నేడు రాజమండ్రి, రాజానగరంలో చంద్రబాబు పర్యటన

 నేడు రాజమండ్రి, రాజానగరంలో చంద్రబాబు పర్యటన

నేడు రాజమండ్రి, రాజానగరం నియోజకవర్గల్లో టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఇక ఇవాళ ఉదయం 11 గంటలకు రాజమండ్రి బివిఆర్ శ్రీ ఫంక్షన్ హాల్ లో మేధవులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు బాబు. అనంతరం ఫంక్షన్ హాల్ నుండి మోరంపూడి, లాలాచెరువు జంక్షన్, కాతేరు మీదుగా మధ్యాహ్నం 1గంటకు సీతానగరం మండలం పురుషోత్తంపట్నం ఎత్తిపోతల పథకం ఫేజ్-1 వద్దకు చేరుకుంటారు.

మధ్యాహ్నం 1.30 వరకూ పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ఫేజ్-1ను చంద్రబాబు నాయుడు పరిశీలిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు పురుషోత్తమపట్నం గ్రామం నుండి బయలుదేరి సీతానగరం, రాపాక రోడ్, ఎడిఎ ఫీల్డ్స్, కోటికేశవరం, శ్రీరంగపట్నం మీదుగా మధ్యాహ్నం 3 గంటలకు కోరుకొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం వద్దకు చేరుకుంటారు.శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం వద్ద నుండి రోడ్ షో ప్రారంభించి సాయంత్రం 4గంటలకు బస్టాండ్ సెంటరుకు చేరుకుంటారు. సాయంత్రం 5 గంటల వరకూ అక్కడ బహిరంగసభలో ప్రసంగిస్తారు. సాయంత్రం 5 గంటలకు చంద్రబాబు నాయుడు కోరుకొండలో బయలుదేరి కత్తిపూడి, అనకాపల్లి, ఆనందపురం మీదుగా రాత్రి 10 గంటలకు విజయనగరంలోని అశోక్ బంగాళాకు చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు.

ఇవి కూడా చ‌ద‌వండి
బాబు డేరింగ్ స్టెప్..మాజీ ఎమ్మెల్యేలనే సైడ్ చేసేశారుగా.!
175 స్థానాల్లో పోటీ చేసేందుకు టిడిపికి అభ్యర్థులే లేరు – మంత్రి మేరగ నాగార్జున
రాయలసీమకు నీళ్ళిస్తే రతనాల సీమగా మారుతుంది – చంద్రబాబు
జగన్ అక్రమాలపై… ఈ వాట్సాప్ నంబర్ కు సమాచారం ఇవ్వండి – చంద్రబాబు

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *