ఈరోజు రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 07.09.2023 గురువారం
జ్యోతిష శాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
వారం: గురువారం, తిథి: అష్టమి,
నక్షత్రం: రోహిణి, మాసం: శ్రావణం,
సంవత్సరం: శోభకృత్ నామ, అయనం: దక్షిణాయనం1. మేషం రాశి ఫలాలు 2023
1.మేషరాశి ఫలాలు 2023
మేషరాశి వారికి ఈ రోజు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. పనుల యందు చికాకులు. అక్కరలేని మాటలు పడవలసివస్తుంది. ఆవేశపూరిత ఘర్షణ వాతావరణం ఏర్పడును. మీరు చేసే పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా మధ్యస్థం. కుటుంబ మరియు ఆరోగ్య విషయాల్లో చెడు ఫలితాలున్నాయి. దక్షిణామూర్తిని చూడడం, దక్షిణామూర్తి స్తోత్రాలను పఠించడం చేత సమస్యలు తొలగి శుభఫలితాలు కలుగుతాయి.
==========================================================================
2.వృషభం రాశి ఫలాలు 2023
వృషభ రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి. స్త్రీలు ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోవాలి. వ్యాపారంలో ఖర్చులు నియంత్రించుకోవాలి. ధనపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. రైతాంగం, సినీరంగం వారికి కలసివచ్చేటటువంటి రోజు. ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించాలి. శ్రీగురుచరిత్ర పఠించడం దత్తాత్రేయ స్తోత్రాన్ని పఠించడం వలన శుభఫలితాలు కలుగుతాయి.
===========================================================================
3.మిథునం రాశి ఫలాలు 2023
మిథున రాశి వారికి ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేదు. ఉద్యోగంలో పనిఒత్తిళ్ళు అధికం. చికాకులతో కూడిన వాతావరణం. కుటుంబములో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడును. ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన. వ్యాపారస్తులకు అనుకున్న సమయానికి ధనము చేతికి అందదు. రాజకీయ నాయకులకు ఈరోజు అనుకూలంగా లేదు. భార్యాభర్తల మధ్య భేదాభిప్రాయం కలుగు సూచన. ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించాలి.
========================================================================
4.కర్కాటకం రాశి ఫలాలు 2023
కర్కాటక రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి. మీరు చేసే పనులలో పురోగతి ఏర్పడును. మీరు చేసే పనులు సత్ఫలితాలిస్తాయి. వృత్తి ఉద్యోగపరంగా మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. కుటుంబపరంగా అనుకూలం. ఆరోగ్యం మధ్యస్థం. లక్ష్మీ అష్టోత్తరం చదవాలి. దక్షిణామూర్తిని చూడడం మరియు దక్షిణామూర్తి స్తోత్రాలను పఠించడం చేత సమస్యలు తొలగి శుభఫలితాలు కలుగుతాయి.
==========================================================================
సింహరాశి ఫలాలు 2023
సింహరాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా మధ్యస్థం నుండి అనుకూలం. ఒత్తిళ్ళు అధికం. రాజకీయాలకు, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి. ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోకూడదు. స్త్రీలకు అనుకూలం. రైతాంగం, సినీరంగం వారికి కలసివచ్చే రోజు. విద్యార్థులకు మంచి సమయం. ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించాలి. శ్రీగురుచరిత్ర పఠించడం, దత్తాత్రేయ స్తోత్రాన్ని పఠించడం వలన శుభఫలితాలు కలుగుతాయి.
============================================================================
6.కన్య రాశి ఫలాలు 2023
కన్యారాశి వారికి ఈరోజు మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నది. ఆర్థిక సమస్యల నుండి బయట పడడానికి మీరు చేసే పనులు సత్ఫలితాలిస్తాయి. వ్యాపారస్తులకు అనుకూలం. ధనపరమైనటువంటి లాభాలు కలుగును. విద్యార్థులకు కలసివచ్చే రోజు. రైతాంగం, సినీరంగం వారికి మంచి సమయం. స్త్రీలు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. గురు బలం కోసం శనగలు దానం చేయాలి.
=============================================================================
7.తులారాశి రాశి ఫలాలు 2023
తులారాశి వారికి ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేదు. ఆగ్రహ ఆవేశాలకు దూరంగా ఉండాలి. ఆవేశంతో నిర్ణయాలు తీసుకోరాదు. కుటుంబ విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రయాణాలు, ఖర్చులు అధికమగును. ఉద్యోగస్తులకు మధ్యస్థం సమయం. వ్యాపారస్తులకు చెడు సమయం. విద్యార్థులకు, రైతాంగం వారికి అనుకూలంగా లేదు. దక్షిణామూర్తిని చూడడం, దక్షిణామూర్తి స్తోత్రాలను పఠించడం చేత సమస్యలు తొలగి శుభఫలితాలు కలుగుతాయి.
=============================================================================
8.వృశ్చికం రాశి ఫలాలు 2023
వృశ్చిక రాశి వారికి ఈ రోజు మీకు చెడు ఫలితాలు అధికముగా ఉన్నాయి. ఆరోగ్య విషయాల్లో ఖచ్చితమైన జాగ్రత్తలు వహించాలి. వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా మధ్యస్థం నుండి చెడు సమయం. గొడవలకు దూరంగా ఉండటం మంచిది. ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోరాదు. ప్రశాంతంగా ఉండాలి. విద్యార్థులకు అంత అనుకూలంగా లేదు. ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించాలి. శ్రీగురుచరిత్ర పఠించడం, దత్తాత్రేయ స్తోత్రాన్ని పఠించడం వలన శుభఫలితాలు కలుగుతాయి.
====================================================================================
9.ధనుస్సు రాశి ఫలాలు 2023
ధనూరాశి వారికి ఈరోజు మీకు అన్ని విధాలుగా అనుకూల ఫలితాలు ఉన్నాయి. మీరు చేసే పనులు సఫలీకృతమవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు. ఉద్యోగస్తులకు శుభ సమయం. స్థానచలన మార్పులు సత్ఫలితాలిస్తాయి. కుటుంబ సభ్యులతో ఆహ్లాదంగా గడుపుతారు. ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం శనగలు దానమివ్వాలి. బ్రాహ్మణులకు గానీ, ముత్తయిదువలకు గానీ తాంబూలం, శనగలను దానమివ్వడం మంచిది.
======================================================================================
10.మకరం రాశి ఫలాలు 2023
మకర రాశివారికి ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేదు. మీరు చేసే పనుల్లో చికాకులు అధికం. గొడవలకు దూరంగా ఉండాలి. ఉద్యోగస్తులకు పని ఒత్తిళ్ళు, చికాకులు అధికం. స్త్రీలు ఆరోగ్యపరంగా, కుటుంబపరంగా ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులకు మధ్యస్థ సమయం. రైతాంగం, సినీరంగం వారికి అంత అనుకూలంగా లేదు. గణపతినీ, సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. శుభం కలుగుతుంది.
==========================================================================================
11.కుంభం రాశి ఫలాలు 2023
కుంభరాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. కుటుంబంలో సమస్యలేర్పడును. వ్యాపారస్తులకు సమయానికి ధనం సర్దుబాటు కాదు. అప్పులు చేయవలసిన పరిస్థితి ఏర్పడును. విద్యార్థులకు కష్టపడవలసిన సమయం. ఉద్యోగస్తులకు రాజకీయ ఒత్తిళ్ళు అధికం. ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించాలి. శ్రీగురుచరిత్ర పఠించడం, దత్తాత్రేయ స్తోత్రాన్ని పఠించడం వలన శుభఫలితాలు కలుగుతాయి.
======================================================================================
12.మీనం రాశి ఫలాలు 2023
మీన రాశి వారికి ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేదు. ఖర్చులు అధికమవ్వడం. రావలసిన ధనం సమయానికి చేతికి అందదు. అనవసరంగా మాట పడవలసి వస్తుంది. స్రీలకు కుటుంబ సభ్యులతో అనుకోని చికాకులు కలుగును. రైతాంగం, సినీరంగం వారికి మధ్యస్థ సమయం. ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం శనగలతో చేసిన ప్రసాదాన్ని నివేదన చేసి అది ప్రసాదంగా పంచిపెట్టాలి.
===========================================================================================