ఈరోజు రాశి ఫలాలు (దిన ఫలాలు) 03.09.2023
ఈరోజు రాశి ఫలాలు (దిన ఫలాలు) 03.09.2023 ఆదివారం కోసం జ్యోతిష శాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు.
వారం: ఆదివారం, తిథి: చవితి
నక్షత్రం: రేవతి, మాసం: శ్రావణం,
సంవత్సరం: శోభకృత్ నామ, అయనం: దక్షిణాయనం
1. మేషం రాశి ఫలాలు 2023
మేషరాశి వారికి ఈ రోజు అనుకూల ఫలితాలు ఉన్నాయి. అదృష్టం వరిస్తుంది. మనోభీష్టాలు సిద్ధిస్తాయి. బంధుమిత్రుల నుంచి సహకారం ఉంటుంది. కొందరు ఇబ్బంది కలిగించాలని చూసినా, మీ ధర్మాచరణే మిమ్మల్ని కాపాడుతుంది. అనవసర విషయాల్లో తలదూర్చరాదు. ఆదివారం సుబ్రహ్మణ్యుని పూజించడం, సూర్యభగవానుని ఆరాధించడం వల్ల శుభం కలుగుతుంది.
==========================================================================
2.వృషభం రాశి ఫలాలు 2023
వృషభ రాశి వారికి ఈ రోజు శుభయోగాలు ఉన్నాయి. పెద్దలు ప్రశంసలు పొందుతారు. ఖర్చు అదుపు తప్పకుండా జాగ్రత్తపడాలి. ఒక పనిలో విజయం సాధిస్తారు. మనసుకు ఇబ్బంది కలిగించే సంఘటనలుంటాయి. అలాంటి సమయాల్లో తెలివిగా ప్రవర్తిస్తే మంచిది. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. మొహమాటం కారణంగా శ్రమ పెరుగుతుంది. ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయడం మంచిది.
===========================================================================
3.మిథునం రాశి ఫలాలు 2023
మిథునరాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉంది. పనులు సకాలంలో పూర్తి అవుతాయి. రుణ సమస్యలు ఎదురవుతాయి. మిత్రుల సాయంతో ఆర్ధిక నష్టాన్ని నివారిస్తారు. సమాజంలో పేరు ప్రతిష్టలుంటాయి. ఆధ్యాత్మికంగా మంచి కాలం. బలమైన ప్రయత్నంతో అభివృద్ధిని సాధిస్తారు. కలహ సూచన ఉన్నది. తొందపడి మాట్లాడితే ఇతరులు అపార్ధం చేసుకునే ప్రమాదం ఉన్నది. మనశ్శాంతికి విష్ణుమూర్తిని స్మరించాలి. సూర్యాష్టకం పఠించాలి.
========================================================================
4.కర్కాటకం రాశి ఫలాలు 2023
కర్కాటక రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థం నుండి చెడు ఫలితాలు అధికముగా ఉన్నాయి. ఆచితూచి వ్యవహరించాలి. వ్యతిరేక పరిస్థితులు ఉన్నాయి. ఆర్ధికంగా నష్టం రాకుండా చూసుకోవాలి. ధైర్యంతో ముందుకు సాగండి. సమిష్టి నిర్ణయాలు తీసుకోవాలి. అవసరాలకు సాయపడడేవారున్నారు. అనారోగ్యం నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి. ఉద్యోగ వ్యాపారాల్లో ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళిక సిద్ధం చేసుకోండి. లక్ష్మీ అష్టోత్తరం చదవాలి. నవగ్రహ పీడాహర స్తోత్రం పఠించాలి. శుభం కలుగుతుంది.
==========================================================================
సింహం :- సింహరాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థం నుండి అనుకూలంగా ఉన్నది. శుభవార్తలు వింటారు. గతంలో కాని పనుల్ని ఇప్పుడు పూర్తి చేస్తారు. సమాజంలో మీకంటూ ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. ఆత్మీయులను కలుస్తారు. గౌరవం పెరుగుతుంది. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురుకావచ్చు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఖర్చు చేయాలి. ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండాలి. ఒక వార్త ఆనందాన్నిస్తుంది. శివారాధన శుభప్రదం.
============================================================================
6.కన్య రాశి ఫలాలు 2023
కన్యారాశి వారికి ఈ రోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నది. ఉత్సాహంగా పనిచేస్తే విజయం వరిస్తుంది. అవసరాలకు డబ్బు అందుతుంది. విఘ్నాలను అధిగమిస్తారు. ఆలోచనా విధానంలో పరిపక్వత వస్తుంది. బాధ్యతాయుతంగా వ్యవహరించి అందరి మన్ననలూ అందుకుంటారు. మిత్రబలం పెరుగుతుంది. శత్రుపీడ తొలగుతుంది. వివాదాలకు తావివ్వకండి. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆదిత్య హృదయం పారాయణ చేయడం శుభకరం.
=============================================================================
7.తులారాశి రాశి ఫలాలు 2023
తులారాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఉంటాయి. కష్టపడితేనే విజయం. కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. కుటుంబ సభ్యులకు శుభకాలం. భగవదనుగ్రహంతో ముఖ్యమైన పని పూర్తవుతుంది. శుభవార్త వింటారు. పట్టుదలతో వ్యవహరిస్తే బంగారు భవిష్యత్తు మీ సొంతం. కొన్ని సందర్భాల్లో మనసుకు భయం కలుగుతుంది. ఒత్తిడిని జయించాలి. వారాంతంలో శుభయోగం ఉన్నది. తులారాశి వారు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే ఆదివారం రోజు నవగ్రహ పీడాహర స్తోత్రం పఠించడం మంచిది.
=============================================================================
8.వృశ్చికం రాశి ఫలాలు 2023
వృశ్చిక రాశి వారికి ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేదు. ఆర్థికంగా శక్తివంతులవుతారు. మేధాసంపత్తితో విజయాన్నందుకుంటారు. విఘ్నాలను అవలీలగా అధిగమిస్తారు. పక్కనే ఉంటూ ఇబ్బంది పెట్టే వారుంటారు జాగ్రత్త. సంకోచింకుండా నిర్ణయాలు తీసుకోవాలి. పెద్దల మాటలు ప్రేరణనిస్తాయి. ప్రలోభాలకు లొంగరాదు. శుభకార్యాల్లో పాల్గొంటారు. విందూ వినోదాలతో కాలం గడుస్తుంది. శని స్తోత్రం చదువుకోవాలి
====================================================================================
9.ధనుస్సు రాశి ఫలాలు 2023
ధనూరాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థముగా ఉన్నది. వ్యాపార లాభాలు ఉన్నాయి. వృథా ప్రయాణాలుంటాయి. వారం మధ్యలో మేలు జరుగుతుంది. ఆరోగ్యంపై శద్ద వహించాలి. వ్యయాలు పెరగకుండా జాగ్రత్తపడాలి. కొత్త వస్తువులు కొంటారు. పెద్దల ఆదరాభిమానలున్నాయి. లక్ష్యంపై దృష్టిపెడితే విజయం మీదే. ఆత్మవిశ్వాసంతో పనిచేయండి. భూ లాభమున్నది. ధనూరాశివారు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే సూర్యాష్ట్రకాన్ని పఠించాలి.
======================================================================================
10.మకరం రాశి ఫలాలు 2023
మకర రాశివారికి ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేదు. వ్యయభారం విషయంలో జాగ్రత్తపడాలి. వ్యతిరేకంగా మాట్లాడేవారున్నారు జాగ్రత్త. ఎవరినీ విమర్శించరాదు. ప్రమాదాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం అనుకూలించును. ప్రయాణాలు కలసివస్తాయి. ఆర్ధికంగా మిశ్రమకాలం. పట్టుదల అవసరం. ధర్మచింతనతో వ్యవహరించాలి. మకరరాశివారు మరింత శుభ ఫలితాలు పొందాలనుకుంటే నవగ్రహ శాంతి చేసుకోవడం మంచిది. ఈ రోజు నవగ్రహ ఆలయాలను దర్శించడం మంచిది. సూర్యాష్టకాన్ని పఠించండి.
==========================================================================================
11.కుంభం రాశి ఫలాలు 2023
కుంభరాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థం సమయం. అభీష్టాలు నెరవేరుతాయి. శ్రమ అవసరం. ఆర్థిక విజయం ఉంది. శక్తివంచన లేకుండా పనిచేస్తే సంతృప్తికర ఫలితాల్ని సాధిస్తారు. ఒక విషయంలో పెద్దలను కలుస్తారు. ఫలితం అనుకూలంగా వస్తుంది. ఆస్తి వృద్ధి అవుతుంది. శుభయోగాలున్నాయి. ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. విందూ వినోదాల్లో పాల్గొంటారు. ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయాలి. నువ్వులతో చేసిన ప్రసాదాన్ని ఆలయాల్లో పంచి పెట్టండి. శుభం కలుగుతుంది.
======================================================================================
12.మీనం రాశి ఫలాలు 2023
మీన రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థముగా ఉన్నది. మనస్సు పెట్టి పని చేయండి. మంచి ఫలితాలను సాధిస్తారు. ఏ విషయంలోనూ అశ్రద్ధ వద్దు. ఆర్థికంగా అనుకూల ఫలితాలు ఉన్నాయి. ధైర్యం, ఏకాగ్రత రెండూ ముఖ్యం. నిర్ణయాల్లో మిత్రుల సూచనలు తీసుకోవాలి. నవగ్రహస్తోత్రం పారాయణ చేయండి. విష్ణుసహస్రనామ పారాయణ చేయడం వలన శుభ ఫలితాలు కలుగును.
===========================================================================================