచ్చు. ఈరోజు మీ కోరికలన్నీ నెరవేరొచ్చు.

మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)

మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)
మకర రాశి వారికి ఈరోజు పూర్వీకుల నుంచి డబ్బు అందే అవకాశాలున్నాయి. ఈరోజు మీకు కొన్ని విభిన్నమైన విద్యలపై ఆసక్తి పెరగొచ్చు. ఈరోజు ఎవరినీ సలహాలు అడగకండి. ఎందుకంటే అది ప్రతికూల ప్రభావాన్ని కలిగిస్తుంది. ఈరోజు మీ శక్తి, సామర్థ్యాల మేరకు దానధర్మాల కార్యకలాపాలలో పాల్గొనండి. ఇది మీ మనసును ప్రశాంతంగా, సంతోషంగా ఉంచుతుంది.

కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)

కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)
కుంభ రాశి వారికి ఈరోజు ఆదాయం పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈరోజు మీరు చేసే ప్రయత్నాలన్నింట్లో మంచి విజయం సాధిస్తారు. మీకు కొత్త ఆదాయ వనరులు లభించొచ్చు. మీకు స్నేహితుల నుంచి మద్దతు లభిస్తుంది. అంతేకాదు కొందరు కొత్త స్నేహితులను కూడా కలుసుకుంటారు. వ్యాపారులకు మంచి లాభాలొచ్చే అవకాశాలున్నాయి.

మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)
మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)
మీన రాశి వారికి ఈరోజు సంపద పెరిగే అవకాశాలు ఉన్నాయి. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. ఈరోజు మీరు చేసే పనులన్నింట్లో మంచి ఫలితాలను సాధించే అవకాశం ఉంది. అయితే రహస్య శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశికి అధిపతి అయిన గురువు కారణంగా మీరు సానుకూల ఫలితాలు పొందే అవకాశం ఉంది.
గమనిక : ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు.
Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *