హైదరాబాద్ నగరంలో బస్సుల్లో ప్రయాణించేవారికి అలర్ట్. ఈనెల 21 నుంచి 24 వరకు సిటీ బస్సుల్లో ప్రయాణించేవారు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవటమో.. ప్రత్యామ్నాయమార్గాలు చూసుకోవటమో చేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే మేడారం జాతర సందర్భంగా బస్సులు అక్కడికి వెళ్తుండటంతో నగరంలో బస్సుల సంఖ్య తగ్గనుంది. గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలో తిరిగే 2,850 సిటీ బస్సుల్లో దాదాపు 2 వేల వరకు మేడారం జాతరకు వెళ్లనున్నాయి. ఇప్పటికే కొన్ని బస్సులను ఆర్టీసీ అధికారులు జాతరకు కేటాయించారు. ఈ […]Read More
ఎన్టీఆర్ జిల్లాలో పూలకు భారీ డిమాండ్ వచ్చింది. మాఘ మాసం కావడంతో మల్లెల సీజన్ మొదలైంది. శుభకార్యాలు ముమ్మరంగా జరుగుతుండటంతో మల్లెలకు గిరాకీ పెరిగింది. సీజన్లో ఆశించిన స్థాయిలో దిగుబడులు రాకపోవటంతో వారం రోజులుగా ధరలు పెరిగాయి. మల్లెలకు ప్రసిద్ధి గాంచిన మైలవరం మండలంలోని చండ్రగూడెం మార్కెటులో ఆదివారం కిలో రూ.1,200 పలికింది. అయితే రోజుకు సగటున 50 కిలోల దిగుబడులు మించటం లేదని రైతులు చెబుతున్నారు. అందుకే సాధారణ దిగుబడులు సమయంలో కిలో రూ.200ల లోపే […]Read More
తెలంగాణ కుంభమేళా, ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ అయిన మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర సమీపిస్తోంది. వనదేవతలను దర్శించుకునేందుకు లక్షలాది జనం తరలిరానుండగా.. వచ్చే భక్తులంతా ముందుగా ములుగు సమీపంలోని గట్టమ్మ తల్లికి మొక్కులు చెల్లిస్తుంటారు. ఆ తరువాత మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు తరలుతుంటారు. వివిధ ప్రాంతాల్లో గట్టమ్మ తల్లికి ఆలయాలు కట్టి పూజలు చేస్తున్నప్పటికీ మేడారం వెళ్లే భక్తులు మాత్రం ఇక్కడ తప్పనిసరిగా మొక్కులు సమర్పించుకోవడం ఆనవాయితీ. దీంతోనే అమ్మవారికి మొదటి మొక్కుల తల్లిగా పేరుంది. మేడారం వెళ్లే భక్తులతో […]Read More
తిరుమలలో రథసప్తమికి విస్తృత ఏర్పాట్లు 2024: రథసప్తమి వేడుకకు విస్తృత ఏర్పాట్లు చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని రకాల సౌకర్యాలను కల్పించాలని అధికారులను ఈవో ధర్మారెడ్డి ఆదేశించారు. సూర్య జయంతి సందర్భంగా ఫిబ్రవరి 16వ తేదీ రథసప్తమి పర్వదినాన్ని నిర్వహించనుంది టీటీడీ(TTD). ఈ వేడుకకు విచ్చేసే వేలది మంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా టీటీడీలోని అన్ని విభాగాలు సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేయాలని ఆలయ ఈవో ఎవి.ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుమల […]Read More
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి భక్తుడు కంచర్ల గోపన్న (భక్త రామదాసు) విగ్రహం తొలిసారిగా వెలుగులోకి వచ్చింది. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి పోలీస్‌స్టేషన్ ఆవరణలో విగ్రహం లభ్యం కాగా.. ఆ విగ్రహాన్ని గోపన్న 11వ తరం వారసుడు కంచర్ల శ్రీనివాస్‌కు అప్పగించారు. ప్రధానాంశాలు: వెలుగులోకి భక్త రామదాసు కంచర్ల గోపన్న విగ్రహం నేలకొండపల్లి పోలీసు స్టేషన్ ఆవరణలో విగ్రహం 11వ తరం వారసుడికి అప్పగింత భద్రాచలం ఆలయాన్ని భక్త రామదాసు కంచర్ల గోపన్న నిర్మించాడని చరిత్ర చెబుతోంది. అయితే ఆయన […]Read More
థియేటర్లలో బ్లాక్ బస్టర్ అయిన అన్ని సినిమాలూ ఓటీటీల్లో, టీవీల్లో బాగా ఆడేస్తాయని లేదు. ఆల్రెడీ థియేటర్లలో ఎక్కువమంది చూడటం వల్ల కొన్ని సినిమాలకు ఓటీటీల్లో, టీవీల్లో వ్యూయర్ షిప్ తక్కువ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అలాగే థియేటర్లలో సరిగా ఆడని చిత్రాలు ఓటీటీల్లో మంచి స్పందన తెచ్చుకున్న ఉదంతాలు చాలానే ఉన్నాయి. ఐతే కొన్ని సినిమాలు మాత్రమే థియేటర్లలోనే కాక ఓటీటీల్లో కూడా మంచి స్పందన తెచ్చుకుంటాయి. సలార్ సినిమా ఆ కోవకు చెందిందే. క్రిస్మస్ […]Read More
ఇదేదో తమాషా విషయం కాదు.. నిజమే. ఈ నెల 22వ తేదీనే పిల్లల్ని కంటామంటూ.. ఇప్పుడు గుజరాత్ సహా ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని గర్భిణులు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. దాదాపు వందల సంఖ్యలో ఉన్న గర్భిణులు.. ఈ నెల 22నే తాము పిల్లలకు జన్మనిస్తామని తేల్చి చెబుతున్నారు. దీనికి గాను వైద్యులు ఏమైనా చేయాలని వారు అభ్యర్థిస్తున్నారు. ఇక, వ్యాపారులు కూడా.. కొత్త ప్రారంభించబోయే తమ వ్యాపారాలకు ఈ నెల 22నే ముహూర్తాలు ఖరారు చేసుకుంటున్నారు. మరి ఏంటి […]Read More
Tirumala Sri Ramakrishna Thirtha Mukkoti తిరుమల శేషాచల అడవుల్లోని పుణ్యతీర్థాల్లో ఒకటి శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి. ప్రతిఏటా మాఘ మాసంలో పౌర్ణమి నాడు శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి నిర్వహించడం ఆనవాయితీ. అధికబరువు, ఆస్తమా, గుండె సంబంధిత సమస్యలు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న యాత్రికులను, వృద్ధులను అనుమతించరు. గోగర్భం డ్యామ్ పాయింట్ నుండి పాపవినాశనం వరకు యాత్రికులను తరలించేందుకు ఎపిఎస్ఆర్టీసీ 30 నుండి 35 బస్సులను ఏర్పాటు చేస్తోంది. జనవరి 25వ తేదీ ఉదయం 5 […]Read More
Ram Rahim: అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం వేళ హిందువులు పులకరించిపోయారు. 5 శతాబ్దాల వివాదం సమసిపోయి.. అయోధ్యలో భవ్య రామ మందిర కల సాకారం అయింది. దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో సోమవారం ప్రసవాలు జరిగాయి. ఈ సందర్భంగా ఓ ముస్లిం మహిళ ఆపరేషన్ చేయించుకుని తనకు పుట్టిన కుమారుడికి రాముడి పేరు పెట్టుకుంది. ఇక సోమవారం పుట్టిన శిశువులకు రాముడు, సీత పేర్లు కలిసి వచ్చేలాగా నామకరణం చేశారు. Ram Rahim: హిందువుల చిరకాల స్వప్నం […]Read More
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 500 ఏళ్ల నాటి కల. ఇప్పుడు సాకారం అవుతున్న వేళ.. యావత్ దేశం ఒకలాంటి భావోద్వేగంతో నిండి ఉంది. అయోధ్యలో రామాలయ స్వప్నం తీరటం.. బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకువీలుగా పెద్ద ఎత్తున ఏర్పాట్లు సాగుతున్న సంగతి తెలిసిందే. మరికొద్ది గంటల్లో బాలరాముడు భక్త జనానికి దర్శనం ఇవ్వనున్నారు. ఈ వేడుకలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తో […]Read More