TTD: తిరుమలలో ఆకస్మిక తనిఖీలు చేపట్టిన టీటీడీ ఈవో!
టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి తిరుమలలోని లడ్డూ కౌంటర్‌లో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. అక్కడ టోకెన్ల స్కానింగ్, లడ్డూల జారీ ప్రక్రియను స్వయంగా పరిశీలించారు.
Tirumala: తిరుమలలోని లడ్డూ కౌంటర్లో టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా టోకెన్ల స్కానింగ్, లడ్డూల జారీ ప్రక్రియను ఆయన స్వయంగా చూశారు. ఈ సందర్భంగా భక్తులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. లడ్డూల రుచి, నాణ్యత పెరగడం పట్ల భక్తులు సంతోషం వ్యక్తం చేసినట్లు సమాచారం. టీటీడీ ఈవో, అడిషనల్ ఈవో కొద్దిరోజులుగా తిరుమలలో భక్తుల క్యూలైన్లు, లడ్డూ కౌంటర్లు, అలాగే కొండపై షాపుల్ని ఆకస్మికంగా తనిఖీలు చేపడుతున్న సంగతి తెలిసిందే.
స్పాట్‌లోనే ఆదేశాలు…
అక్కడ కొందరు భక్తుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. అక్కడ ఏమైనా సమస్యలు ఉన్నాయా అనే దానిమీద ఆరా తీస్తున్నారు. ఒకవేళ ఏవైనా సమస్యలు ఉంటే అక్కడే పరిష్కరించే ప్రయత్నాలు మొదలు పెడుతున్నారు. ఈ క్రమంలో మార్పులు చేర్పులు గురించి స్పాట్‌లోనే ఆదేశాలు జారీ చేస్తున్నారు.ఉత్తరప్రదేశ్ అయోధ్యలో శ్రీ రామ జన్మభూమి క్షేత్ర ట్రస్ట్ నిర్వహిస్తున్న శ్రీ మహా నారాయణ దివ్య రుద్ర సహిత శత సహస్ర చండీ విశ్వ శాంతి మహా యాగంలో ఈవో జేీ శ్యామలరావు దంపతులు పాల్గొని నిర్వహించారు.
ఈ యాగం 45 రోజుల పాటు జరిగి జనవరి 1వ తేది నాటికి పూర్తవుతుంది. కంచి కామకోటి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి స్వామీజీని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తిరుమలలోని కంచి మఠంలో మర్యాదపూర్వకంగా కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా స్వామీజీ చైర్మన్ కు ఆశీర్వచనం అందించారు. టీటీడీ నూతన ధర్మకర్తల మండలి ఇటీవల తీసుకున్న నిర్ణయాలను స్వామీజీ అభినందించారు. తిరుమల పవిత్రతను కాపాడే విధంగా , భక్తులకు మేలు చేకూరేలా నిర్ణయాలు తీసుకోవడం ప్రశంసనీయమని అన్నారు.
తిరుమలను మరింత సుందర దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలని, వేదవిద్య వ్యాప్తికి కృషి చేయాలని చైర్మన్ కు తెలిపారు.