తొడకొట్టి తన వృత్తిని అవమాన పరిచారు… బాలయ్య రియాక్షన్!

 తొడకొట్టి తన వృత్తిని అవమాన పరిచారు… బాలయ్య రియాక్షన్!

అసెంబ్లీలో జరిగిన సంఘటన తలచుకుంటే ఎందో బాదగా ఉందని మొదలుపెట్టిన బాలకృష్ణ, అది ఎంతో పవిత్రమైన దేవాలయం అని అన్నారు.

తాజాగా ఈ రోజు జరిగిన అసెంబ్లీ తొలి రోజు సభలో బాలకృష్ణ హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. అయితే సభ నుంచి సస్పెండ్ అయిన అనంతరం తన వెర్షన్ వినిపించే ప్రయత్నంలో భాగంగా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మైకుల ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో జరిగిన విషయాన్ని వివరంగా చెప్పే ప్రయత్నం చేశారు.

అసెంబ్లీలో జరిగిన సంఘటన తలచుకుంటే ఎందో బాదగా ఉందని మొదలుపెట్టిన బాలకృష్ణ, అది ఎంతో పవిత్రమైన దేవాలయం అని అన్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు సభలో నియంతృత్వ ధోరణిలో జరిగిందని, అలా జరగడం చాలా బాధాకరమని అన్నారు. ఈ సందర్భంగా తన తండ్రి ఎన్ టీఆర్ ప్రపంచంలో ఎవరూ కనీవినీ ఎరుగని పథకాలు ప్రవేశపెట్టి.. రాష్ట్రానికి ఒక గుర్తింపు తెచ్చుకొచ్చారని తెలిపారు.

ఇక చంద్రబాబు ఒక బ్రాండ్ అని, ఎంతోమంధికి ఆత్మవిశ్వాసం కలిగించారని.. అలాంటి మనిషి మీద ఎలాంటి ఆధారాలు లేని స్కిల్ డెవలప్ మెంట్ స్కాం అని పెట్టారని అన్నారు. దీని వెనుక ఉన్న ఉద్దేశ్యం ఏమిటో ఎవరికీ అర్ధం కావడం లేదని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ప్రజక్షేమాన్ని గాలికీ వదిలేసి, ప్రతిపక్ష నాయకులపై కక్షసాధింపు చర్యలే ఈ ప్రభుత్వ ఉద్దేశ్యంగా ఉందని అన్నారు. అనంతరం తొడగొట్టడంపై స్పందించారు బాలయ్య!

ఈ రోజు సభలో ముందుగా అంబటి రాంబాబు వేలు చూపించి, మీసం మెలేశారని, తర్వాత తొడకొట్టారని.. అంటే తన వృత్తిని అవమానపరిచారని, దానికి తాను రియాక్ట్ అయ్యానని బాలకృష్ణ చెప్పుకొచ్చారు. “వెళ్లి సినిమాల్లో చేసుకోవయా” అని తనను అంటే… అప్పుడు తాను కూడా మీసం మెలేసి, తొడకొట్టినట్లు బాలయ్య అంగీకరించారు. అనంతరం “రా చూసుకుందాం అంటే.. రా చూసుకుందాం అన్నాను” అని తెలిపారు.

ఈ సందర్భంగా తాను ఎవరికీ భయపడే రకాన్ని కాదని, కేసులు పెడితే భయపడనని.. వాటిని న్యాయపరంగానూ, ప్రజా పక్షంలోనూ తేల్చు కుంటామని చెప్పారు. ఇదే సమయంలో ఇండస్ట్రీ జనాలు రియాక్ట్ కాకపోవడంపై స్పందించిన బాలకృష్ణ… ఎవరూ తనలా ధైర్యంగా మాట్లాడలేరని చెప్పారు. ఇండస్ట్రీలో ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి, అవి తనకు అనవసరం అని అన్నారు.

తాను ఏదో హుందాగా కుర్చుంటానని వారు ఎక్స్ పెక్ట్ చేశారని.. తాను అలా రియాక్ట్ అయ్యేసరికి వాళ్లకు ఏమీ అర్ధం కాలేదని అన్నారు. దీంతో తొడకొట్టి, మీసం మెలేస్తే అది బాలయ్య వృత్తిని అవమానపరిచినట్లు ఎలా అవుతుందనే కామెంట్లు వెలువడుతున్నాయి!

కాగా… అసెంబ్లీలో బాలకృష్ణ తొడకొట్టడంపై వైసీపీ నేతలు విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. నాడు ఎన్టీఆర్ పై చెప్పులు వేయించినప్పుడు చంద్రబాబు ముందు తొడకొట్టి, మీసం మెలేసి ఉంటే తెలుగు ప్రజలు హర్షించేవారని వారు సూచిస్తున్నారు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *