Today Rasi Phalalu: 27 ఈరోజు రాశి ఫలాలు.. వీరికి ప్రయాణాలు అధికమవుతాయి

 Today Rasi Phalalu: 27 ఈరోజు రాశి ఫలాలు.. వీరికి ప్రయాణాలు అధికమవుతాయి

ఈరోజు రాశి ఫలాలు తేదీ 27.09.2023 బుధవారం కోసం జ్యోతిష శాస్త్ర నిపుణులు, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
ఈరోజు రాశి ఫలాలు (దిన ఫలాలు), తేదీ 27.09.2023

వారం: బుధవారం, తిథి: త్రయోదశి,

నక్షత్రం: ధనిష్ట, మాసం: భాద్రపదం,

సంవత్సరం: శోభకృత్‌ నామ, అయనం: దక్షిణాయనం

గమనిక :- ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ, ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు

1.మేషరాశి ఫలాలు 2023

మేషరాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థం నుండి చెడు ఫలితాలు అధికముగా ఉన్నాయి. ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండాలని సూచన. మీరు చేసే పనుల్లో అలసటకు గురవుతారు. ఇతరులతో మాట్లాడేటప్పుడే జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబములో సమస్యలు, ఇబ్బందులు కలుగును. మీయొక్క ఆలోచనా విధానంతో మీ సమస్యలను అధిగమిస్తారు. విఘ్నేశ్వరుని పూజించడం, సంకటనాశన గణపతి స్తోత్రాన్ని పఠించడం, విఘ్నేశ్వర అష్టోత్తర శతనామావళి పఠించడం వంటివి చేయాలి. ఈరోజు వినాయకుడికి అరటిపళ్ళు, కొబ్బరికాయ నివేదించడం, బెల్లమును నైవేద్యముగా సమర్చించడం వలన విఘ్నాలు తొలగి శుభఫలితాలు కలుగుతాయి..
==========================================================================
2.వృషభం రాశి ఫలాలు 2023

వృషభ రాశి వారికి ఈరోజు మీకు అంత అనుకూలంగా లేదు. ఆరోగ్య విషయాల్లో, కుటుంబ వ్యవహరాల్లో చికాకులు ఉంటాయి. శారీరక శ్రమ అధికముగా ఉంటుంది. మానసికంగా అలసిపోతారు. బంధుమిత్రులతో భేదాభిప్రాయాలు పెరుగుతాయి. భగవద్గీత వినడం, చదవడం వల్ల, కృష్ణాష్టకం పఠించడం వలన శుభఫలితాలు కలుగుతాయి. పాలతో చేసినటువంటి ప్రసాదాల్ని శ్రీకృష్ణునికి నైవేద్యముగా సమర్పించాలి.

===========================================================================
3.మిథునం రాశి ఫలాలు 2023

మిథున రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. ధనలాభము, సౌఖ్యము కలుగుతుంది. కుటుంబంలో సంతోషం పెరుగుతుంది. ఆవేశపూరిత నిర్ణయాలు, వృధా ఖర్చులు పెరుగుతాయి. మానసిక ఉల్లాసము కోసం ధనమును ఖర్చు చేస్తారు. ప్రయాణములు అనుకూలిస్తాయి. విష్ణు సహస్రనామపారాయణ చేయడం, విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయాల్లో అర్చన వంటివి చేయించుకోవడం అలాగే ఆలయదర్శనం చేసుకోవడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. మహావిష్ణువు యొక్క అష్టోత్తర శతనామావళి పఠించండి.
========================================================================
4.కర్కాటకం రాశి ఫలాలు 2023

కర్మాటక రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలున్నాయి. మీకు అన్ని విధాలుగా కలసివచ్చే రోజు. చేసే ప్రతి పని మీకు అనుకూలంగా ఉంటుంది. ఉత్సాహంతో ముందుకు సాగుతారు. ఆర్ధిక విషయాలు అనుకూలిస్తాయి. కుటుంబములోని సమస్యలు తొలగుతాయి. నూతనంగా ప్రారంభించే వ్యవహారాల్లో ఆచితూచి ముందుకు వెళ్ళండి. వెంకటేశ్వరస్వామిని పూజించాలి. వెంకటేశ్వరస్వామి యొక్క అష్టోత్తర శతనామావళి పఠించండి. శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం చదవడం వినడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.
==========================================================================
సింహరాశి ఫలాలు 2023

సింహరాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. ధనలాభం ఉంది. ఉద్యోగస్తులకు అనుకూలమైన రోజు. ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు కొత్త పనులు ప్రారంభించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. కుటుంబ, ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త. వ్యాపారస్తులకు అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. విద్యార్థులు కష్టపడవలసిన సమయం ఇది. వినాయకుడిని పూజించడం, సంకటనాశన గణపతి స్తోత్రాన్ని పఠించడం, గణపతి అష్టోత్తర శతనామావళి పఠించడం వంటివి చేయడం వలన మరింత శుభఫలితాలు కలుగుతాయి.
============================================================================
6.కన్య రాశి ఫలాలు 2023

కన్యారాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థం నుండి మంచి ఫలితాలున్నాయి. శారీరక శ్రమ, మానసిక శ్రమ, పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అయినా ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ప్రయాణములు అధికమవుతాయి. స్త్రీ సౌఖ్యం కలుగుతుంది. ఖర్చులు నియంత్రించుకోవడం మంచిది. శత్రువులపై విజయం సాధిస్తారు. ఉద్యోగస్తులకు ఒత్తిడి అధికముగా ఉంటుంది. ఆరోగ్య, కుటుంబ విషయాల్లో శద్ధ వహించండి. శ్రీకృష్ణుడిని పూజించాలి. కృష్ణాష్టకం పఠించాలి. పాలతో చేసినటువంటి ప్రసాదాల్ని శ్రీకృష్ణునికి నైవేద్యముగా సమర్చించాలి. భగవద్గీత వినడం, చదవడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

=============================================================================
7.తులారాశి రాశి ఫలాలు 2023

తులారాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. అధిక ఖర్చు, శారీరక శ్రమ కలుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండండి. ఉద్యోగస్తులకు ఒత్తిడి, శత్రు భయం ఉంటుంది. కుటుంబం వల్ల మానసిక ఒత్తిడి, ఇబ్బందులు ఎక్కువ అవుతాయి. భార్యాభర్తల మధ్య భేదాభిప్రాయములు ఉంటాయి. వ్యాపారస్తులకు ఒత్తిడి పెరుగుతుంది. విద్యార్థులకు, స్త్రీలకు కుటుంబంలో సమస్యలు అధికమవుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. అప్పుల ఒత్తిడి ఎక్కువ అవుతుంది. స్నేహితులు సహాయం చేస్తారు. విష్ణు సహస్రనామపారాయణ చేయడం, విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయాల్లో అర్చన వంటివి చేయించుకోవడం అలాగే ఆలయదర్శనం చేసుకోవడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. మహావిష్ణువు యొక్క అష్టోత్తర శతనామావళి పఠించండి.
=============================================================================
8.వృశ్చికం రాశి ఫలాలు 2023

వృశ్చిక రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా ఉంది. అనుకున్న ప్రతీ పని పూర్తి చేస్తారు. సమాజంలో, కుటుంబములో గౌరవం పెరుగుతుంది. ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయమిది. వ్యాపారస్తులకు లాభాలు పెరుగుతాయి. ధనలాభం కలుగుతుంది. శత్రువులు మిత్రులుగా వ్యవహరిస్తారు. వెంకటేశ్వరస్వామి యొక్క అష్టోత్తర శతనామావళి పఠించండి. శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం చదవడం వినడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.
====================================================================================

9.ధనుస్సు రాశి ఫలాలు 2023

ధనూరాశి వారికి ఈరోజు మీకు అన్ని విధాలుగా అనుకూల ఫలితాలున్నాయి. అనుకున్న ప్రతీ పనిని పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు అనుకూల సమయం. వ్యాపారస్తులకు లాభదాయకము. ఏలినాటి శని ప్రభావము వలన ఆర్థిక సమస్యలు ఏర్పడుతాయి, పనులు ఆలస్యముగా జరుగుతాయి. శత్రువులతో గొడవలకు దూరంగా ఉండండి. మానసిక ఆందోళనలు ఉంటాయి. వినాయకుని పూజించడం, సంకటనాశన గణపతి స్తోత్రాన్ని పఠించడం, వినాయక అష్టోత్తర శతనామావళి పఠించడం వంటివి చేయడం వలన మరింత శుభఫలితాలు కలుగుతాయి.
======================================================================================

10.మకరం రాశి ఫలాలు 2023

మకర రాశి వారికి ఈరోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. ఆరోగ్య విషయంలో కొంత అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగములో చికాకులు, వ్యాపారస్తులకు అధిక శ్రమ ఉంటుంది. మీ కృషితో, పట్టుదలతో ముందుకు వెళ్ళి పనులు పూర్తి చేస్తారు. శత్రువర్గంతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. పాలతో చేసినటువంటి ప్రసాదాల్ని శ్రీకృష్ణునికి నైవేద్యముగా సమర్పించాలి. భగవద్గీత వినడం చదవడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.
=========================================================================================

11.కుంభం రాశి ఫలాలు 2023

కుంభ రాశి వారికి ఈరోజు అనుకూలంగా లేదు. ఖర్చులు ఎక్కువ అవుతాయి. ఆరోగ్య, కుటుంబ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెడతాయి. అప్పు చేయాల్సిన అవసరం రావొచ్చు. కోర్టు వ్యవహారాలు చికాకు కలిగిస్తాయి. ఉద్యోగస్తులకు కష్టకాలం ఇది. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. ప్రతీ పనిని ఆచితూచి చేయండి. శత్రువుల బాధలు అధికముగా ఉంటాయి. విష్ణు సహస్రనామపారాయణ చేయడం, విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయాల్లో అర్చన వంటివి చేయించుకోవడం అలాగే ఆలయదర్శనం చేసుకోవడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. మహావిష్ణువు యొక్క అష్టోత్తర శతనామావళి పఠించండి.

======================================================================================

12.మీనం రాశి ఫలాలు 2023

మీన రాశి వారికి ఈ రోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నది. ఆరోగ్య సమస్యలు ఒత్తిడి అధికముగా ఉంటుంది. అనుకున్నప్రతీ పనిని విజయవంతముగా పూర్తి చేస్తారు. మానసికంగా సంతోషంగా ఉంటారు. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. వెంకటేశ్వరస్వామిని పూజించాలి. వెంకటేశ్వరస్వామి యొక్క అష్టోత్తర శతనామావళి పఠించండి. శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం చదవడం వినడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

===========================================================================================

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *