Vyomika Singh: ‘నాన్న అమ్మకు చెప్పకు.. నన్ను వెళ్ళనివ్వదు’.. వ్యోమికా సింగ్ సక్సెస్ స్టోరీ ఇదే!
భారత వైమానిక దళ వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ సాధించిన విజయాలు మహిళా శక్తికి నిదర్శనాలు. ఉద్యోగానికి ఎంపికైనప్పుడు ‘నాన్న.. అమ్మకు చెప్పకు. ఆమె అంగీకరించదు’అని భయపడిన అమ్మాయి నేడు దేశానికే ఆదర్శంగా నిలిచారు. సక్సెస్ స్టోరీ కోసం పూర్తి ఆర్టికల్ చదవండి.
మదర్స్ డే వేడుకకు మరో నాలుగు రోజులే ఉంది. ఈసారి మే 11 ఆదివారం మదర్స్ డే జరుపుకోనున్నారు. తమ బిడ్డలకు ఎలాంటి దురాశ లేకుండా ప్రేమను పంచే తల్లికి ఈ వేడుక అంకితం. ఈసారి మదర్స్ డే రోజున మీ తల్లికి మంచి గిఫ్ట్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నట్లయితే.. ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరే ఎంపిక. ఇవి ఎంతో సురక్షితంగా, కంఫర్ట్‌గా ఉంటాయి. ముఖ్యంగా మహిళలకు ఎలక్ట్రిక్ స్కూటర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
TVS iQube ST
టీవీఎస్ ఐక్యూబ్ ST ఎలక్ట్రిక్ స్కూటర్ తక్కువ ధరలో అందుబాటులో ఉంది. దీని ధర రూ. 84,999 (ఎక్స్-షోరూమ్ న్యూఢిల్లీ) గా ఉంది. ఈ స్కూటర్ మంచి ఫీచర్లను కలిగి ఉంది. TVS iQube ST ఎలక్ట్రిక్ స్కూటర్ 2.2 kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. 2 గంటల్లోనే 80% వరకు ఛార్జ్ అవుతుంది. గరిష్ట వేగం గంటకు 75 కి.మీ ఇస్తుంది. ఈ స్కూటర్‌ను ఆఫీసు లేదా కాలేజీలకు యూజ్ చేయోచ్చు. ఈ స్కూటర్‌కు పూర్తిగా ఛార్జింగ్ చేస్తే 75 కిలోమీటర్ల మైలేజీ అందిస్తుంది.
బజాజ్ చేతక్
బజాజ్ ఆటో ఈ ఏడాది తన కొత్త చేతక్ 35 ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అప్‌డేట్ చేసింది. అప్డేటెడ్ వెర్షన్ చేతక్ స్కూటర్‌లో కొన్ని కీలక మార్పులు జరిగాయి. ఇప్పుడు కొత్త కలర్ ఆప్షన్లలో ఇవి అందుబాటులోకి వచ్చాయి. ఇందులో స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, మ్యూజిక్ మేనేజ్‌మెంట్, ఇంటిగ్రేటెడ్ నావిగేషన్‌కు మద్దతు ఇచ్చే TFT స్క్రీన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ స్కూటర్‌కు ఫుల్‌గా ఛార్జింగ్ చేస్తే 153 కిలోమీటర్ల మైలేజీ అందిస్తుంది. ఈ కొత్త అప్డేటెడ్ చేతక్ 35 ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.1.20 లక్షల నుండి ప్రారంభమవుతుంది.
ఏథర్ రిజ్టా
ఏథర్ ఎనర్జీ తన కొత్త రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తీసుకొచ్చింది. రిజ్టా మొత్తం 2 వేరియంట్లలో అందుబాటులో ఉంది. దీని ధర రూ. 1.35 లక్షల నుండి ప్రారంభమవుతుంది. రిజ్టాలో 7-అంగుళాల TFT స్క్రీన్ ఉంది. ఇది నోటిఫికేషన్ అలెర్ట్, లైవ్ లొకేషన్, గూగుల్ మ్యాప్స్‌కు మద్దతు ఇస్తుంది. ఈ స్కూటర్ సీటు చాలా పొడవైనది. దీని సీటు కింద 34 లీటర్ల బూట్ స్పేస్ ఉంది. ఈ స్కూటర్ 2.9kWh, 3.7kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. ఇది వరుసగా 123 కి.మీ, 160 కి.మీ మైలేజ్ ఇస్తుంది.