TS Govt Holiday List: 2024 సెలవుల లిస్ట్‌ ప్రకటించిన ప్రభుత్వం.. సంక్రాంతితో సహా ఇతర సెలవు తేదీలివే

 TS Govt Holiday List: 2024 సెలవుల లిస్ట్‌ ప్రకటించిన ప్రభుత్వం.. సంక్రాంతితో సహా ఇతర సెలవు తేదీలివే

Telangana Government Holidays List 2024 : మరికొద్ది రోజుల్లో కొత్తం సంవత్సరం (2024)లోకి అడుగుపెట్టబోతున్నాం. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం సెలవులకు సంబంధించిన జాబితా విడుదల చేసింది.

2024 సెలవుల జాబితా
Government Holidays List 2024 : తెలంగాణలో 2024 ఏడాదికి సంబంధించి సాధారణ సెలవులపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పండుగలు, నేషనల్‌ హాలిడేస్‌ను కలిపి 27 సాధారణ సెలవులు, 25 ఆప్షనల్‌ హాలిడేస్‌ను ప్రకటించింది. జనవరి 1, జనవరి 15న సంక్రాంతి, మార్చి 8న శివరాత్రి, మార్చి 25వ తేదీన హోళీకి సాధారణ సెలవులు ప్రకటించింది. అలాగే.. జనవరి 16న కనుమ, ఫిబ్రవరి 14న శ్రీ పంచమి, మే 10వ తేదీన బసవ జయంతి సందర్భంగా ఆప్షనల్‌ హాలిడేస్‌గా ప్రకటించింది.
కొత్త ఏడాది (2024) సందర్భంగా.. జనవరి 1వ తేదీన సెలవు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం.. అందుకు బదులుగా ఫిబ్రవరి 10వ తేదీన రెండో శనివారాన్ని పనిదినంగా ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *