TSRTC Special Buses : ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్…. సంక్రాంతికి 4,484 ప్రత్యేక బస్సులు

 TSRTC Special Buses : ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్…. సంక్రాంతికి 4,484 ప్రత్యేక బస్సులు

TSRTC Sankranti Special Buses : సంక్రాంతి పండగ వేళ ప్రత్యేక బస్సులను నడపనుంది తెలంగాణ ఆర్టీసీ. 4,484 ప్రత్యేక ఆర్టీసీ బస్సులను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తెలిపింది. జనవరి 6 నుంచి వీటిని ఆపరేట్ చేయనున్నట్లు ఎండీ సజ్జనార్ తెలిపారు.

ఆర్టీసీ సంక్రాంతి బస్సులు

ఆర్టీసీ సంక్రాంతి బస్సులు

Telangana State Road Transport Corporation: ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్అర్టిసి ) శుభవార్త తెలిపింది.సంక్రాంతి పండుగ సందర్భంగా 4,484 ప్రత్యేక ఆర్టీసీ బస్సులను ప్రయాణికుల కోసం అందుబాటులో ఉంచనునట్లు వెల్లడించింది.జనవరి 6 నుంచి జనవరి 15 వరకు హైదరాబాద్ నుంచి కర్ణాటక,ఆంధ్రప్రదేశ్,మహారాష్ట్రలోని పలు ప్రాంతాలకు ఈ ప్రత్యేక బస్సులను నడపాలని ఆర్టీసీ అధికారులు ప్లాన్ చేస్తున్నారు

ఈ ప్రత్యేక బస్సులో కూడా మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తామని సంస్థ ఎండీ సజ్జనార్ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు.సంక్రాంతికి స్వగ్రామాలకు వెళ్లే ప్రయాణికులను క్షేమంగా వారి గమ్య స్థానాలకు చేర్చేందుకు అన్నీ ఏర్పాటు చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని అయన తెలిపారు.

” చార్జీల పై ఎలాంటి పెంపుదల లేకుండా సాధారణ చార్జీల తోనే ప్రత్యేక బస్సులను నడుపుతున్నాం.ఉప్పల్ క్రాస్ రోడ్స్,ఎల్బి నగర్,కేపిహెచ్ని మరియు తదితర రద్దీ ప్రాంతాల్లో తాగునీరు,మొబైల్ టాయ్లెట్ ల సౌకర్యాలను అందుబాటులో ఉంచాం.బస్ భవన్,గాంధీ బస్ స్టాప్ లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్ల ద్వారా రద్దీ ప్రాంతాల పరిస్థితిని ఎప్పటికపుడు ఆర్టీసీ ఉన్నతాధికారులు పర్యవేక్షించేందుకు అవకాశం ఉంది. ప్రయాణికులను ఇన్ టీం లోనే వారి గమ్య స్థానాలకు చేర్చేందుకు టోల్ గేట్ల వద్ద ఆర్టీసీ బస్సుల కోసం ఒక ప్రత్యేక లేన్ ల ఏర్పాటు జరిగింది.అధిక ఛార్జీలు వెచ్చించి ప్రైవేట్ బస్సులో ప్రయాణించే బదులు, యావెరజ్ చార్జీలతో ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసి సురక్షితంగా మీ గమ్య స్థానాలకు చేరండి ” అని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రజలకు,ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు.

తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పించడంతో….. తమకు తీవ్ర నష్డం జరుగుతుందని గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్లు ఆందోళన చేస్తున్నారు.ఈ క్రమంలోనే హైదరాబాద్ లోని మేడ్చల్ లో కొందరు ఆటో డ్రైవర్లు వినూత్నంగా నిరసన తెలిపారు.మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం తో ఆటో డ్రైవర్ల బ్రతుకుతెరువు కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తూ, మేడ్చల్‌లో ఆటో డ్రైవర్లు బిక్షాటన చేస్తూ నిరసన తెలిపారు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *