తెలంగాణ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి. నాలుగు రోజులు సాగిన అసెంబ్లీలో మొత్తం 8 బిల్లులు ఆమోదం పొందాయి. ఇందులో ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లు కూడా ఉంది. దీనికి కూడా సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లు పాస్ అవడంతో ఇప్పుడు కేసీఆర్ పైచేయి సాధించారా? లేదా గవర్నర్ గెలిచారా? అనే చర్చ సాగుతోంది. kcr vs governor over rtc bill ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నామని, ఇకపై ఆర్టీసీ ఉద్యోగులు […]Read More
ఎట్టకేలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వాన్ని పార్లమెంటు పునరుద్ధరించింది. మోదీ ఇంటిపేరుపై రాహుల్ వ్యాఖ్యల కేసులో రెండేళ్ల జైలు శిక్ష పడటంతో లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేసిన విషయం తెలిసిందే. తాజాగా సుప్రీంకోర్టు ఈ కేసులో రాహుల్ గాంధీకి అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో పార్లమెంటు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో రాహుల్ గాంధీ మళ్లీ ఎంపీగా మారారు. దీంతో రాహుల్‌కు పార్లమెంట్ సమావేశాల్లో హాజరవడానికి అవకాశం దక్కింది. కాగా 2019లో […]Read More
పోలవరం ప్రాజెక్ట్ తన బిడ్డ అని ఈ మధ్యనే టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. దానికి జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు వెంటనే కౌంటర్ ఇచ్చెశారు. నీవు కన్న కల కాదుగా పోలవరం అని రిటార్ట్ వేశారు. పోలవరం వైఎస్సార్ మానస పుత్రిక అని ఎలుగెత్తి చాటారు. అయితే 2014 నుంచి 2019 మధ్యలో పోలవరం ప్రాజెక్ట్ పనులు తన హయాంలో ఊపందుకున్నాయని చంద్రబాబు క్లెయిం చేసుకుంటున్నారు. తాను ఉండగా వేగంగా సాగిన పనులను వైసీపీ […]Read More
మరి.. జగన్ సర్కారు దీనికి విరుగుడు చర్యలు ఏం చేపడుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏపీలోని జగన్ సర్కారుకు కొత్త టెన్షన్ తీసుకొచ్చే ప్రకటన ఒకటి విడుదలైంది. జగన్ నాలుగేళ్ల పాలనలో ఎప్పుడూ చూడని ఇబ్బందికర పరిస్థితి ఉపాధ్యాయ.. ఉద్యోగ సంఘాలు చేపట్టిన మహా ధర్నా సందర్భంగా చోటు చేసుకుంది. తాను అధికారంలోకి వచ్చిన వారంలో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ను రద్దు చేస్తానని ఎన్నికల ప్రచారంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇవ్వటం తెలిసిందే. దీనిపై […]Read More
ఎప్పుడూ అనని.. చేయని సవాల్ చేశారు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్. ఓఆర్ఆర్ ను ముప్ఫై ఏళ్ల లీజుకు ఒక సంస్థకు ఇవ్వటంపై టీపీసీసీ రథసారధి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడటం.. వేలాది కోట్ల రూపాయిల స్కాంగా అభివర్ణించటం తెలిసిందే. ఈ ఎపిసోడ్ పై ఇప్పటికే ఆయన హెచ్ఎండీఏ నుంచి లీగల్ నోటీసులు అందుకున్నారు. అయినప్పటికీ దీనిపై విమర్శలు.. ఆరోపణలు వెల్లువెత్తుతున్న పరిస్థితి. ఇలాంటి వేళ.. అసెంబ్లీ సాక్షిగా రేవంత్ కు భారీ కౌంటర్ ఇచ్చేందుకు వీలుగా […]Read More
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తోన్న వేళ రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయని అంటున్నారు. ఇందులో భాగంగా పార్టీ అధినేతలు సైతం తాము పోటీ చేసే నియోజకవర్గాల విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుంటున్నారని తెలుస్తోంది. తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తోన్న వేళ రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయని అంటున్నారు. ఇందులో భాగంగా పార్టీ అధినేతలు సైతం తాము పోటీ చేసే నియోజకవర్గాల విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుంటున్నారని తెలుస్తోంది. ఈ సమయంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ పోటీ […]Read More
ఆర్టీసీ ఉద్యోగులు…. కార్మికుల వ్యవహారం భలే విచిత్రం గా ఉంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది . నిజానికి ఈ నిర్ణయమే నూరు శాతం రాజకీయమని అందరికి తెలుసు . ఎందుకంటే సంవత్సరాలు తరబడి ఆర్టీసీని ప్రభుత్వం లో విలీనం చేయడాన్ని కేసీఆర్ యే స్వయంగా వ్యతిరేకించారు . భూగోళం ఉన్నంతవరకు ఆర్టీసీని ప్రభుత్వం లో విలీనం చేసే ప్రసక్తే లేదని ఎన్నో సార్లు స్పష్టంచేశారు . అలాంటిది సడన్‌గా ఇప్పుడు ఎవ్వరు […]Read More
సక్సెస్ హేజ్ మెనీ ఫాదర్స్’ అనే సామెత చందంగా ప్రజలకు మేలు చేసే ఒక మంచి పని జరుగుతున్నది అంటే దానికి సంబంధించిన క్రెడిట్ తమకంటే తమకు దక్కాలని రాజకీయ పార్టీలు పోటీపడుతుండడం చాలా సహజం. ఇప్పుడు కేసీఆర్ ప్రకటించిన రైతు రుణమాఫీ హామీ విషయంలో కూడా అదే జరుగుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తన అమ్ముల పొదిలో నుంచి ఒక్కో అస్త్రాన్ని బయటకు తీస్తున్నారు. ప్రజలపై వరాల జల్లు […]Read More
టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మర్చి దేశ రాజకీయాలలో కీలక నాయకుడుగా చెలామణి ఐ పోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద కలలే కన్నారు. పంజాబ్, ఢిల్లీ, జార్ఖండ్ ,బెంగాల్ ,కర్ణాటక ,మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ ఇలా ఒకటేమిటి ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న చోట బలంగా ఉన్న చోటల్లా పర్యటించి వచ్చారు . బీజేపీకి కాంగ్రెస్ కు సమన దూరం పాటిస్తున్నాము అంటూ ఫెడరల్ ఫ్రంట్ పేరుతో కేసీఆర్ పెద్ద హడావుడే చేసారు . వచ్చే లోక్ […]Read More
బీసీల్లోని కొన్ని ఉపకులాల వాళ్ళు కేసీయార్ పై మండిపోతున్నారని సమాచారం. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే లక్ష ఆర్ధికసాయం అందించటంలో పెట్టిన నిబంధనలే. ఇక్కడ విషయం ఏమిటంటే బీసీల్లోని చేతివృత్తులపై ఆధారపడిన వాళ్ళల్లో పేదలకు లక్ష రూపాయల సాయం అందించేందుకు ప్రభుత్వం రెడీ అయ్యింది. ఇదే సమయంలో మైనారిటీల్లోని పేదలకు కూడా లక్ష రూపాయల రుణాలను అందించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అంటే రెండు వర్గాల్లోని పేదలకు ప్రభుత్వం తరపున లక్షరూపాయలు అందించే పథకాలు ఒకేసారి ప్రారంభమయ్యాయి. […]Read More