Watermelon: వేసవిలో పుచ్చకాయ ఆరోగ్యానికి హానికరం.. పొరపాటున వీరు తినకూడదు..!!

పుచ్చకాయలో సహజ చక్కెర పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది. పుచ్చకాయ తినడం కొంత మందికి హానికరం. ఆర్థరైటిస్, కీళ్ల నొప్పులు, ఆస్తమా రోగులు, గ్యాస్, అసిడిటీ, బరువు తగ్గాలన్న, డయాబెటిస్, అలెర్జీ ఉన్నవారు పుచ్చకాయను ఎక్కువగా తినకుండా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.
Watermelon: వేసవిలో పుచ్చకాయ తినడానికి ఇష్టపడతారు. ఇది శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. దీనిలో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలతోపాటు అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉంటుంది. ఇందులో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి బరువు తగ్గడానికి ఇది చాలా మంచిది. కానీ పుచ్చకాయ తినడం కొంతమందికి హానికరమని చాలామందికి తెలియదు. ఎందుకంటే ఆ సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుంది. ఏ వ్యక్తులు పుచ్చకాయ తినకుండా ఉండాలో ఈ ఆర్టికల్‌లో కొన్ని విషయాలు తెలుసుకుందాం
పుచ్చకాయలో సహజ చక్కెర..
డయాబెటిస్ ఉన్నవారు పుచ్చకాయను ఎక్కువగా తినకుండా ఉండాలి. పుచ్చకాయలో సహజ చక్కెర పరిమాణం, గ్లైసెమిక్ సూచిక చాలా ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా పుచ్చకాయ తిన్న తర్వాత రక్తంలో చక్కెర స్థాయి వేగంగా పెరుగుతుంది. పుచ్చకాయ రసం తాగడం మానుకోవాలి. ఎందుకంటే ఇది ఫైబర్‌ను తొలగిస్తుంది. కొంత మందికి పుచ్చకాయ తినడం వల్ల అలెర్జీలు రావచ్చు. ఇప్పటికే ఏదో ఒక అలెర్జీ ఉన్నవారికి సమస్య మరింత పెంచుతుంది అందువల్ల పుచ్చకాయ తిన్న తర్వాత వాపు, దద్దుర్లు, దురద, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే వైద్యులను సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు.
ఫైబర్ అధికంగా ఉండే పుచ్చకాయ కడుపుకు మంచిది. ఇందులో లైకోపీన్ ఉంటుంది. జీర్ణ సంబంధిత సమస్యలు, గ్యాస్, అసిడిటీ, బరువు తగ్గాలన్న పుచ్చకాయను ఎక్కువగా తీసుకోవద్దు. పుచ్చకాయలో సహజ చక్కెర ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా బరువు పెరగడానికి కారణమవుతుంది. జీర్ణక్రియ మందగించిన తర్వాత రాత్రిపూట పుచ్చకాయ తింటే ఆర్థరైటిస్, కీళ్ల నొప్పులు, ఆస్తమా వంటి సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.