Today Rasi Phalalu: ఆగస్టు 20, ఆదివారం రాశి ఫలితాలు.. వీరికి ఒత్తిళ్లతో కూడిన సమయం

Today Rasi Phalalu: ఈరోజు రాశి ఫలితాలు (దిన ఫలాలు) తేదీ 20.08.2023 ఆదివారం కోసం జ్యోతిష శాస్త్ర నిపుణులు చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
-బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ – మొబైల్ : 9494981000
1. మేషం రాశి ఫలాలు 2023
మేషరాశి వారికి ఈ రోజు మీకు అన్ని విధాలుగా అనుకూల ఫలితాలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా కలసివచ్చును. కుటుంబ సభ్యులతో ఆనందముగా గడిపెదరు. అన్ని రకాలుగా కలసివచ్చే రోజు. ఆగ్రహావేశాలకు దూరంగా ఉండాలి. ఆవేశిపూరిత నిర్ణయాలు తీసుకోకూడదు. విదార్థులకు మధ్యస్థ నుండి అనుకూల సమయం. రాజకీయరంగం వారికి కలసివచ్చేటటువంటి రోజు. మేష రాశి వారు ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం ఆదివారం రోజు సుబ్రహ్మణ్యుని పూజించడం, సూర్యభగవానుని ఆరాధించడం, సూర్యాష్టకం చదువుకోవడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.
2.వృషభం రాశి ఫలాలు 2023
వృషభ రాశి వారికి ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేదు. ఒత్తిళ్ళు అధికం. చికాకులతో కూడుకున్నటువంటి వాతావరణం. కుటుంబసభ్యులతో ఇబ్బందికర పరిస్థితి ఏర్పడును. ఖర్చులు నియంత్రించుకోవాలి. వ్యాపారస్తులకు సమయానికి ధనము సర్దుబాటు కాదు. రాజకీయ నాయకులకు అనుకూలం లేదు. ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయడం మంచిది. వృషభ రాశి వారు ఈరోజు కృష్ణాష్టకం పఠించడం వల్ల వృషభ రాశి వారికి మరింత శుభఫలితాలు కలుగుతాయి.
3.మిథునం రాశి ఫలాలు 2023
మిథునరాశి వారికి ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేదు. చికాకులతో కూడిన వాతావరణం. కుటుంబములో ఇబ్బందులతో కూడిన వాతావరణం ఏర్పడును. వృథా ఖర్చులు చేస్తారు. వ్యాపారస్తులకు రావలసిన సమయానికి ధనం అందదు. రాజకీయ నాయకులకు అనుకూలంగా లేదు. మిథున రాశి వారు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే ఆదివారం రోజు సూర్యాష్టకం పఠించడం, మహావిష్ణువును పూజించడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయి.
4.కర్కాటకం రాశి ఫలాలు 2023
కర్కాటక రాశి వారికి ఈ రోజు వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు ఒత్తిళ్ళు ఉన్నప్పటికి మీ యొక్కశక్తి సామర్థ్యాలతో సమస్యలను అధిగమిస్తారు. వ్యాపారస్తులకు ధనపరమైనటువంటి ఇబ్బందులు కలుగును. రాజకీయ నాయకులకు అంత అనుకూలంగా లేదు. రైతాంగం, సినీరంగం వారికి మధ్యస్థం. కర్కాటక రాశివారు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే నవగ్రహ పీడాహర స్తోత్రం పఠించాలి. అరుణం పఠించడం లేదా వినడం మంచిది.
5.సింహం రాశి ఫలాలు 2023
సింహరాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థం నుండి చెడు ఫలితాలు అధికముగా ఉన్నాయి. ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండాలి. ఖర్చులు నియంత్రించుకోవాలి. ఉద్యోగస్తులకు ఒత్తిళ్ళతో ఉన్నటువంటి సమయం. వ్యాపారస్తులకు ఖర్చులతో కూడియున్నటువంటి స్థితి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. సింహ రాశి వారికి మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయాలి. నవగ్రహ పీడాహర స్తోత్రం పఠించడం మంచిది.
6.కన్య రాశి ఫలాలు 2023
కన్యారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉన్నది. మీరు చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు. అప్పులివ్వరాదు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. అనారోగ్య సమస్యలు కలుగును. మీరు చేసే ప్రయత్నాలు మీ తల్లిదండ్రులు గర్వపడతారు. వారి నుండి బహుమతులు పొందుతారు. వ్యాపారస్తులకు లాభదాయకం. విద్యార్థులు కష్టపడవలసిన సమయం. మానసిక ఒత్తిళ్ళకు లోనయ్యే అవకాశం. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం బుధవారం రోజు విష్ణు సహస్ర నామ పారాయణ చేయడం, ఆదివారం ఆదిత్య హృదయం పారాయణ చేయడం మంచిది.
7.తులారాశి రాశి ఫలాలు 2023
తులారాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థం నుండి చెడు ఫలితాలు అధికముగా ఉన్నాయి. కుటుంబ మరియు ఆరోగ్య విషయాల్లో ఖచ్చితమైన జాగ్రత్తలు వహించాలి. భార్యాభర్తల మధ్య ఘర్షణతో కూడిన వాతావరణం. అనవసర విషయాలలో తలదూర్చకూడదు. కుటుంబ సమస్యలు ఇబ్బందిపెట్టును. మనస్సును నియంత్రించుకోవాలి. వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు మధ్యస్థం నుండి చెడు సమయం. రైతాంగం, సినీరంగం వారికి మధ్యస్థ ఫలితాలు. తులారాశివారు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే ఆదివారం రోజు నవగ్రహ పీడాహర స్తోత్రం పఠించడం మంచిది. ఆదిత్య హృదయం పారాయణ చేయడం వలన శుభఫలితాలు కలుగుతాయి.
8.వృశ్చికం రాశి ఫలాలు 2023
వృశ్చిక రాశి వారికి ఈ రోజు మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నది. ఉద్యోగస్తులకు పనుల్లో ఒత్తిళ్ళు ఉన్నప్పటికి సమస్యలను అధిగమిస్తారు. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. పై అధికారులతో మన్నననలు పొందుతారు. వ్యాపారస్తులు శుభవార్తలు వింటారు. స్త్రీలకు అనుకూలం. వృశ్చిక రాశి వారు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే ఆదిత్య హృదయాన్ని పఠించడం, నవగ్రహ ఆలయాల్లో పూజలు వంటివి చేయడం వలన మరింత శుభఫలితాలు కలుగుతాయి.
9.ధనుస్సు రాశి ఫలాలు 2023
ధనూరాశి వారికి ఈరోజు మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నది. వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా కలసివచ్చును. మీరు చేసే పనులు సత్ఫలితాలనిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు కలసివస్తాయి. ఉద్యోగస్తులకు అనుకూలం. స్థాన చలన మార్పు కలుగుతుంది. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. విద్యార్థులకు కలసివచ్చేటటువంటి రోజు. ధనూరాశివారు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే సూర్యాష్టకాన్ని పఠించాలి. నవధాన్యాలను దానం ఇవ్వడం మంచిది. క్షీరాన్నాన్ని ఆలయాల్లో ప్రసాదంగా పంచడం మంచిది.
10.మకరం రాశి ఫలాలు 2023
మకర రాశివారికి ఈ రోజు మీకు ఆరోగ్యం అనుకూలించును. ఇతర రంగాలలో ముందుకు దూసుకుపోతారు. మీ ఆదాయం పెరుగును. అనవసర ఖర్చులు నియంత్రించుకోవాలి. శుభవార్తలు వింటారు. మీ జీవితానికి సంబంధించిన నిర్ణయాలను త్వరంగా తీసుకుంటారు. పని ఒత్తిళ్ళకు లోనవుతారు. ముఖ్యమైన పనులకు ఆటంకం కలుగును. మీరు కష్టపడి పనిచేయడం వలన మీరు చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ఇతరులతో భేదాభిప్రాయములు కలుగును. మకర రాశి వారు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే నవగ్రహ శాంతి చేసుకోవడం మంచిది. ఈ రోజు నవగ్రహ ఆలయాలను దర్శించడం మంచిది. సూర్యాష్టకాన్ని పఠించండి.
11.కుంభం రాశి ఫలాలు 2023
కుంభరాశి వారికి ఈ రోజు మధ్యస్థం నుండి చెడు ఫలితాలు అధికముగా ఉన్నాయి. గొడవలకు దూరంగా ఉండాలి. కుటుంబములో ఏదో ఒక సమస్య వేధించును. రుణబాధలు బాధించును. కుటుంబ వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. ధనపరమైనటువంటి విషయాల్లో ఇబ్బందులకు గురవుతారు. చికాకులతో కూడియున్నటువంటి సమయం. ఉద్యోగస్తులకు మధ్యస్థం నుండి చెడు సమయం. వ్యాపారస్తులకు చెడు ఫలితాలున్నాయి. విద్యార్థులు మధ్యస్థ సమయం. మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయాలి. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. నువ్వులతో చేసిన ప్రసాదాన్ని ఆలయాల్లో పంచి పెట్టండి.
12.మీనం రాశి ఫలాలు 2023
మీన రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థముగా ఉన్నది. మానసిక ఒత్తిళ్ళు తగ్గించుకోవాలని సూచన. మీ కుబుంబ సభ్యులతో విశ్రాంతి తీసుకుంటారు. ఆర్థిక లాభం పొందుతారు. విద్యార్థులు కష్టపడవలసిన సమయం. ఆహారం విషయంలో నిర్లక్ష్యం పనికిరాదు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. మీరు చేసే పనులలో శ్రద్ధ వహిస్తారు. ఆనందముగా గడుపుతారు. మీనరాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం గురువారం దక్షిణామూర్తిని, దత్తాత్రేయుని పూజించడం మంచిది. విష్ణుసహస్రనామ పారాయణ చేయడం వలన శుభ ఫలితాలు కలుగును. గురువారం రోజు శనగలు మరియు తాంబూలాన్ని దానం ఇవ్వడం మంచిది.