TS TET Live Updates 2023: మరికాసేపట్లో తెలంగాణ టెట్ ఫలితాలు
TS TET Live Updates 2023:తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాలు బుధవారం ఉదయం విడుదల కానున్నాయి. షెడ్యూల్ ప్రకారమే ఫలితాలను విడుదల చేసేందుకు తెలంగాణ పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది.
భారీగా హాజరైన అభ్యర్థులు
తెలంగాణ టెట్ పరీక్షకు సంబంధించి మొత్తం 2,83,620 అప్లికేషన్లు వచ్చినట్లు అధికారులు ప్రకటించారు. ఇందులో పేపర్-1 కు 80,990.. పేపర్-2కు 20,370 అప్లికేషన్లు వచ్చినట్లు తెలిపారు. మొత్తం రెండు పేపర్లకు కలిపి 1,82,260 దరఖాస్తులు వచ్చాయని ప్రకటించారు.
సెప్టెంబర్ 15న టెట్ పరీక్ష
తెలంగాణలో సెప్టెంబర్ 15న టెట్ పేపర్1, పేపర్2 పరీక్షలను నిర్వహించారు. తుది ఫలితాలను సెప్టెంబర్ 27న విడుదల చేయనున్నట్లు ముందే ప్రకటించారు. సెప్టెంబర్ 15న నిర్వహించే టెట్ పేపర్ 1 పరీక్షను ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, పేపర్ -2 ను మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 వరకు నిర్వహించారు.
తెలంగాణలో ఇప్పటికే డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల
తెలంగాణలో ఉపాధ్యాయ నియామకాల కోసం డీఎస్సీ నోటిఫికేషన్ ఇప్పటికే విడుదలైంది. నవంబరు 20 నుంచి 30 వరకు ఉపాధ్యాయ నియామక పరీక్ష జరగనుంది. జిల్లాల వారీగా ఖాళీలను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. డిఎస్సీ నియామకాలకు టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి కానుంది.
టెట్‌కు జీవితకాలం వ్యాలిడిటీ
తెలంగాణ టెట్ అర్హత కాలపరిమితి జీవితకాలం ఉంటుంది. ఒకసారి ఉత్తీర్ణత సాధిస్తే సరిపోతుంది. టెట్ పేపర్ -1లో ఉత్తీర్ణులైన వారు ఒకటి నుంచి ఐదో తరగతి వరకు బోధించే ఎస్జీటీ పోస్టులకు అర్హులవుతారు. పేపర్ 2లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఆరు నుంచి 8వ తరగతి వరకు బోధించే స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అర్హత పొందుతారు.
వెబ్‌సైట్‌లో ఫలితాలు
టెట్ ఫలితాలు అధికారిక వెబ్‌సైట్ https://tstet.cgg.gov.in/ లో అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. ఈ నెల 15న టెట్ పరీక్ష నిర్వహించగా పేపర్-1కు 2.26 లక్షలు, పేపర్-2కు 1.90 లక్షల మంది హాజరయ్యారు. ఇప్పటికే టెట్ ప్రాథమిక కీ విడుదల చేశారు.