Today Horoscope Telugu :నేటి రాశి ఫలాలు తేదీ 24.10.2023 మంగళవారం కోసం జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మీ రాశి ఫలితం ఎలా ఉందో ఇక్కడ చూడండి.

 Today Horoscope Telugu :నేటి రాశి ఫలాలు తేదీ 24.10.2023 మంగళవారం కోసం జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మీ రాశి ఫలితం ఎలా ఉందో ఇక్కడ చూడండి.

తెలుగురాశి ఫలితములు (దిన ఫలితము) 24.10.2023, వారం: మంగళవారం, తిథి : దశమి నక్ష్మత్రం : ధనిష్ట, మాసం : ఆశ్వయుజం, సంవత్సరం: శోభకృత్‌ నామ, అయనం: దక్షిణాయనం

1.మేషరాశి ఫలాలు 2023

మేషరాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. మీ ఆలోచనల్లో మార్పు వస్తుంది. ఇంటి విషయాలపై దృష్టి సారిస్తారు. దైవదర్శనాలు, ప్రయాణంలో ఆటంకాలు ఎదుర్కొంటారు. ఇతరుల కోసం విపరీతంగా ఖర్చుచేస్తారు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. ప్రత్యర్థులతో జాగ్రత్త అవసరం. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేకం చేసుకోవడం మంచిది. సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి. సుబ్రహ్మణ్యుని ఆలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగించాలి.

==========================================================================

2.వృషభం రాశి ఫలాలు 2023

వృషభ రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. ఆదాయం బాగుంటుంది. పెద్దల ఆరోగ్య విషయంలో ఆందోళన కలిగిస్తుంది. పనులు సకాలంలో పూర్తిచేస్తారు. వస్త్రప్రాప్తి, ధనలాభం ఉన్నాయి. వివాదాలు సర్దుకుంటాయి. ఆధ్యాత్మికత పెరుగుతుంది. మీదైన రంగంలో నిలదొక్కుకుంటారు. వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. రాహుకాల సమయంలో అమ్మవారి వద్ద నువ్వుల నూనెతో దీపాలను వెలిగించడం మంచిది. ఈరోజు అమ్మవారికి కుంకుమార్చన చేయడం మంచిది.
===========================================================================

3.మిథునం రాశి ఫలాలు 2023

మిథున రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. మీ మాటతీరు ఆకట్టుకుంటుంది. ఆత్మీయుల ఆహ్వానం ఉత్సాహానిస్తుంది. ఆప్తులతో సంభాషిస్తారు. బంధుత్వాలు బలపడతాయి. వేడుకకు హాజరవుతారు. విలాసాలకు ధనమును అధికంగా ఖర్చు చేస్తారు. పదవులు, సభ్యత్వాల స్వీకరణకు అనుకూలం. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. మరింత శుభఫలితాలు పొందాలంటే సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేకం చేసుకోవడం మంచిది. సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి. సుబ్రహ్మణ్యుని ఆలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగించాలి.
========================================================================

4.కర్కాటకం రాశి ఫలాలు 2023

కర్కాటక రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. మధ్యవర్తులను నమ్మవద్దు. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. పిల్లల విషయంలో శుభపరిణామాలున్నాయి. నగదు, పత్రాలు జాగ్రత్త. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. ఆలయలు, కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు. మరింత శుభ ఫలితాలు పొందాలంటే బుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించండి. విఘ్నేశ్వరున్ని పూజించండి. రాహుకాల సమయంలో దుర్గాదేవిని పూజించండి.
==========================================================================

సింహరాశి ఫలాలు 2023

సింహ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. విమర్శలు పట్టించుకోవద్దు. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. వాయిదా పడుతున్న పనులను పూర్తి చేస్తారు. నమ్మకస్తులే తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తారు. మీ ఉన్నతి కొంతమందికి అపోహ కలిగిస్తుంది. వేడుకను ఆర్భాటంగా చేస్తారు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. మరింత శుభఫలితాలు పొందాలంటే సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేకం చేసుకోవడం మంచిది. సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి. సుబ్రహ్మణ్యుని ఆలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగించాలి.
============================================================================

6.కన్య రాశి ఫలాలు 2023

కన్యా రాశి వారికి ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేదు. మానసికంగా కుదుటపడతారు. వ్యాపకాలు అధికమగుతాయి. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. రుణ సమస్యలు తొలగుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వ్యతిరేకులతో జాగ్రత్త. ఆహ్వానం అందుకుంటారు. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ముఖ్యులకు స్వాగతం, వీడ్కోలు పలుకుతారు. మరింత శుభఫలితాలు పొందాలంటే విఘ్నేశ్వరుని పూజించాలి. సంకటనాశన గణపతి స్తోత్రం పఠించాలి. వినాయకుడి ఆలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగించడం మంచిది.
=============================================================================

7.తులారాశి రాశి ఫలాలు 2023

తులా రాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోవాలి. సన్నిహితుల వ్యాఖ్యలు మీపై ప్రభావం చూపుతాయి. ఆందోళన తగ్గి కుదుటపడతారు. పుణ్యక్షేత్రాల సందర్శనకు సన్నాహాలు సాగిస్తారు. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. చీటికి మాటికి అసహనం చెందుతారు. మరింత శుభ ఫలితాలు పొందాలంటే బుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించండి. విఘ్నేశ్వరున్ని పూజించండి. రాహుకాల సమయంలో దుర్గాదేవిని పూజించండి.
=============================================================================

8.వృశ్చికం రాశి ఫలాలు 2023

వృశ్చిక రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. వివాదాలకు దిగవద్దు. పనులు హడావుడిగా సాగుతాయి. కుటుంబ సౌఖ్యం. ప్రశాంతత పొందుతారు. కీలక పత్రాలు అందుతాయి. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. మీ సమర్థతపై నమ్మకం పెంచుకోండి. విమర్శలు పట్టించుకోవద్దు. కార్యసాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ఖర్చులు అంచనాలను మించుతాయి. మరింత శుభఫలితాలు పొందాలంటే బుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించండి. విఘ్నేశ్వరున్ని పూజించండి. రాహుకాల సమయంలో దుర్గాదేవిని పూజించండి.
====================================================================================

9.ధనుస్సు రాశి ఫలాలు 2023

ధనూ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. ప్రముఖులతో పరిచయలు ఏర్పడతాయి. అవకాశాలను చేజిక్కించుకుంటారు. సభ్యత్వాలకు యత్నాలు సాగిస్తారు. పనులు నిదానంగా పూర్తి చేస్తారు. పెట్టుబడులు కలిసిరావు. ఎవరినీ అతిగా నమ్మవద్దు. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. మరింత శుభఫలితాలు పొందాలంటే సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేకం చేసుకోవడం మంచిది. సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి. సుబ్రహ్మణ్యుని ఆలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగించాలి.
======================================================================================

10.మకరం రాశి ఫలాలు 2023

మకర రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. పట్టుదలతో ప్రయత్నాలు సాగించండి. పనులు హడావుడిగా సాగుతాయి. ఆందోళన కలిగించే సమస్య సద్దుమణుగుతుంది. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. పిల్లల విషయంలో శుభ ఫలితాలున్నాయి. మానసికంగా కోలుకుంటారు. అపజయాలకు కుంగిపోవద్దు. ఖర్చులు అధికం అవుతాయి. ధైర్యంగా వ్యవహరిస్తారు. రాహు కాల సమయంలో అమ్మవారి వద్ద నువ్వుల నూనెతో దీపాలను వెలిగించడం మంచిది. ఈరోజు అమ్మవారికి కుంకుమార్చన చేయడం మంచిది.
=========================================================================================

11.కుంభం రాశి ఫలాలు 2023

కుంభ రాశి వారికి ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేదు. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. పత్రాలు, వస్తువులు జాగ్రత్తగా ఉంచాలి. బాధ్యతలు అప్పగించవద్దు. ఆహ్వానం అందుకుంటారు. పిల్లల మొండితనం ఇబ్బంది కలిగిస్తుంది. ఆరోగ్యం జాగ్రత్త. ఆత్మీయుల రాక సంతోషాన్నిస్తుంది. దైవకార్యాలను వ్యయం చేస్తారు. మరింత శుభఫలితాలు పొందాలంటే విఘ్నేశ్వరుని పూజించాలి. సంకట నాశన గణపతి స్తోత్రం పఠించాలి. వినాయకుడి ఆలయంలో నువ్వుతో నూనెతో దీపాలను వెలిగించడం మంచిది.

======================================================================================

12.మీనం రాశి ఫలాలు 2023

మీన రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. అవసరానికి మించి ధనాన్ని ఖర్చు చేస్తారు. ఖర్చులు తగ్గించుకోవాలని సూచన. ఫోన్‌ సందేశాలను నమ్మవద్దు. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. పత్రాల్లో సవరణలు అనుకూలించవు. ప్రతి విషయం క్షుణ్ణం తెలుసుకోవాలి. అవిశ్రాంతగా శ్రమిస్తారు. గృహంలో స్తబ్ధత నెలకొంటుంది. మీనరాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం గురువారం దక్షిణామూర్తిని, దత్తాత్రేయుని పూజించడం మంచిది. బుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించండి. విఘ్నేశ్వరున్ని పూజించండి. రాహుకాల సమయంలో దుర్గాదేవిని పూజించండి.

==========================================================================================

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *