రాశిఫలాలు 20 సెప్టెంబర్ 2025:ఈరోజు బుధాదిత్య యోగం వేళ ధనస్సు, కుంభం సహా ఈ 5 రాశులకు శని దేవుని ప్రత్యేక ఆశీస్సులు..!

 రాశిఫలాలు 20 సెప్టెంబర్ 2025:ఈరోజు బుధాదిత్య యోగం వేళ ధనస్సు, కుంభం సహా ఈ 5 రాశులకు శని దేవుని ప్రత్యేక ఆశీస్సులు..!

horoscope today 20 September 2025 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు బుధాదిత్య యోగం, కేంద్ర యోగాల ప్రభావంతో ధనస్సు సహా ఈ 5 రాశులకు శని దేవుని ప్రత్యేక ఆశీస్సులు లభించనున్నాయి. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే…

horoscope today 20 September 2025 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శనివారం రోజున చంద్రుడు సింహ రాశిలో పగలు, రాత్రి సంచారం చేయనున్నాడు. మరోవైపు సూర్యుడు, బుధుడు కలిసి బుధాదిత్య యోగాన్ని ఏర్పరచనున్నారు. శని, గురుడు కలిసి కేంద్ర యోగాన్ని ఏర్పరచనున్నారు. ఈ శుభ యోగాల వేళ మకరం సహా ఈ 5 రాశుల వారికి విశేష ప్రయోజనాలు కలగనున్నాయి. వ్యాపారులకు ఆశించిన మేరకు లాభాలు రానున్నాయి. ఉద్యోగులకు కెరీర్ పరంగా పురోగతి లభిస్తుంది. మరికొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు అదృష్టం రానుంది. ద్వాదశ రాశుల వారు ఏయే పరిహారాలు పాటించాలనే పూర్తి వివరాలను ఇప్పుడే చూసెయ్యండి.

మీ కుటుంబసభ్యులందరూ వారిని స్వాగతించడంలో బిజీగా ఉంటారు. ఈరోజు చిన్న పిల్లలు సరదాగా గడుపుతారు. ఈరోజు మీరు చేసే ప్రయాణం వల్ల అనేక ప్రయోజనం చేకూరనున్నాయి. మరోవైపు సీనియర్ అధికారితో వాదనకు అవకాశం ఉంది. కాబట్టి దాన్ని నివారించాలి. లేదంటే మీరు నష్టపోవచ్చు. విద్యార్థులు ఈరోజు పోటీ పరీక్షలలో విజయం సాధించడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామితో చిన్న గొడవ జరిగే అవకాశం ఉంది.

ఈరోజు మీకు 72 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు శ్రీ మహా విష్ణువును పూజించాలి.

వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)

మీ స్నేహితులతో కూడా కొంత సమయం ఆనందంగా గడుపుతారు. మరోవైపు వ్యాపారులు తాము చేసే వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాలి. అప్పుడే మీకు లాభాలొస్తాయి. మీ భౌతిక సుఖాలు పెరుగుతాయి. మరోవైపు కుటుంబ ఆస్తికి సంబంధించి ఈరోజు వివాదం తలెత్తొచ్చు. ఈరోజు మీ మాటలను నియంత్రించుకోవాలి. సాయంత్రం, మీ తండ్రి సలహాతో వివాదం పరిష్కారమవుతుంది. విద్యార్థులు కొత్తగా ఏదైనా ప్రయత్నించాలనే కోరికను నెరవేర్చుకుంటారు.

ఈరోజు మీకు 91 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి.

మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)

మిథున రాశి వారిలో ఈరోజు వ్యాపారులు కొత్త ప్రణాళికలు రూపొందిస్తారు. దీని వల్ల భవిష్యత్తులో మీకు మంచి ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. మీకు అప్పుల బాధ నుంచి విముక్తి లభిస్తుంది. మీ స్నేహితుల సాయంతో అనేక పనులను సకాలంలో పూర్తి చేస్తారు. విద్యార్థులు కొన్ని కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం ఉంది. నిరుద్యోగులు అనవసర ఖర్చులకు దూరంగా ఉండాలి. ఈరోజు మీ జీవిత భాగస్వామికి బహుమతి కొనడమే కాదు.. వారిని ఆశ్చర్యపరుస్తారు.

ఈరోజు మీకు 71 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు చీమలకు పిండి పదార్థాలు తినిపించాలి.

కర్కాటక రాశి వారు ఈరోజు ఆధ్యాత్మిక కార్యకలాపాలలో ఎక్కువ సమయం గడుపుతారు. దీంతో మీ మనస్సు సంతోషంగా ఉంటుంది. సమజాంలో మీ గౌరవం కూడా పెరుగుతుంది. మీరు చాలా కాలంగా ఆలోచిస్తున్న పనులు ఈరోజు పూర్తవుతాయి. మీ తల్లిదండ్రుల ఆశీర్వాదాలను పొందుతారు. మీరు ఈరోజు మీ తోబుట్టువులకు కొన్ని సలహాలు ఇవ్వొచ్చు. అది చాలా సహాయకరంగా ఉంటుంది. మీ ప్రేమ జీవితం మరింతగా పెరుగుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించాలంటే మరింత కష్టపడాల్సి ఉంటుంది.

ఈరోజు మీకు 77 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు శ్రీ శివ చాలీసా పారాయణం చేయాలి.

సింహ రాశి వారిలో రాజకీయ నాయకులకు ఈరోజు మెరుగైన ఫలితాలు రానున్నాయి. దీంతో మీ మానసిక పరిస్థితి మెరుగవుతుంది. మీరు చేసే పనిలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మీ ప్రత్యర్థులు బలంగా ఉంటారు. వివేకవంతమైన నిర్ణయాలు ప్రయోజనకరంగా ఉంటాయి. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. ఈరోజు మీకు చాలా రంగాల్లో అదృష్టం కలిసొస్తుంది. మీరు ఉద్యోగ మార్పును పరిశీలిస్తుంటే, ఈ సమయం అనుకూలంగా ఉండకపోవచ్చు. ఈరోజు మీ తండ్రి ఆరోగ్యం క్షీణించొచ్చు. విద్యార్థులు తమ గురువుల ఆశీస్సులను పొందుతారు.

ఈరోజు మీకు 64 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు శివయ్యకు తెల్ల చందనం సమర్పించాలి.

కన్య రాశి వారు ఈరోజు పెండింగ్ పనులను సకాలంలో పూర్తి చేసే అవకాశం ఉంది. గతంలో ఉన్న వివాదాలకు ముగింపు లభించే అవకాశం ఉంది. మీకు శత్రుబాధల నుంచి విముక్తి లభిస్తుంది. మీ కుటుంబంలో ఒక శుభకార్యక్రమాన్ని నిర్వహించొచ్చు. ఖర్చులు తగ్గడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఏదైనా సమస్యపై కుటుంబంలో శత్రుత్వం పెరగొచ్చు. మీ అన్ని పనులను పూర్తి చేసినందుకు బంధువులు మీపై అసూయపడొచ్చు. మీ జీవిత భాగస్వామి సలహా మీ కుటుంబ వ్యాపారం వృద్ధి చెందడానికి సహాయపడుతుంది.

ఈరోజు మీకు 88 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు శివయ్యకు రాగి పాత్రలో నీరు సమర్పించాలి.

తులా రాశి వారిలో ఉద్యోగులకు ఈరోజు కార్యాలయంలో మెరుగైన ఫలితాలు రానున్నాయి. కొన్ని విషయాలకు సంబంధించి బంధువుల నుండి శుభవార్తలు పొందే అవకాశం ఉంది. వ్యాపారంలో ఉన్నవారికి, ఈరోజు సమృద్ధిగా సంపద పెరిగే అవకాశం ఉంది. ఇది మీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేస్తుంది. మీ కుటుంబంతో కలిసి ఒక శుభ కార్యక్రమానికి హాజరు కావొచ్చు. విద్యార్థులు తమ పరీక్షలకు ఇప్పుడే సిద్ధం కావడం ప్రారంభించాలి. అలా చేయకపోతే నష్టాలు సంభవించొచ్చు.

ఈరోజు మీకు 77 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు ‘సంకట హర గణేష్ స్తోత్రం’ పఠించాలి.

వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)

వృశ్చికరాశి వారు ఈరోజు కొత్త వ్యక్తులను కలిసే అవకాశం ఉంది. వారి వల్ల మీకు అనేక ప్రయోజనాలు లభించే అవకాశం ఉంది. ఈరోజు మీరు చాలా దూరం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. దీంతో మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీరు రుచికరమైన ఆహారం, పానీయాలను కనుగొంటారు. మీ ఆహారపు అలవాట్లను నియంత్రించుకోవాలి. అలా చేయకపోతే ఆర్థిక సమస్యలు పెరిగే అవకాశం ఉంది. ఈరోజు మీ పిల్లల భవిష్యత్తు గురించి మీకు కొన్ని ఆందోళనలు ఉండొచ్చు.

ఈరోజు మీకు 98 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు రాత్రి శునకానికి రోటీ తినిపించాలి.

ధనస్సు రాశి వారు ఈరోజు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారులు చేసే కొత్త ప్రణాళికల వల్ల మంచి ఫలితాలొచ్చే అవకాశం ఉంది. భవిష్యత్తులో మీకు గణనీయమైన ఆర్థిక ప్రయోజనాలు రావొచ్చు. భవిష్యత్తు గురించి మీ చింతలను తగ్గిపోతాయి. ఈరోజు మీ తోబుట్టువుల మద్దతు, ఆనందాన్ని పొందే అవకాశం ఉంది. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు కుటుంబసభ్యులతో ప్రత్యేక చర్చలలో ఎక్కువ సమయం గడుపుతారు. మీ రోజులో ఎక్కువ భాగం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంపాదించడానికి గడుపుతారు. మతపరమైన కార్యకలాపాలపై మీ ఆసక్తి పెరుగుతుంది.

ఈరోజు మీకు 63 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు ఉదయం రాగి పాత్రలో సూర్యుడికి నీటితో అర్ఘ్యం సమర్పించాలి.

మకర రాశి వారు ఈరోజు ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీకు నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి, మీరు ఎవరినీ నమ్మాల్సిన అవసరం ఉండదు. ఇది మీ బలాన్ని పెంచుతుంది. మీరు శత్రువులపై ఆధిపత్యం చెలాయిస్తారు. మరోవైపు మీకు మానసిక ఆందోళన పెరిగే అవకాశం ఉంది. మీరు అనారోగ్యానికి కూడా గురి కావొచ్చు. చెడు వాతావరణం మీ ఆరోగ్యానికి కూడా హాని కలిగించొచ్చు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంది. కుటుంబ వ్యాపారంలో మీ జీవిత భాగస్వామి నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది.

ఈరోజు మీకు 96 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు వినాయకుడికి నైవేద్యంగా లడ్డూ సమర్పించాలి.

కుంభ రాశి వారు ఈరోజు కోర్టు సంబంధిత విషయాల్లో సానుకూల ఫలితాలను పొందుతారు. మీ పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. వ్యాపారులు ఈరోజు మంచి లాభాలను పొందే అవకాశం ఉంది. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. మీరు శత్రువులపై ఆధిపత్యం చెలాయిస్తారు. మీరు ఒక మతపరమైన వేడుకకు హాజరయ్యే అవకాశం కూడా పొందొచ్చు. మీ జీవిత భాగస్వామిని ఒక యాత్రకు తీసుకెళ్లొచ్చు. విద్యార్థులు ఈరోజు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో ఆనందంగా ఉంటుంది.

ఈరోజు మీకు 77 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు శ్రీ గణేష్ చాలీసా పారాయణం చేయాలి.

మీన రాశి వారు ఈరోజు మతపరమైన కార్యకలాపాలపై ఆసక్తి చూపుతారు. మీ కుటుంబంలో కొన్ని శుభకార్యాలు నిర్వహించే అవకాశం ఉంది. ఈరోజు మీరు చాలా బిజీగా ఉంటారు. మీరు చేసిన పనులన్నింట్లో మంచి విజయం సాధిస్తారు. విద్యార్థులు తమ ఉపాధ్యాయులకు సేవ చేయడం ద్వారా జ్ఞానాన్ని పొందుతారు. ఈరోజు మీ ఆరోగ్యం క్షీణించొచ్చు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. మీకు రావాల్సిన బకాయిలు తిరిగి పొందుతారు. మీ పిల్లల విజయ వార్తలను మీరు వినొచ్చు.

ఈరోజు మీకు 76 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు గోమాతకు బెల్లం తినిపించాలి.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *