TS Govt DA Release : ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్, డీఏ విడుదలకు ఈసీ అనుమతి
TS Govt DA Release : ప్రభుత్వ ఉద్యోగులకు ఒక డీఏ విడుదలకు తెలంగాణ ప్రభుత్వానికి ఈసీ అనుమతి ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు అనుమతి ఇచ్చినట్లు ఈసీ తెలిపింది.
TS Govt DA Release : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ విడుదల చేసేందుకు ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. పెండింగ్‌లో ఉన్న ఒక డీఏ విడుదలకు శనివారం ఈసీ అనుమతి లభించింది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు అనుమతి ఇచ్చినట్లు ఈసీ తెలిపింది. ఉద్యోగులకు మూడు డీఏలు పెండింగ్‌లో ఉండగా.. ఒక డీఏ విడుదలకు ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం, ఈసీ మధ్య సంప్రదింపులు జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పుడే డీఎలు ఎందుకు చెలిస్తున్నారని, డీఏల చెల్లింపు ఎందుకు ఆలస్యం అయిందని ఈసీ ప్రశ్నించింది. గతంలో డీఏల చెల్లింపుపై ఎన్నికల సంఘం ఆరా తీసింది. డీఏ విడుదలకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ద్వారా ఈసీని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో పోలింగ్ ముగిసిన నేపథ్యంలో ఉద్యోగులకు డీఏ విడుదలకు ఈసీ అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది.