Today Rasi phalalu: నేటి రాశి ఫలాలు: ఈ రాశి వారు దైవానుగ్రహంతో ఒక ప్రమాదం నుంచి తప్పించుకుంటారు

 Today Rasi phalalu: నేటి రాశి ఫలాలు: ఈ రాశి వారు దైవానుగ్రహంతో ఒక ప్రమాదం నుంచి తప్పించుకుంటారు

oday rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 9.12.2024 సోమవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

ఆయనము: దక్షిణాయనం, సంవత్సరం: శ్రీ క్రోధినామ

మాసం: మార్గశిరం, వారం : సోమవారం, తిథి : శు. అష్టమి, నక్షత్రం : పూర్వ భాద్రపద

మేషం:

సమాజంలో కీర్తిప్రతిష్ఠలు లభిస్తాయి. ఉత్తమకాలం నడుస్తుండటం వల్ల శుభఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

వ్యాపారంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. సన్నిహితుల నుంచి శుభవార్తలు వింటారు. మరిన్ని మంచి ఫలితాల కోసం సూర్యనారాయణమూర్తిని స్మరించండి.

వృషభం:

ఆర్థిక వ్యవహారాల్లో మొహమాటం వద్దు. ఓర్పు అవసరం. తొందరపాటు పనికిరాదు. లక్ష్యసాధనలో ఏకాగ్రత వహించండి. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి. అపార్థాలకు తావివ్వకండి. చాలా సందర్భాల్లో మౌనమే ఉత్తమం. ఉద్యోగంలో పదోన్నతి సూచనలు ఉన్నాయి. అవసరానికి డబ్బు అందుతుంది. మరిన్ని మంచి ఫలితాల కోసం విష్ణుసహస్రనామ స్తోత్రం పఠించాలి.

మిథునం:

ప్రజా జీవితంలో ఉన్నవారికి అధికార లాభం సూచితం. మీదైన రంగంలో ప్రత్యేకమైన గుర్తింపు దక్కే అవకాశం ఉంది.

ఆర్థికంగా లాభపడతారు. పెద్దలతో సత్సంబందాలు ఏర్పడతాయి. ఉద్యోగులకు ఉత్తమ ఫలితాలు అందుతాయి. అదృష్ణయోగం ఉంది. చిన్నపాటి ప్రయత్నంతో ఎక్కువ ప్రయోజనం పొందుతారు. ప్రయాణాలు చేస్తారు.మరిన్ని మంచి ఫలితాల కోసం సరస్వతీదేవిని ధ్యానించండి.

కర్కాటకం:

కఠిన నిర్ణయాలకు వెనకడుగు వేయకండి. నిజాయతీతో పనిచేయండి. అన్ని విధాలుగా మంచి జరుగుతుంది. ఏకాగ్రతతో ఉన్నత లక్ష్యాల్ని సాధిస్తారు. బద్ధకాన్ని వదిలి వ్యవహరించాలి. అధికారులతో సత్సంబందాలు కొనసాగించండి. శుభవార్త వింటారు. ఊహించని ఖర్చులు ఉంటాయి. వ్యాపార వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి.మరిన్ని మంచి ఫలితాల కోసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకోండి.

సింహం:

బుద్ధిబలంతో వ్యవహరించాలి. వ్యాపారం సజావుగా సాగుతుంది. లాభాలను అందుకుంటారు. కొత్త ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. శత్రుదోషం తొలగుతుంది. ఉద్యోగంలో కొంత ఒత్తిడి ఉంటుంది. చక్కని ప్రణాళికతో దాన్ని అధిగమించండి.

న్య:

వ్యాపారంలో సమయానుకూలంగా స్పందించండి. ఉద్యోగంలో కలిసొస్తుంది. మీ నిర్ణయాలు మేలు చేస్తాయి. ఉత్తమకాలం నడుస్తోంది. అదృష్టం వరిస్తుంది. ఆత్మవిశ్వాసం అవసరం. ఎదుగుదలకు సరైన సమయం. భూ, గృహ యోగాలున్నాయి. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం లభిస్తుంది. మరిన్ని మంచి ఫలితాల కోసం శ్రీమహాలక్ష్మిని ఉపాసించండి.

తులా:

కాలాన్ని వృథా చేసుకోవద్దు. సాహసోపేతమైన నిర్ణయాలు ఘన విజయాలను అందిస్తాయి. వ్యాపార యోగం శుభప్రదం.. పెట్టుబడులు లాభాలను కురిపిస్తాయి. ఆర్థిక ప్రగతిపై దృష్టిసారించండి. మాటల్లో స్పష్టత ఉండేలా జాగ్రత్త పడండి. ఓర్పుతో వ్యవహరించండి.

వృశ్చికం:

తొందరపాటు నిర్ణయాలు వద్దు. మానసిక స్థిరత్వం అవసరం, ప్రత్యర్థులు ఇబ్బందులు సృష్టి౦చే ఆస్కారం ఉంది. లక్ష్మీకటాక్షం సిద్ధిస్తుంది. అవసరానికి డబ్బు మీ చేతికి అందుతుంది. పొదుపు-మదుపు గురించి ఆలోచించాల్సిన సమయం. దైవబలం మిమ్మల్ని రక్షిస్తుంది. అనాలోచిత వాగ్దానాలు ఇవ్వకండి. కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి. మరిన్ని మంచి ఫలితాల కోసం గణపతిని ప్రార్ధించండి.

ధనుస్సు:

వ్యాపార విస్తరణ విషయంలో ఆచితూచి అడుగేయాలి. ఏకాగ్రతతో పనిచేయండి. అనుకున్నది సాధిస్తారు. అదృష్టయోగం ఉంది. మీ దృష్టిని మళ్లించే ప్రయత్నాలు జరుగుతాయి. దైవానుగ్రహంతో ఒక ప్రమాదం నుంచి తప్పించుకుంటారు. మనోబలంతో ఆ కుట్రను చేదించండి. మరిన్ని మంచి ఫలితాల కోసం అమ్మవారి ఆలయాన్ని సందర్శించండి.

మకరం:

అధికార యోగం సూచిస్తుంది. నైపుణ్యాలను మెరుగు పెంచుకుంటారు. స్థిరచరాస్తుల కొనుగోలు దిశగా అడుగులు వేస్తారు. ఉత్తమకాలం నడుస్తోంది. ఆశించిన ఫలితాలు అందుతాయి. ధనధాన్యాభివృద్ధి ఉంది. కళాకారులు పురస్కారాలు అందుకుంటారు. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు.మరిన్ని మంచి ఫలితాల కోసం శ్రీవేంకటేశ్వరుడిని ప్రార్ధించండి.

కుంభం:

పెట్టుబడులకు సరైన సమయం. వ్యాపారంలో నిపుణుల సలహాలు అవసరం. ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది. ఉన్నతాధికారుల ప్రశంసలు లభిస్తాయి. ఆత్మసంతృప్తిని కలిగించే పనులు చేస్తారు. ఆర్థిక ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. మరిన్ని మంచి ఫలితాల కోసం లక్ష్మీదేవిని ధ్యానించండి.

మీనం:

కాలాన్ని వృథా చేసుకోవద్దు. ఎవరినీ అతిగా విశ్వసించొద్దు. ఏకాగ్రతతో పనిచేయండి. వ్యాపారంలో కొద్దిపాటి దూకుడు అవసరం. మీరు నమ్మే ధర్మమే మిమ్మల్ని రక్షిస్తుంది. విఘ్నాల నుంచి బయటపడతారు. కొన్ని విషయాల్లో అనిశ్చితి తొలగిపోతుంది. దైవబలాన్ని పెంచుకోవడం ద్వారా గ్రహ దోషాలను అధిగమించవచ్చు.మరిన్ని మంచి ఫలితాల కోసం నవగ్రహ శ్లోకాలు పఠించాలి.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *