తెలంగాణ కార్మికులను రెచ్చగొడుతున్న కేసీఆర్

ఆర్టీసీ ఉద్యోగులు…. కార్మికుల వ్యవహారం భలే విచిత్రం గా ఉంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకోవాలని
తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది . నిజానికి ఈ నిర్ణయమే నూరు శాతం రాజకీయమని అందరికి తెలుసు .
ఎందుకంటే సంవత్సరాలు తరబడి ఆర్టీసీని ప్రభుత్వం లో విలీనం చేయడాన్ని కేసీఆర్ యే స్వయంగా వ్యతిరేకించారు .
భూగోళం ఉన్నంతవరకు ఆర్టీసీని ప్రభుత్వం లో విలీనం చేసే ప్రసక్తే లేదని ఎన్నో సార్లు స్పష్టంచేశారు .
అలాంటిది సడన్గా ఇప్పుడు ఎవ్వరు అడగక పోయిన తనంతట తానే ఆర్టీసీని ఎందుకు విలీనం చేస్తున్నట్టో
ప్రకటించారు. సరే ఈ విషయాన్నీ పక్కన పెట్టేద్దాం . విలీంనం కు అవసరమైన డ్రాఫ్ట్ బిల్ రెడీ చేసి ఆమోదం కోసం
ప్రభుత్వం …బిల్ ను గవర్నర్ దగ్గరకు పంపింది . బిల్లు రాజభవన్ కు చేరి రెండు రోజులే ఐయింది . మూడోవ రోజు
అంటే శనివారం నుండే ఆర్టీసీ ఉద్యోగులు… కార్మికులు అంతా ఆందోళనకు దిగేసారు. విధులకు హాజరు అవకుండా
మెరుపు సమ్మె మొదలు పెట్టారు .
దేనికంటే ఆర్టీసీని ప్రభుత్వం పై విలీనం చేసే బిల్లుపై గవర్నర్ సంతకం పెట్టలేదని నిరసనగా నట . ఆర్టీసీ ఉద్యోగులు..
కార్మికులు వైఖరి ఎంత విచిత్రంగా ఉందో అర్ధమైపోతుంది . గవర్నర్ సంతకం పెట్టడానికి పెట్టక పోడానికి ఆర్టీసీ
ఉద్యోగులకు… కార్మికులకు ఏమిటి సంబంధం . రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం హడావుడిగా
బిల్లును తయారు చేసి సంతకం కోసం రాజభవన్ కు పంపితే వెంటనే గవర్నర్ సంతకం పెట్టేయాల్సిందేనా ఆ బిల్లులో
న్యాయపరమైన లొసుగులు ఏమున్నాయో లేదో చూసుకోవలసిన బాధ్యత గవర్నర్ కు లేదా .
అసలు గవర్నర్ సంతకం పెట్టలేదని వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులు కూడా రాజ్ భవన్ను ముట్టడించడం
మొదలు పెడితే శాంతి భద్రతలు క్షిణించావా . గతంలో ఎప్పుడు ఏ శాఖకు చెందిన ఉద్యోగులు కూడా ఇలా గవర్నర్
వైఖరికి నిరసనగా ఆందోళనలు చేసిన ఘటనలు లేవు. ఇప్పుడు ఆర్టీసీ ఉద్యోగులు…. కార్మికులు చేస్తున్నారంటేనే
వీళ్ళను బీఆర్ఎస్ నేతలు రెచ్చగొట్టి రోడ్డు మీదకు దింపినట్టు ఆరోపణలు పెరిగిపోతున్నాయి . గవర్నర్ మీదకు
ఉద్యోగులను ప్రభుత్వమే రెచ్చగొట్టి పంపుతోందని ఆరోపణలే ఆశ్చర్యంగా ఉంది వినటానికి
ఇదిలా ఉంటే అసలు కేసీఆర్ కి గవర్నర్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఇలాంటి టైములో భూగోళం
ఉన్నంతవరకు ఆర్టీసీని ప్రభుత్వం లో విలీనం చేసే ప్రసక్తే లేదని ఎన్నో సార్లు చెప్పిన కేసీఆర్ ఇప్పడు
ఆర్టీసీ ఉద్యోగులు…. కార్మికులను ప్రభుత్వం లో విలీనం చేసున్నారు అంటే రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని
కేసీఆర్ మైండ్ గేమ్ ఆడుతున్నారని ఆ గేమ్ లో భాగమే ఆర్టీసీ ఉద్యోగులు…. కార్మికుల ప్రభుత్వంలో విలీనం అని
రాజకీయ విశ్లేషకుల వాదన. చూసారు కదా… ఓట్లు కోసం…. కేసీఆర్ మైండ్ గేమ్… ఎలావుందో