రాశిఫలాలు 06 ఏప్రిల్ 2026: ఈరోజు సిద్ధి యోగం ప్రభావంతో మేషం, కన్య సహా కొన్ని రాశులకు శుభ ఫలితాలు

 రాశిఫలాలు 06 ఏప్రిల్ 2026: ఈరోజు సిద్ధి యోగం ప్రభావంతో మేషం, కన్య సహా కొన్ని రాశులకు శుభ ఫలితాలు

రాశిఫలాలు 06 ఏప్రిల్ 2026: ఈరోజు సిద్ధి యోగం ప్రభావంతో మేషం, కన్య సహా కొన్ని రాశులకు శుభ ఫలితాలు

horoscope today 06 April 2026 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు సిద్ధి యోగం ప్రభావంతో మేషం, కన్య సహా ఈ 5 రాశులకు పెద్ద శుభవార్తలు వినిపించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే.

Daily Astro

horoscope today 06 April 2026 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సోమవారం రోజున చంద్రుడు తులా రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై అనురాధ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈ పవిత్రమైన రోజు శివయ్యకు అంకితం చేయబడింది. గ్రహాల కదలికను బట్టి ఈరోజు అనేక శుభ యోగాలు ఏర్పడనున్నాయి. ఈ సందర్భంగా కొన్ని రాశుల వారికి శివయ్య అనుగ్రహం లభించనుంది. మరోవైపు శుక్రుడు భరణి నక్షత్రంలోకి, కుజుడు ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి ప్రవేశించనున్నారు. ఈ కారణంగా మేషం, మిథునం సహా కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు రానున్నాయి. మరికొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు శుభ ఫలితాలు రానున్నాయి, ఎవరికి అశుభ ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ప్రముఖ పండితులు ‘‘ఆచార్య క్రిష్ణ దత్త శర్మ’’ మాటల్లో తెలుసుకుందాం.

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)
​మేష రాశి వారికి ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. మీ సానుకూల ఆలోచనల కారణంగా మీ పనులు సకాలంలో పూర్తయ్యే అవకాశం ఉంది. మీ ప్రతిభను మెరుగుపరచుకోవచ్చు. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. సాయంత్రం మీ తోబుట్టువులతో సరదాగా గడుపుతారు. మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి నుంచి కొన్ని శుభవార్తలు వింటారు. ఆర్థిక పరంగా సాధారణంగా ఉంటుంది. మీ ఇంటి నిర్వహణకు సంబంధించి ఖర్చులు పెరగొచ్చు. మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ కుటుంబ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది.

వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)
వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)

వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)
​వృషభ రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉండొచ్చు. మీరు చేసిన పనికి ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారులు ఈరోజు మెరుగైన లాభాలు పొందే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి బలోపేతం కావొచ్చు. వ్యాపారులకు మంచి లాభాలొచ్చే అవకాశాలున్నాయి. మీ ప్రేమ జీవితంలో సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నించాలి. మీ కుటుంబంలో సంతోషం, శాంతి నెలకొంటాయి. మీ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.

మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)

మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)
మిథున రాశి వారికి ఈరోజు అద్భుతమైన ఫలితాలొచ్చే అవకాశం ఉంది. మీకు రావాల్సిన బకాయిలు తిరిగి పొందొచ్చు. వ్యాపారులకు మెరుగైన లాభాలు రావొచ్చు. ఏదైనా కొత్త వ్యాపారం ప్రారంభించే ముందు పెద్దల సలహా తీసుకోవచ్చు. పెట్టుబడి పెట్టేందుకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు మతపరమైన కార్యకలాపాలు, ఆధ్యాత్మికత పట్ల మీ ఆసక్తి పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో పాల్గొనడం కారణంగా మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది.

కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)

కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)
కర్కాటక రాశి వారికి ఈరోజు కొన్ని ఒడిదుడుకులు ఎదురుకావొచ్చు. ఎవరినీ గుడ్డిగా నమ్మకండి. మీ తల్లిదండ్రుల సలహాలు, సూచనలు పాటించడం ద్వారా వ్యాపారంలో రాణించొచ్చు. మీరు పోగొట్టుకున్న ఒక ముఖ్యమైన వస్తువు మీకు తిరిగి లభించొచ్చు. మీ పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. వ్యాపారులకు మెరుగైన లాభాలు రానున్నాయి. మీ ఆర్థిక పరిస్థితి బలోపేతం కావొచ్చు. పాత పెట్టుబడులకు మంచి లాభాలు రావొచ్చు. మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)

సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)
సింహ రాశి వారికి ఈరోజు అనేక ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. ఇంతకుముందు చేసిన పనులకు సానుకూల ఫలితాలొచ్చే అవకాశం ఉంది. మీ ఇంటి పనులను చాలా తెలివిగా పూర్తి చేస్తారు. కెరీర్ పరంగా మంచి పురోగతి సాధించే అవకాశం ఉంది. మీకు రావాల్సిన బకాయిలు తిరిగి పొందడంతో సంతోషంగా ఉంటారు. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ ప్రేమ సంబంధాలు మెరుగుపడే అవకాశం ఉంది.

కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)

కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)
కన్య రాశి వారికి ఈరోజు ఆనందకరంగా ఉంటుంది. ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగం గురించి శుభవార్తలు వినిపిస్తాయి. మీ వైవాహిక జీవితం సామరస్యంగా ఉంటుంది. రాజకీయాల్లో ఉండే వ్యక్తులకు మంచి గుర్తింపు లభిస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది. మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఉంది.

తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)

తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)
తులా రాశి వారికి ఈరోజు అద్భుతమైన ఫలితాలొచ్చే అవకాశం ఉంది. పెండింగ్ పనులను పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. మీ ఇంట్లో పండుగ వాతావరణం ఉంటుంది. కెరీర్ పరంగా పురోగతి లభిస్తుంది. దీంతో మీకు మనశ్శాంతి లభిస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అయితే మీ ఖర్చులు కూడా పెరగొచ్చు. మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ ఆరోగ్యం మెరుగుపడటం కారణంగా ఒత్తిడి తొలగిపోతుంది.

వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)

వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)
వృశ్చిక రాశి వారు సానుకూల ఫలితాలను పొందే అవకాశం ఉంది. మీకు రావాల్సిన బకాయిలను తిరిగి పొందొచ్చు. ఈ కారణంగా మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. సమాజ సేవ పట్ల మీకు ఆసక్తి పెరుగుతుంది. ఈరోజు ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలి. మీ ప్రయాణం ఆహ్లాదకరంగా మారొచ్చు. విద్యార్థులకు గురువుల నుంచి మద్దతు లభిస్తుంది. మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ భాగస్వామితో బంధం మరింత బలపడొచ్చు. ఆరోగ్య పరంగా మెరుగ్గా ఉంటుంది.

ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)

ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)
ధనస్సు రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగం గురించి శుభవార్తలు వినిపిస్తాయి. ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వ్యక్తులకు సహోద్యోగుల నుంచి మద్దతు లభిస్తుంది. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి సమయం అనుకూలంగా ఉంటుంది. మీ కష్టానికి తగిన ఫలితాలొచ్చే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా మెరుగ్గా ఉంటుంది. మీ ప్రేమ జీవితంలో సంతోషకరంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా మెరుగ్గా ఉంటుంది.

మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)

మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)

మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)
మకర రాశి వారికి ఈరోజు అద్భుతమైన ఫలితాలొచ్చే అవకాశం ఉంది. మీకు ఆకస్మిక ధన లాభం కలిగే అవకాశాలున్నాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం ఉంది. సమాజంలో మీ గౌరవం, హోదా పెరుగుతాయి. వ్యాపారులకు మెరుగైన ప్రయోజనాలు లభించే అవకాశం ఉంది. మీ ఆర్థిక పరిస్థితి బలోపేతం అవుతుంది. మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. బయటి ఆహారం తీసుకోకుండా ఉండాలి.

కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)

కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)
కుంభ రాశి వారు ఈరోజు మిశ్రమ ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఈరోజు మీరు చేసే పనులన్నీ సకాలంలో పూర్తి చేయాల్సి ఉంటుంది. మీ పెండింగ్ పనులు పూర్తవ్వడం కారణంగా మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. మరోవైపు వ్యాపారులు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ అహంకారాన్ని పక్కనపెట్టి ప్రణాళికలను అమలు చేయాలి. మీ తోబుట్టువుల మధ్య విభేదాలు అంతమై, సంబంధాలు మరింత బలపడతాయి. మీ పిల్లలకు సమయం కేటాయించాలి. నిరుద్యోగులకు ఉద్యోగం గురించి శుభవార్తలు వినిపిస్తాయి. ఆర్థిక పరంగా గొప్ప విజయాలు సాధిస్తారు.

మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)

మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)
మీన రాశి వారికి ఈరోజు ప్రతికూల ఫలితాలొచ్చే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మీ ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఈరోజు ఒకేసారి అనేక పనులు చేయాల్సి వస్తుంది. కాబట్టి ముందుగా ముఖ్యమైన పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలి. ఈరోజు ప్రత్యర్థులు మీ పనులకు ఆటంకాలు కలిగించొచ్చు. ఈ కారణంగా మానసికంగా కొంత ఇబ్బంది ఉంటుంది. మీ ప్రత్యర్థులు మీ పనులకు ఆటంకాలు కలిగించొచ్చు. ఈ సమయంలో స్నేహితుల సహాయం తీసుకోవడం కారణంగా పరిస్థితులు మెరుగుపడే అవకాశం ఉంది.

గమనిక : ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు.

“హాయ్ వీవర్స్ …. మీ మంచి మనస్సుతో ఓటింగ్ చేయండి. om namah shivaya”

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *