రాశిఫలాలు 21 ఫిబ్రవరి 2026: ధన యోగం ప్రభావంతో మిథునం, కర్కాటకం సహా ఈ 5 రాశులకు విశేష లాభాలు
horoscope today 21 February 2026 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు ధన యోగం వేళ మిథునం, కర్కాటకం సహా ఈ 5 రాశులకు విశేష లాభాలు రానున్నాయి. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే…
మేష రాశి వారికి ఈరోజు కుజుడి ప్రభావంతో శుభ ఫలితాలు రానున్నాయి. మీ జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది. పెండింగులో ఉన్న పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. మీ జీవిత భాగస్వామి నుంచి మీకు మద్దతు లభిస్తుంది. ఈరోజు సాయంత్రం నాటికి మీ ముఖ్యమైన పనులన్నీ పూర్తవుతాయి. మీ పిల్లల నుంచి కొన్ని నిరాశజనకమైన వార్తలు వినొచ్చు. మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు.
వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)
వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)
వృషభ రాశి వారికి ఈరోజు ప్రశాంతంగా ఉంటుంది. రాజకీయ రంగాల్లో తాము చేసే ప్రయత్నాలన్నీ విజయవంతం అవుతాయి. ప్రభుత్వ రంగంలో పని చేసే వారికి సానుకూల ఫలితాలు రానున్నాయి. వ్యాపారులకు కొత్త ఒప్పందాల వల్ల మంచి లాభాలొచ్చే అవకాశం ఉంది. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. కొందరు వ్యక్తుల నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి. మీ వైవాహిక జీవితంలో మిశ్రమ ఫలితాలు రానున్నాయి. మీ పిల్లల నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది.
మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)
మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)
మిథున రాశి వారు ఈరోజు కొన్ని విషయాల గురించి ఆందోళన చెందుతారు. కొన్ని విలువైన వస్తువులను పోగొట్టుకునే అవకాశం ఉంది. అయితే విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం ఉంది. ఈరోజు మీరు కొన్ని అసాధారణ విజయాలు సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈరోజు మీ పెండింగ్ పనులన్నీ పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. ఈరోజు కొన్ని శుభకార్యాల్లో పాల్గొంటారు.
కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)
కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)
కర్కాటక రాశి నుంచి చంద్రుడు ఈరోజు దశమ స్థానంలో సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. మీ జీవనోపాధి రంగంలో మంచి పురోగతి లభిస్తుంది. సమాజంలో మీకు గౌరవం, ప్రతిష్ట పెరుగుతాయి. పిల్లల పట్ల బాధ్యతలు పెరగొచ్చు. మీరు చేసే ప్రయాణం ఆహ్లాదకరంగా, ప్రయోజనకరంగా ఉంటుంది. ఈరోజు మీ ప్రియమైన వారితో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు
సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)
సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)
సింహ రాశి నుంచి సూర్యుడు ఈరోజు సప్తమ స్థానంలో కుంభరాశిలో సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో మీకు కొత్త ఆదాయ వనరులు లభించే అవకాశం ఉంది. అయితే మీ మాటతీరు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ సున్నితమైన ప్రసంగం మీకు గౌరవాన్ని కలిగిస్తుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం ఉంది. మీరు శత్రువులపై విజయం సాధించే అవకాశాలు పొందుతారు. వ్యాపారులకు ఈరోజు మెరుగైన లాభాలు రానున్నాయి.
కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)
కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)
కన్య రాశి నుంచి బుధుడు ఈరోజు సప్తమ స్థానం నుంచి సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో ఉద్యోగులకు అనేక ప్రయోజనాలు కలగనున్నాయి. వ్యాపారులకు తాము చేసే ప్రయత్నాలన్నింట్లో మంచి విజయం లభిస్తుంది. మీరు చేసే నిరంతర ప్రయత్నాల వల్ల అద్భుతమైన విజయాలు సాధిస్తారు. మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది. ఈరోజు కోర్టు సంబంధిత కేసులలో సానుకూల ఫలితాలొస్తాయి. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది.
తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)
తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)
తులా రాశి వారికి ఈరోజు వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యులందరితో ఆనందంగా గడుపుతారు. చాలా కాలంగా పెండింగులో ఉన్న ఆర్థిక లావాదేవీల సమస్యలకు పరిష్కారం లభించొచ్చు. మీరు పెట్టిన పెట్టుబడులకు మంచి రాబడి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు మీరు ప్రత్యర్థుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వారు మిమ్మల్ని ఓడించే ప్రయత్నం చేస్తారు. ఈరోజు మీరు చేసే దూర ప్రయాణాల వల్ల మంచి ఫలితాలను పొందుతారు. మరోవైపు అనారోగ్యం కారణంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి.
వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)
వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)
వృశ్చిక రాశి నుంచి శని దేవుడు పంచమ స్థానంలో సంచారం చేసే సమయంలో మీ వ్యక్తిగత జీవితం మెరుగుపడుతుంది. వివాహితులకు సంతానం గురించి శుభవార్తలు వినిపిస్తాయి. అయితే ఆరోగ్య పరంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఈ సమయంలో మీరు కచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి. మీకు బంధువుల నుంచి గౌరవం లభిస్తుంది. సమాజంలో మీ కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి.
ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)
ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)
ధనస్సు రాశి వారు ఈరోజు చాలా రంగాల్లో సానుకూల ఫలితాలు పొందుతారు. మీరు చేసే పనులకు ప్రత్యర్థుల నుంచి సైతం ప్రశంసలు లభిస్తాయి. మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీకు బంధువుల నుంచి ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలొచ్చే అవకాశం ఉంది. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ కుటుంబ జీవితంలో ఆనందంగా ఉంటుంది.
మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)
మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)
మకర రాశి వారు ఈరోజు కుటుంబ జీవితంలో సంతోషంగా గడుపుతారు. ఆర్థిక పరమైన రంగాల్లో మంచి విజయం సాధిస్తారు. ఈరోజు జీవనోపాధి రంగంలో కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ సహచరుల నుంచి తగినంత గౌరవం, మద్దతు పొందుతారు. మీ తల్లిదండ్రుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీ కుటుంబ జీవితంలో ఆనందంగా ఉంటుంది. వ్యాపారులు మెరుగైన ఫలితాలు పొందుతారు. ఆరోగ్య పరంగా సానుకూల ఫలితాలు రానున్నాయి.
కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)
కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)
కుంభ రాశి వారికి ఈరోజు ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ రాశికి అధిపతి అయిన శని దేవుడు ప్రస్తుతం ఉదయించనున్నాడు. దీంతో మీరు అనవసరమైన వివాదాలు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రతికూల వార్తలు వినడం వల్ల మీరు ఆకస్మిక ప్రయాణం చేయాల్సి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మీ కుటుంబ జీవితంలో విభేదాలను నివారించాలి.
మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)
మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)
మీన రాశి వారు ఈరోజు ఇంటి పనులు చేసుకుంటూ ఆనందంగా గడుపుతారు. మీ వైవాహిక జీవితంలో చాలా కాలంగా ఉన్న విభేదాలు తొలగిపోతాయి. మీ బంధువులతో సత్సంబంధాలు పెరిగే అవకాశం ఉంది. మతపరమైన ప్రదేశాలకు ప్రయాణం చేయడం, దానధర్మాలు చేయడం వల్ల మీ ఖర్చులు పెరగొచ్చు. ఈరోజు ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.