TS MHSRB Staff Nurse Merit List: తెలంగాణ స్టాఫ్‌నర్సు పోస్టుల మెరిట్‌ జాబితా విడుదల.. ఎంపికైన అభ్యర్థుల లిస్ట్‌ ఇదే

Staff Nurse Result 2023 : స్టాఫ్‌నర్సుల మెరిట్‌ జాబితాను రాష్ట్ర వైద్య, ఆరోగ్య సేవల రిక్రూట్‌మెంట్‌ బోర్డు (MHSRB).. ఈరోజు (డిసెంబ‌రు 28) విడుదల చేయనుంది. వివరాల్లోకెళ్తే..

TS MHSRB Staff Nurse Merit List: తెలంగాణ స్టాఫ్‌నర్సు పోస్టుల మెరిట్‌ జాబితా విడుదల.. ఎంపికైన అభ్యర్థుల లిస్ట్‌ ఇదే
TS MHSRB Staff Nurse Merit List 2023 : తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖలో 7,094 స్టాఫ్‌నర్స్‌ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన మెరిట్‌ జాబితాను రాష్ట్ర వైద్య, ఆరోగ్య సేవల రిక్రూట్‌మెంట్‌ బోర్డు (MHSRB) డిసెంబ‌రు 28 (గురువారం) విడుదల చేసింది. స్టాఫ్‌నర్స్‌ పోస్టుల భర్తీకి రాతపరీక్ష నిర్వహించిన బోర్డు ఇటీవల మార్కులు వెల్లడించింది. ఫలితాలపై అభ్యంతరాలను స్వీకరించింది. అభ్యంతరాల పరిశీలన అనంతరం 9,000 మందితో కూడిన మెరిట్‌ జాబితాను ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ (MHSRB) డిసెంబర్‌ 28న విడుదల చేసింది.

ఈ మెరిట్‌ జాబితా విడుదలైన తర్వాత అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన డిసెంబ‌రు 29 నుంచి ప్రారంభం కానుంది. పరిశీలనకు 70 మంది అధికారులను ప్రత్యేకంగా నియమించారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా 7,094 స్టాఫ్‌నర్సు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేయగా.. రాష్ట్రవ్యాప్తంగా 40,936 మంది అభ్యర్థులు రాతపరీక్షకు హాజరయ్యారు. రాతపరీక్షలో సాధించిన మార్కులతో పాటు ప్రభుత్వ వైద్య సేవల అనుభవానికి ప్రత్యేకంగా పాయింట్లు కేటాయించనున్నారు. ధ్రువపత్రాల పరిశీలన అనంతరం తుది జాబితా విడుదల చేయనున్నారు. అభ్యర్థులు మెరిట్‌ జాబితాను https://mhsrb.telangana.gov.in/ వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *