రాశిఫలాలు 07 ఫిబ్రవరి 2026:ఈరోజు త్రికోణ యోగం వేళ సింహం, ధనస్సు సహా ఈ 5 రాశులకు శని దేవుని ప్రత్యేక ఆశీస్సులు..!

 రాశిఫలాలు 07 ఫిబ్రవరి 2026:ఈరోజు త్రికోణ యోగం వేళ సింహం, ధనస్సు సహా ఈ 5 రాశులకు శని దేవుని ప్రత్యేక ఆశీస్సులు..!

horoscope today 07 February 2026 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు త్రికోణ యోగం వేళ సింహం, ధనస్సు సహా ఈ 5 రాశులకు అద్భుత ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే…

horoscope today 07 February 2026 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శనివారం రోజున చంద్రుడు తులా రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై చిత్రా నక్షత్ర ప్రభావం ఉంటుంది. మరోవైపు శుక్రుడు, గురుడు, బుధుడు చంద్రుడి ప్రభావంతో గజకేసరి, త్రికోణ యోగాలు ఏర్పడనున్నాయి. ఈ శుభ యోగాల వేళ సింహం, దనస్సు సహా ఈ 5 రాశులకు శని దేవుని ప్రత్యేక అనుగ్రహం లభించనుంది. ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు కలగనున్నాయి. కెరీర్, కుటుంబ జీవితంలో ఆనందంగా ఉంటుంది. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు అదృష్టం రానుంది. 12 రాశుల వారు ఎలాంటి పరిహారాలు పాటించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం…

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)
​మేష రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. ఈరోజు పెండింగులో ఉన్న అనేక పనులు సులభంగా పూర్తయ్యే అవకాశం ఉంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం గురించి శుభవార్తలు వినిపిస్తాయి. మీ చింతలన్నీ తొలగిపోతాయి. మీరు ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు. మీ కుటుంబ జీవితంలో సంతోషకరంగా ఉంటుంది. మీరు పొరుగువారితో మంచి సంబంధాన్ని కలిగి ఉంటారు.

ఈరోజు మీకు 82 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు లక్ష్మీదేవిని పూజించాలి.

వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)
​వృషభ రాశి వారికి ఈరోజు అనేక ప్రయోజనాలు కలగనున్నాయి. అందరితో మీరు స్నేహపూర్వక సంబంధాలను కొనసాగిస్తారు. మీరు చేసే వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. సమాజంలో మీరు గౌరవాన్ని పొందుతారు. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగం గురించి శుభవార్తలు వినిపిస్తాయి. యువత తమకు నచ్చిన జీవిత భాగస్వామిని కనుగొనడంలో సంతోషంగా ఉంటారు.

ఈరోజు మీకు 85 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు గోమాతకు పచ్చి గడ్డి సమర్పించాలి.

మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)
మిథున రాశి వారికి ఈరోజు అనేక రంగాల్లో సానుకూల ఫలితాలు రానున్నాయి. మీరు చేసే పనుల్లో మంచి ఫలితాలొస్తాయి. ఈరోజు మీరు కొత్త విషయాలు నేర్చుకునేందుకు ఆసక్తి చూపుతారు. మీ పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగులకు కార్యాలయంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. సహోద్యోగులతో పాటు సీనియర్ అధికారుల మద్దతు కూడా లభిస్తుంది. వ్యాపారులకు ఈరోజు మంచి లాభాలొచ్చే అవకాశాలున్నాయి.

ఈరోజు మీకు 60 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు తల్లిదండ్రుల ఆశీస్సులు పొందాలి.

కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)
కర్కాటక రాశి వారికి ఈరోజు ఆరోగ్య పరంగా కొంత ఇబ్బందులు ఎదురవుతాయి. మీరు ఈరోజంతా కొంత ఆందోళన చెందొచ్చు. మీరు చేసే పనులన్నీ సకాలంలో పూర్తి చేయడానికి చాలా కష్టపడతారు. అయితే ఓపికగా పని చేయడం వల్ల మీరు విజయం సాధిస్తారు. మరోవైపు మీకు ప్రత్యర్థుల నుంచి ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీరు చాలా కష్టపడి పని చేస్తారు.

ఈరోజు మీకు 72 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు గురువులు లేదా పెద్దల ఆశీస్సులు తీసుకోవాలి.

సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)
సింహ రాశి వారికి ఈరోజు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈరోజు తమ భవిష్యత్తు గురించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. కాబట్టి ఈ కాలంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మరోవైపు గ్రహాల శుభ సంచారం కారణంగా మీకు అనేక రంగాల్లో సానుకూల ఫలితాలు రానున్నాయి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. స్నేహితులు, బంధువుల నుంచి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. మీ భాగస్వామితో కలిసి విహారయాత్రకు ప్లాన్ చేస్తారు.

ఈరోజు మీకు 92 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు వినాయకుడికి లడ్డూ నైవేద్యంగా సమర్పించాలి.

కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)
కన్య రాశి వారికి ఈరోజు గొప్ప ప్రయోజనాలు కలగనున్నాయి. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. మీ ఆదాయాన్ని పెంచుకునేందుకు కొత్తగా మంచి అవకాశాలు లభిస్తాయి. మీ కుటుంబ జీవితంలో ఆనందంగా ఉంటుంది. విద్యార్థులు విద్య పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వ్యాపారులు ఈరోజు మెరుగైన ఫలితాలు పొందే అవకాశం ఉంది.

ఈరోజు మీకు 84 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు శివ చాలీసా పారాయణం చేయాలి.

తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)
తులా రాశి వారికి ఈరోజు ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీరు ఏదైనా ఒక ప్రాజెక్టులో పని చేయొచ్చు. వ్యాపారవేత్తలు నిజాయితీగా వ్యవహరించాలి. మీ ప్రియమైన వ్యక్తితో నాణ్యమైన సమయం గడుపుతారు. ఆర్థిక పరమైన విషయాలు బలపడతాయి. దీంతో మీకు ఒత్తిడి తగ్గుతుంది. మీ ఇంట్లో పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్ గురించి శుభవార్తలు వినిపిస్తాయి.

ఈరోజు మీకు 85 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు సరస్వతీ దేవిని పూజించాలి.

వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)
వృశ్చిక రాశి వారు ఈరోజు చాలా సంతోషంగా గడుపుతారు. మీకు రావాల్సిన బకాయిలను తిరిగి పొందుతారు. ఈరోజు అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవాలి. మీ జీవిత భాగస్వామితో కొత్త ప్రణాళికలు రూపొందిస్తారు. మీ శక్తి, సామర్థ్యం మేరకు దానధర్మాలు కూడా చేస్తారు. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. వ్యాపారులు ఈరోజు మెరుగైన లాభాలు పొందే అవకాశం ఉంది. ఉద్యోగులు కార్యాలయంలో జాగ్రత్తగా ఉండాలి.

ఈరోజు మీకు 95 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు తెల్లని వస్తువులను దానం చేయాలి.

ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)
ధనస్సు రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు రానున్నాయి. ఈరోజు మీరు చేసే పనులన్నీ సులభంగా పూర్తవుతాయి. మీ సంపద పెరిగే అవకాశం ఉంది. ఈరోజు మీరు చేసే ప్రతి ప్రయత్నంలో మంచి విజయం సాధిస్తారు. మీరు చాలా ఉత్సాహంగా గడుపుతారు. స్నేహితులతో సరదాగా గడిపేందుకు సమయం అభిస్తుంది. ఈ కారణంగా మీకు అనేక ప్రయోజనాలు లభిస్తాయి. వ్యాపారులు మంచి లాభాలు పొందే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా పరిస్థితి బలోపేతం అవుతుంది.

ఈరోజు మీకు 72 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు శివలింగానికి పాలు సమర్పించాలి.

మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)
మకర రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు రానున్నాయి. ఈరోజు ఇతరులతో రాజకీయ చర్చలకు దూరంగా ఉండాలి. కొత్తగా ఏదైనా చేసేందుకు చాలా ఉత్సాహాన్ని చూపుతారు. ఆహారం, పానీయాల వ్యాపారులకు ఈరోజు సమయం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు గురువులు, సీనియర్ల నుంచి సహకారం లభిస్తుంది.

ఈరోజు మీకు శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు చీమలకు పిండి పదార్థాలు తినిపించాలి.

కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)
కుంభ రాశి వారు ఈరోజు గణనీయమైన విజయాలు సాధిస్తారు. ఆర్థిక పరంగా మెరుగ్గా ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణిస్తారు. మీరు శత్రువులపై విజయం సాధిస్తారు. అయితే వ్యాపారులు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో మిశ్రమ ఫలితాలు రానున్నాయి. ఉద్యోగులు కార్యాలయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

ఈరోజు మీకు 92 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు హనుమంతుడికి సింధూరం సమర్పించాలి.

మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)
మీన రాశి వారు ఈరోజు పనులన్నీ సకాలంలో పూర్తి చేసే అవకాశం ఉంది. మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. మీరు చేసే పనుల్లో ఎదురయ్యే ఆటంకాలన్నీ తొలగిపోతాయి. కాబట్టి మీరు ఈరోజు చాలా సంతోషంగా ఉంటారు. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. భాగస్వామ్యంతో చేసే వ్యాపారులకు మంచి లాభాలు రానున్నాయి. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.

ఈరోజు మీకు 85 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు వినాయకుడికి లడ్డూ నైవేద్యంగా సమర్పించాలి.

గమనిక : ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు.

 

 

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *