రాశిఫలాలు 18 డిసెంబర్ 2025:ఈరోజు కళానిధి యోగం వేళ మేషం, ధనస్సు సహా ఈ 5 రాశులకు రెండింతల లాభాలు..!

 రాశిఫలాలు 18 డిసెంబర్ 2025:ఈరోజు కళానిధి యోగం వేళ మేషం, ధనస్సు సహా ఈ 5 రాశులకు రెండింతల లాభాలు..!

2025 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు త్రిగ్రాహి యోగం, కళానిధి, బుధాదిత్య యోగాల ప్రభావంతో మేషం, ధనస్సు సహా ఈ 5 రాశులకు శ్రీ మహా విష్ణువు ప్రత్యేక ఆశీస్సులు లభించనున్నాయి. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే…

horoscope today 18 December 2025 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గురువారం రోజున వృశ్చికరాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై అనురాధ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే సమయంలో చంద్రుడు, శుక్రుడు, బుధుడి, సూర్యుడి ప్రభావంతో కళానిధి యోగం, బుధాదిత్య, శుక్రాదిత్య యోగాలు ఏర్పడనున్నాయి. ఈ శుభ యోగాల వేళ మేషం, ధనస్సు సహా ఈ 5 రాశులకు విశేష ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ కాలంలో మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. వ్యాపారులకు మంచి లాభాలు రానున్నాయి. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు అదృష్టం రానుంది. 12 రాశుల వారు ఎలాంటి పరిహారాలు పాటించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం…

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)
​మేష రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. కెరీర్ పరంగా ఈరోజు పురోగతి లభిస్తుంది. ఉద్యోగులు సీనియర్ అధికారుల నుంచి గణనీయమైన ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. మీరు పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడంలో విజయం సాధిస్తారు. ఈరోజు మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. సహోద్యోగుల నుంచి మంచి సహకారం లభిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి. వ్యాపారులు మంచి లాభాలను పొందే అవకాశం ఉంది. మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ భాగస్వామి నుంచి సంపూర్ణ మద్దతు పొందుతారు.

ఈరోజు మీకు 84 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు పేదలకు అరటి పండ్లను దానం చేయాలి.

వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)
​వృషభ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు రానున్నాయి. ఈ రాశి నుంచి ఈరోజు గురుడు రెండో స్థానంలో, కేతువు నాలుగో స్థానంలో, సప్తమ స్థానంలో శుక్రుడు సంచారం చేయనున్నారు. ఈ సమయంలో మీరు చేసే పనుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులకు లాభాలు రావాలంటే మరింత కష్టపడాలి. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థి బలోపేతం అవుతుంది.

ఈరోజు మీకు 69 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు శ్రీహరికి ప్రత్యేక పూజలు చేయాలి.

మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)
​మిథున రాశి వారికి ఈరోజు శుభఫలితాలు రానున్నాయి. ఈరోజు మీరు చేసే పనులన్నింట్లో మంచి విజయాలు సాధించే అవకాశం ఉంది. కెరీర్ పరంగా మంచి పురోగతి లభిస్తుంది. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. అనారోగ్యంతో ఉండే వ్యక్తులకు మంచి ఉపశమనం లభిస్తుంది. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. వ్యాపారవేత్తలు మంచి లాభాలను పొందే అవకాశం ఉంది. ఈరోజు మీరు కొత్త ప్రాజెక్టులను ప్రారంభించే అవకాశం ఉంది.

ఈరోజు మీకు శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు విష్ణు సహ్రసనామ పారాయణం చేయాలి.

కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)
కర్కాటక రాశి వారికి ఈరోజు మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగులకు కెరీర్ పరంగా మంచి పురోగతి లభిస్తుంది. మీరు చేసే పనులకు ప్రశంసలు లభిస్తాయి. ఆర్థిక పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. ఉద్యోగులు కార్యాలయంలో సహోద్యోగుల నుంచి సహకారం పొందుతారు. మీరు పెట్టే పెట్టుబడులకు మంచి లాభాలొస్తాయి. మీకు రావాల్సిన బకాయిలను తిరిగి పొందుతారు.

ఈరోజు మీకు 86 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు లక్ష్మీనారాయణ మంత్రాలను పఠించాలి.

సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)
సింహ రాశి వారు ఈరోజు అద్భుతమైన ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. మీరు చేసే పనులన్నింట్లో మంచి విజయం సాధిస్తారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈరోజు సమయం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరంగా మంచి లాభాలను పొందే అవకాశాలున్నాయి. వ్యాపారులకు ఈరోజు మెరుగ్గా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. ఈ రాశి నుంచి గురుడు 11వ స్థానంలో, నాలుగో స్థానంలో శుక్రుడు సంచారం వేళ శుభ ఫలితాలు రానున్నాయి.

ఈరోజు మీకు 67 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు వినాయకుడికి లడ్డూ నైవేద్యంగా సమర్పించాలి.

కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)
కన్య రాశి వారికి ఈరోజు మెరుగైన ప్రయోజనాలు కలగనున్నాయి. ఉద్యోగులకు కార్యాలయంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మీరు చేసే పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. మీ పనికి ఉన్నతాధికారులు ముగ్ధులవుతారు. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. ఈరోజు మీరు స్నేహితులు, బంధువుల నుంచి మద్దతు పొందుతారు. మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో ఆనందంగా గడుపుతారు.

ఈరోజు మీకు 78 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు పేదలకు ఆహారం దానం చేయాలి.

తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)
తులా రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగులకు కార్యాలయంలో సానుకూల ఫలితాలు రానున్నాయి. ఈరోజు మీరు కొత్త ఒప్పందాలపై సంతకాలు చేసుకుంటారు. మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. పెట్టుబడి పెట్టేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది. మీ ప్రియమైన వారితో ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. సినిమా, మీడియా, రైల్వే రంగాలలో పని చేసే వారికి ఈరోజు లాభదాయకంగా ఉంటుంది.

ఈరోజు మీకు 83 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు హనుమాన్ చాలీసా పఠించాలి.

వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)
వృశ్చిక రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు రానున్నాయి. అయితే ఈరోజు మీరు కొన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు ఊహించని ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. మీరు డబ్బు ఆదా చేయడంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీ కుటుంబ జీవితంలో వివాదాలన్నీ ముగుస్తాయి. పోలీస్, రైల్వే రంగాల్లో పని చేసే వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. ఆర్థిక పరంగా మెరుగ్గా ఉంటుంది.

ఈరోజు మీకు 90 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు శ్రీహరి మంత్రాలను పఠించాలి.

ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)
ధనస్సు రాశి వారికి ఈరోజు కెరీర్ పరంగా మంచి పురోగతి లభిస్తుంది. మీరు చేసే పనిలో ఏవైనా సమస్యలు లేదా ఒత్తిడిని ఎదుర్కొంటుంటే, వాటికి పరిష్కారం లభిస్తుంది. మీకు ప్రభుత్వ రంగాల్లో మంచి విజయాలు లభిస్తాయి. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. ఇటీవల మీరు ఏదైనా ఇంటర్వ్యూ ఇచ్చినట్లయితే మీకు శుభవార్తలు వినిపించే అవకాశం ఉంది. మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది. ఈరోజు మీరు కొత్త విషయాలను నేర్చుకునేందుకు ఆసక్తి చూపుతారు. ఆధ్యాత్మిక రంగాలపై ఆసక్తి చూపుతారు. దీంతో మీకు మానసికంగా ప్రశాంతత లభిస్తుంది.

ఈరోజు మీకు 90 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు గాయత్రీ మంత్రాలను పఠించాలి.

మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)
మకర రాశి వారికి ఈరోజు అనేక వనరుల నుంచి మంచి ప్రయోజనాలు కలగనున్నాయి. వ్యాపారులకు మీ ఆదాయం పెరుగుతుంది. ఈరోజు ఏదైనా కొత్త ప్రాజెక్టును ప్రారంభిస్తే భవిష్యత్తులో మంచి లాభాలొచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులకు కార్యాలయంలో సహద్యోగులు, ఉన్నతాధికారుల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తుంది. మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీకు విదేశీ వనరుల నుంచి మంచి ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. మీ ఆదాయం రెండింతలు పెరిగే అవకాశం ఉంది.

ఈరోజు మీకు 88 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు తులసి చెట్టుకు నీరు, నైవేద్యం సమర్పించాలి.

కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)
కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)
కుంభ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు రానున్నాయి. ఉద్యోగులు ఈరోజు సహోద్యోగుల నుంచి మంచి సహకారం పొందుతారు. అంతేకాదు కష్టమైన పనులను సులభంగా పూర్తి చేస్తారు. ఈరోజు మీరు ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. వైద్యం, ఇంజనీరింగ్, మార్కెటింగ్, వ్యవసాయం, పరిశ్రమ రంగాల్లో ఉండే వ్యక్తులకు కష్టానికి తగిన ఫలితాలొస్తాయి.

ఈరోజు మీకు 79 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు వినాయకుడికి లడ్డూ నైవేద్యంగా సమర్పించాలి.

మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)
మీన రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. కళా రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు రానున్నాయి. ఆర్థిక పరంగా ఈరోజు మెరుగ్గా ఉంటుంది. వ్యాపారులకు మంచి లాభాలొచ్చే అవకాశం ఉంది. ఈరోజు పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. మీ కష్టానికి తగిన ఫలితాలొస్తాయి. మీరు చేసే పనులన్నింట్లో మంచి ఫలితాలొస్తాయి.

ఈరోజు మీకు 74 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు గాయత్రీ మంత్రాన్ని జపించాలి.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *