రాశిఫలాలు 05 మార్చి 2026: ఈరోజు చంద్రుడి ప్రభావంతో కర్కాటకం, కుంభం సహా ఈ 4 రాశులకు ఆర్థిక పురోగతి

 రాశిఫలాలు 05 మార్చి 2026: ఈరోజు చంద్రుడి ప్రభావంతో కర్కాటకం, కుంభం సహా ఈ 4 రాశులకు ఆర్థిక పురోగతి

రాశిఫలాలు 05 మార్చి 2026: ఈరోజు చంద్రుడి ప్రభావంతో కర్కాటకం, కుంభం సహా ఈ 4 రాశులకు ఆర్థిక పురోగతి

horoscope today 05 March 2026 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు చంద్రుడు కన్యా రాశిలో సంచారం చేయడం కారణంగా కుంభ రాశి వారికి శుభ ఫలితాలొచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే.
horoscope today 05 March 2026 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గురువారం రోజున చంద్రుడు కన్య రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై ఉత్తర ఫాల్గుణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. మరోవైపు కుంభ రాశిలో బుధుడి తిరోగమనం, సూర్యుడు, కుజుడి ప్రభావంతో కుంభం సహా కొన్ని రాశుల వారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది. మీ వ్యక్తిగత జీవితంలో సానుకూల ఫలితాలు రావొచ్చు. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు శుభ ఫలితాలు రానున్నాయి, ఎవరికి అశుభ ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ప్రముఖ పండితులు ‘‘ఆచార్య క్రిష్ణ దత్త శర్మ’’ మాటల్లో తెలుసుకుందాం.

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)
మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)
​మేష రాశి వారికి ఈరోజు కుజుడి ప్రభావంతో కెరీర్ పరంగా పురోగతి లభించే అవకాశం ఉంది. మీరు చేసే పనులన్నింట్లో మంచి విజయం సాధించొచ్చు. అయితే బుధుడి తిరోగమనం కారణంగా కొన్ని రంగాల్లో ప్రతికూల ఫలితాలు రావొచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవాలి. మీ బడ్జెట్‌కు తగ్గట్టు ఖర్చులు చేయాలి. రాహువు, కుజుడి కలయిక కారణంగా తొందరపాటు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపొచ్చు. అయితే వీటిని నివారించడం మంచిది. ఆరోగ్య పరంగా కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.

వృషభ రాశి వారి ఫదలితాలు (Taurus Horoscope Today)
వృషభ రాశి వారి ఫదలితాలు (Taurus Horoscope Today)

వృషభ రాశి వారి ఫదలితాలు (Taurus Horoscope Today)
​వృషభ రాశి వారు ఈరోజు పెండింగులో ఉన్న పనులను పూర్తి చేయడంలో సక్సెస్ సాధించొచ్చు. కెరీర్ పరంగా పురోగతి లభించొచ్చు. మరోవైపు ఉద్యోగులకు కార్యాలయంలో పనిభారం ఉండొచ్చు. కాబట్టి సహోద్యోగులతో సమన్వయం చేసుకోవాలి. మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. అయితే అనవసర ఖర్చులు చేయకుండా ఉండాలి. మీ బడ్జెట్ బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నించాలి. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. ఈరోజు మధ్యాహ్నం కొన్ని శుభవార్తలు వినే అవకాశం ఉంది.

మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)

మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)

మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)
మిథున రాశి వారికి ఈరోజు బుధుడి తిరోగమనం కారణంగా ప్రతికూల ఫలితాలొచ్చే అవకాశం ఉంది. ఈరోజు పెండింగులో ఉన్న ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఆర్థిక పరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు పెట్టుబడులు పెట్టేందుకు సమయం అనుకూలంగా ఉండదు. కాబట్టి నిపుణులను సంప్రదించాలి. మరోవైపు మీ తండ్రి ఆశీస్సులు, ఉన్నతాధికారుల అనుగ్రహంతో విలువైన వస్తువు లేదా ఆస్తిని సంపాదించాలనే మీ కోరిక ఈరోజు నెరవేరొచ్చు. మీ మనోధైర్యం పెరుగుతుంది.

కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)

కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)

కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)
కర్కాటక రాశి వారికి ఈరోజు చంద్రుడి అనుగ్రహంతో శుభ ఫలితాలొచ్చే అవకాశం ఉంది. ఈ రాశి నుంచి గురుడు 12వ స్థానంలో సంచారం చేయడం కారణంగా ఆకస్మిక ధనలాభం పొందే అవకాశం ఉంది. మీ ఆర్థిక పరిస్థితి బలోపేతం కావొచ్చు. మీ వ్యాపార ప్రణాళికలు ఊపందుకుంటాయి. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. అయితే ఈరోజు భావోద్వేగంతో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి. ఈరోజు ఆధ్యాత్మిక ప్రాంతాలను సందర్శిచడం ద్వారా మానసిక ప్రశాంతత పొందొచ్చు.

సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)

సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)

సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)
సింహ రాశి వారిలో రాజకీయ రంగాల్లో ఉండే వారికి ఈరోజు మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ పిల్లల పట్ల బాధ్యతలన్నీ నెరవేర్చే అవకాశాలున్నాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణిస్తారు. మీ పెండింగ్ పనులు కూడా పూర్తవ్వొచ్చు. కెరీర్ పరంగా మంచి పురోగతి సాధిస్తారు. అయితే ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మరోవైపు ఆన్‌లైన్ లావాదేవీల్లో చాలా అప్రమత్తంగా ఉండాలి. మీ ఆర్థిక పరిస్థితి బలోపేతం చేసుకునే ప్రణాళికలు రచించాలి.

కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)

కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)

కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)
కన్య రాశి వారు ఈరోజు బుధుడి అనుగ్రహంతో సానుకూల ఫలితాలు పొందే అవకాశం ఉంది. కెరీర్ పరంగా మీకు పురోగతి లభించొచ్చు. మీ పెండింగ్ పనులను సకాలంలో పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. మీ శక్తి, సామర్థ్యాల మేరకు దానధర్మాలు చేస్తారు. మీ ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఈరోజు ఖరీదైన వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంది. అయితే పొదుపుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.

తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)

తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)

తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)
తులా రాశి వారికి ఈరోజు కష్టానికి తగిన ఫలితాలొస్తాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం ఉంది. ఉద్యోగులు కార్యాలయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఊహించని ఖర్చులు మీ ఆందోళనను పెంచుతాయి. మీ ఆర్థిక పరిస్థితి బలోపేతం చేసుకునే ప్రయత్నం చేయాలి. మీ జీవిత భాగస్వామి నుంచి అన్ని రంగాల్లో మద్దతు లభిస్తుంది. ఈరోజు మీరు చేసే ప్రయాణం ఆహ్లాదకరంగా ఉంటుంది.

వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)

వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)

వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)
వృశ్చిక రాశి వారికి ఈరోజు కెరీర్ పరంగా పురోగతి లభించే అవకాశం ఉంది. మార్కెటింగ్ రంగంలో ఉండే వారికి సానుకూల ఫలితాలు రావొచ్చు. మీరు ప్రత్యర్థులపై విజయం సాధించొచ్చు. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. మీ ఆదాయం పెరుగుతుంది. మీ పెండింగ్ పనులన్నీ పూర్తయ్యే అవకాశం ఉంది. సాయంత్రం మీ ప్రియమైన వారిని కలుస్తారు. ఈరోజు విహారయాత్రకు ప్లాన్ చేస్తారు. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది.

ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)

ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)

ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)
ధనస్సు రాశి వారికి ఈరోజు తాము చేసే పనుల్లో సానుకూల ఫలితాలు రానున్నాయి. మీ కష్టానికి తగిన ఫలితాలొచ్చే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా మెరుగ్గా ఉంటుంది. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టేందుకు సమయం అనుకూలంగా ఉండొచ్చు. కోర్టు సంబంధిత కేసుల్లో తీర్పు మీకు అనుకూలంగా రాకపోవచ్చు. ఈరోజు మీకు రావాల్సిన బకాయిలు తిరిగొ పొందాలంటే చాలా కష్టపడాలి. ఉద్యోగులు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి.

మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)

మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)

మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)
మకర రాశి వారిలో వ్యాపారులకు ఈరోజు ఆశించిన మేరకు లాభాలొచ్చే అవకాశం ఉంది. మీ ఆర్థిక పరిస్థితి గతంలో కంటే మెరుగ్గా ఉంటుంది. కెరీర్ పరంగా మంచి పురోగతి కోసం కొత్త ప్రణాళికలు సిద్ధం చేసే అవకాశం ఉంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించొచ్చు. ఉద్యోగులు కార్యాలయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పోటీ పరీక్షల్లో పాల్గొనే అభ్యర్థులు మంచి విజయం సాధించొచ్చు. ఈరోజు మతపరమైన ప్రదేశాలకు ప్రయాణం చేస్తారు.

కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)

కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)

కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)
కుంభ రాశి వారు ఈరోజు శని దేవుని ప్రభావంతో వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ కారణంగా మీరు ఖర్చులు చేయాల్సి ఉంటుంది. ఈరోజు ఏదైనా ఆస్తిని కొనడానికి లేదా విక్రయించడానికి ముందు, అన్ని విషయాలను జాగ్రత్తగా పరిశీలించాలి. ఇదే రాశిలో రాహువు, కుజుడు, సూర్యుడు, బుధుడి సంచారం కారణంగా మిశ్రమ ఫలితాలు రానున్నాయి.

మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)

మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)

మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)
మీన రాశి వారికి ఈరోజు వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. ఈరోజు దగ్గర లేదా దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. వ్యాపారులు మంచి లాభాలు పొందే అవకాశాలున్నాయి. ఉద్యోగులకు కెరీర్ పరంగా పురోగతి లభించొచ్చు. విద్యార్థులు విద్యకు సంబంధించిన సమస్యల నుంచి ఉపశమంన పొందొచ్చు. ఈరోజు సాయంత్రం కొన్ని శుభవార్తలు వింటారు. మీ మనసులో చాలా సంతోషంగా ఉంటుంది. ఈరోజు తల్లిదండ్రుల సలహాలు, ఆశీస్సుల వల్ల మంచి విజయాలు సాధించే అవకాశం ఉంది.

గమనిక : ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *