మహా శివరాత్రి వేళ మీ రాశిని బట్టి శివ మంత్రాలను జపిస్తే.. మానసిక ఒత్తిడి తొలగిపోతుందట..!

 మహా శివరాత్రి వేళ మీ రాశిని బట్టి శివ మంత్రాలను జపిస్తే.. మానసిక ఒత్తిడి తొలగిపోతుందట..!

Lord Shiv Mantra మహాశివరాత్రి అంటే శివునికి ఎంతో ప్రీతికరమైనది. ఈ పర్వదినాన శివయ్య అనుగ్రహం పొందడానికి మీ రాశి ప్రకారం, కొన్ని మంత్రాలను పఠించాలి. ఈ సందర్భంగా ద్వాదశ రాశుల వారు ఏ మంత్రాలను జపిస్తే శుభ ఫలితాలొస్తాయనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం…

Lord Shiv Mantra హిందూ మత విశ్వాసాల ప్రకారం, మహా శివరాత్రి ఎంతో పవిత్రమైనది. ఈ సమయంలో పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. ముఖ్యంగా మహా శివరాత్రి వేళ ఉపవాస దీక్షను ఆచరించడం వల్ల తమ కోరికలన్నీ నెరవేరుతాయని చాలా మంది నమ్ముతారు. అంతేకాదు శివయ్య తన భక్తులపై ప్రత్యేక అనుగ్రహం చూపుతాడని పండితులు చెబుతారు. అదే విధంగా మీ శక్తి సామర్థ్యాల మేరకు శివ లింగానికి జలాభిషేకం, పాలు, పెరుగు, తేనే, నెయ్యితో అభిషేకం చేయడం వల్ల విశేష ఫలితాలొస్తాయి. ఇదిలా ఉండగా జ్యోతిష్యం ప్రకారం శివుని పూజా సమయంలో మీ రాశి ప్రకారం ఈ మంత్రాలను జపించడం వల్ల శుభ ఫలితాలొస్తాయి. అంతేకాదు మీ కుటుంబ జీవితంలో ఆనందం, శ్రేయస్సు పెరుగుతాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారు ఏయే మంత్రాలను పఠించాలనే ఆసక్తికరమైన విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం…

మేష రాశి(Aries)..
​మేష రాశి వారు మహా శివరాత్రి వేళ ‘ఓం మహాకాళ నమః’, ‘ఓం అర్ధనారీశ్వర నమః’, ఓం చిత్రవర్ణాయ నమః’, ‘ఓం నమః శివాయ’ అనే మంత్రాలను జపించాలి. ఈ మంత్రాలను జపించడం వల్ల శివయ్య ఆశీస్సులు లభిస్తాయి. అంతేకాదు మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది.

వృషభ రాశి(Taurus)..
​వృషభ రాశి వారు మహా శివరాత్రి వేళ ‘ఓం అవ్యాయ నమః’, ‘ఓం విశ్వనాథ నమః’, ‘ఓం నాగేశ్వరాయ నమః’ అనే మంత్రాలను జపించడం వల్ల శివయ్య అనుగ్రహం లభిస్తుంది.

మిథున రాశి(Gemini)..
మిథున రాశి వారు మహాశివరాత్రి సమయంలో చంద్రుడి ప్రసన్నం చేసుకోవడానికి ‘ఓం నాగధారి నమః’, ‘ఓం విష్టారి నమః’ అనే మంత్రాలను పఠించాలి.

కర్కాటక రాశి(Cancer)..
కర్కాటక రాశి వారు మహాశివరాత్రి కాలంలో శివయ్య ఆశీస్సుల కోసం ‘ఓం రామేశ్వర నమః’, ‘ఓం సీతాంగయ నమః’, ‘ఓం చంద్రమౌళేశ్వర నమః’ అనే మంత్రాన్ని 108 సార్లు భక్తితో జపించాలి.

సింహ రాశి(Leo)..
సింహ రాశి వారు మహా శివరాత్రి వేళ ‘ఓం బంలేహరి నమః’, ‘ఓం సింహదంతాయ నమః’, ‘ఓం రుద్రనాథ నమః’ ‘ఓం మహాకాళయ నమః’ అనే మంత్రాలను జపించాలి. ఇలా చేయడం వల్ల మీ జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నింటికీ పరిష్కారం లభిస్తుంది.

కన్య రాశి(Virgo)..
కన్య రాశి వారు మహా శివరాత్రి వేళ ‘ఓం పశుపతి నమః’, ‘ఓం నవగ్రహయుతాయ నమ’, ‘ఓం త్రిపురారి నమః’ అనే మంత్రాన్ని పఠించడం వల్ల శివయ్య అనుగ్రహంతో అనేక రంగాల్లో విజయం సాధిస్తారు.

తులా రాశి (Libra)..
తులా రాశి వారు మహా శివరాత్రి వేళ శివుని పూజా సమయంలో ‘ఓం దేవదేవేశ్వర నమః’, ‘ఓం శుభరాయ నమః’,‘ఓం దిననాథ నమః’ ‘ఓం నందీశ్వరాయ నమః’ అనే మంత్రాలను జపించాలి.

వృశ్చిక రాశి(Scorpio)..
వృశ్చిక రాశి వారు మహా శివరాత్రి వేళ ‘ఓం విశ్వనాథ నమః’, ‘ఓం లఘుదేహయ నమః’ ‘ఓం మహేశ్వర నమః’ అనే మంత్రాన్ని జపించాలి.

ధనస్సు రాశి (Sagittarius)..
ధనస్సు రాశి వారు మహా శివరాత్రి వేళ మహాదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి ‘ఓం మల్లికార్జున నమః’, ‘ఓం దేవదేవేశ్వర నమః’ ‘ఓం నమో శివాయ, గురుదేవాయ అనే మంత్రాలను ఐదు సార్లు జపించాలి.

మకర రాశి(Capricorn)..
మకర రాశి వారు మహా శివరాత్రి వేళ ‘ఓం త్రిలోకిన్రేష్ నమః’, ‘ఓం శుక్రమిత్రాయ్ నమః’, ‘ఓం శివదానీ నమః’ అనే మంత్రాన్ని జపించాలి. ఈ మంత్రాన్ని శివ పూజ సమయంలో పఠించడం వల్ల శుభ ఫలితాలొస్తాయి.

కుంభ రాశి(Aquarius)..
కుంభ రాశి వారు మహా శివరాత్రి వేళ ‘ఓం విష్దారి నమః’, ‘ఓం మహాశీర్షాయ నమః’, ‘ఓం పాతాలేశ్వర నమః’ అనే మంత్రాన్ని పఠించడం వల్ల మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు.

మీన రాశి(Pisces)..
మీన రాశి వారు మహా శివరాత్రి వేళ శివుని పూజా సమయంలో ‘ఓం త్రినేత్రధారి నమః’, ‘ఓం మహాదేవ నమః’,‘ఓం గురు దేవాయ నమః’ అనే మంత్రాన్ని ఐదు సార్లు జపించాలి.

గమనిక : ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *