BRSలోకి జంప్ చేయనున్న రాజా సింగ్

 BRSలోకి జంప్ చేయనున్న రాజా సింగ్

ఓల్డ్ సిటిలో తాను లేకపోతే బీజేపీ లేదు అనేంత స్ధాయిలో రాజాసింగ్ మాట్లాడుతున్నారు.

ఓల్డ్ సిటీలోని గోషామహల్ ఎంఎల్ఏ రాజాసింగ్ ను బీజేపీ దూరంపెట్టేసినట్లే కనబడుతోంది. దశాబ్దాలుగా
రాజాసింగ్ కు బీజేపీతో అనుబంధముంది. పార్టీకి ఓల్డ్ సిటిలో స్ట్రాంగ్ సపోర్టరుగా ఎంఎల్ఏ దశాబ్దాలుగా కంటిన్యు
అవుతున్నారు. 2018 ఎన్నికల్లో పార్టీ తరపున 119 నియోజకవర్గాల్లో పోటీచేసిన వాళ్ళల్లో గెలిచింది రాజాసింగ్
మాత్రమే. దీంతోనే ఎంఎల్ఏకి ఓల్డ్ సిటీలో ఎంతటి పట్టుందో అర్ధమవుతోంది. అలాంటి ఎంఎల్ఏకి పార్టీ
అగ్రనాయకత్వంతో సమస్యలు మొదలయ్యాయి.

హిందుత్వ వాదాన్ని భుజనేసుకునే ఎంఎల్ఏ రెండు వీడియోలు రిలీజ్ చేశారు. ఆ వీడియోల్లో ముస్లింలను
ఊచకోత కోస్తానని వార్నింగులిచ్చారు. దాంతో పోలీసులు ఎంఎల్ఏపై కేసులు నమోదుచేసి అరెస్టు చేసి రిమాండ్ కు
పంపారు. అప్పటినుండి పార్టీ అధిష్టానం రాజాసింగ్ ను దూరంపెట్టేసింది. బెయిల్ మీద ఎంఎల్ఏ బయటకు వచ్చి
పార్టీ నాయకత్వంతో మాట్లాడేందుకు ప్రయత్నించినా అవకాశం దక్కటంలేదు. తనపై సస్పెన్షన్ను ఎత్తేయాలని
ఎంఎల్ఏ ఎన్నిసార్లు రిక్వెస్టులు చేసినా పట్టించుకోవటంలేదు.

దాంతో రాజాసింగ్ కు పార్టీకి బంధం తెగిపోయినట్లే అనుకుంటున్నారు. ఓల్డ్ సిటిలో తాను లేకపోతే బీజేపీ లేదు
అనేంత స్ధాయిలో రాజాసింగ్ మాట్లాడుతున్నారు. ఆ విషయమే పార్టీ అగ్రనేతలకు నచ్చలేదట. అందుకనే దూరం
పెట్టేసినట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి. ఈ నేపధ్యంలోనే బీఆర్ఎస్ కీలక నేత, మంత్రి హరీష్ రావుతో ఎంఎల్ఏ
భేటీ అయ్యారు. వీళ్ళమధ్యయ కచ్చితంగా రాజకీయాలే చర్చకు వచ్చుంటాయనటంలో సందేహంలేదు. కాకపోతే
రాజాసింగ్ కు పెద్ద సమస్య ఒకటుంది.

అదేమిటంటే బీఆర్ఎస్, ఎంఐఎ మిత్రపక్షాలు. రాజాసింగ్ పోరాటం, ఎదుగుదల అంతా ఎంఐఎంకు వ్యతిరేకంగానే
జరిగింది. ఎంఐఎంకు వ్యతిరేకంగాను, ముస్లింవర్గాలకు వ్యతిరేకంగాను రాజాసింగ్ పోరాటాలు చేస్తున్నారు కాబట్టే
హిందువుల్ ఎంఎల్ఏ వెంట నిలబడ్డారు. అలాంటిది ఇపుడు బీఆర్ఎస్ లో చేరితే ఎంఐఎంకు మిత్రపక్షమైపోతారు.
అంటే దశాబ్దాల పాటు చేసిన పోరాటాలన్నీ గాలికి కొట్టుకుపోతాయి. మరపుడు హిందువులు ఏమిచేస్తారు ? ఒకవేళ
రాజాసింగ్ ఇండిపెండెంటుగా పోటీచేస్తే గెలిచేంత సీనుందా ? ఇలాంటి అనేక సందేహాలకు సమాధానాలు దొరక్క
రాజాసింగ్ లో అయోమయం పెరిగిపోతోందట.బీజేపీ పట్టించు కోకపోతే బీఆర్ఎస్ లోకి జంప్ చేయాలని రాజా సింగ్
చూస్తున్నారని సమాచారం . చూడాలి మరి ఎం జరుగుతోందో.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *