Yagam For CBN: చంద్రబాబు కేసుల నుంచి బయటపడాలని సుదర్శన నరసింహ యాగం

 Yagam For CBN: చంద్రబాబు కేసుల నుంచి బయటపడాలని సుదర్శన నరసింహ యాగం

Yagam For CBN: కేసుల చిక్కుల నుంచి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు బయటపడాలని అకాంక్షిస్తూ ఆ పార్టీ నాయకులు విజయవాడలో సుదర్శన నరసింహ యాగాన్ని నిర్వహించారు.

Yagam For CBN: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసుల నుండి విముక్తి కలగాలని ఆకాంక్షిస్తూ గన్నవరం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో కానూరు సుదర్శన నరసింహ స్వామి యాగం నిర్వహించారు.

మూడు రోజుల పాటు విజయవాడ శివార్లలోని యార్లగడ్డ గ్రాండియర్‌లో ఈ యాగం ఏర్పాటు చేశారు. నేపాల్‌కు చెందిన రుత్వికులు ఈ యాగంలో పాల్గొన్నారు. చంద్రబాబుపై ప్రభుత్వం నమోదు చేసిన కేసుల నుంచి విముక్తి లభించాలని, సంపూర్ణ ఆరోగ్యం సిద్ధించాలని సంకల్పించారు. ఈ యాగంలో పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

సెప్టెంబర్ 9 న స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు ప్రస్తుతం కంటి శస్త్ర చికిత్స కోసం బెయిల్‌పై ఉన్నారు. ఈ నెల 28వరకు చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసును కొట్టేయాలంటే చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉంది. స్కిల్‌ స్కామ్‌తో పాటు ఫైబర్‌ నెట్ స్కామ్, ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు, లిక్కర్‌ స్కామ్‌ కేసులను కూడా చంద్రబాబు ఎదుర్కొంటున్నారు. వరుస కేసులతో సతమతం అవుతున్న చంద్రబాబుకు మేలు జరగాలనే ఉద్దేశంతో యాగాన్నినిర్వహించారు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *