Today Horoscope : నేటి రాశి ఫలాలు 01.10.2023 ఆదివారం

 Today Horoscope : నేటి రాశి ఫలాలు 01.10.2023 ఆదివారం

జ్యోతిష శాస్త్ర నిపుణులు చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. నేటి దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
తెలుగురాశి ఫలితములు (దిన ఫలితము) 01.10.2023, వారం: ఆదివారం, తిథి : విదియ, నక్ష్మత్రం : అశ్విని, మాసం : భాద్రపదం, సంవత్సరం: శోభకృత్‌ నామ, అయనం: దక్షిణాయనం
================================================================================

1.మేషరాశి ఫలాలు 2023

మేషరాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. ఉద్యోగస్తులకు అదనపు బరువు బాధ్యతలు స్వీకరిస్తారు. ముఖ్యమైన విషయాలు గోప్యంగా ఉంచండి. వ్యాపారస్తులకు శ్రమకు తగిన ప్రతిఫలం కానవస్తుంది. ట్రావెలింగ్‌ రంగాల వారికి కలసిరాగలదు. నిరుద్యోగులకు ఒక ప్రకటన ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. మేషరాశివారు ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం ఆదివారం రోజు సుబ్రహ్మణ్యుని పూజించడం మరియు సూర్యభగవానుని ఆరాధించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. సూర్యాష్టకం చదువుకోవడం వల్ల శుభఫలితాలు కలుగుతాయని తెలియ చేస్తున్నాను.
==========================================================================
2.వృషభం రాశి ఫలాలు 2023

వృషభరాశివారికి ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేదు. ఆర్థిక విషయాలు, పెట్టుబడుల గురించి స్పష్టమైన నిర్ణయానికి వస్తారు. విద్యార్థులలో నూతన ఉత్సాహం కనిపిస్తుంది. ఎంతో కొంత పొదుపు చేయాలనే మీ ఆలోచన నెరవేరుతుంది. ఉద్యోగస్తులు స్థానచలన యత్నాల్లో కొంత పురోగతి కనిపిస్తుంది. ప్రీల ఆదడంబరాలను చూసి ఎదుటివారు అపోహపడతారు. ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయడం మంచిది. వృషభరాశివారు ఈరోజు క్రిష్టాష్టకం పఠించడం వల్ల వృషభరాశి వారికి మరింత శుభఫలితాలు కలుగుతాయి.
===========================================================================
3.మిథునం రాశి ఫలాలు 2023

మిథునరాశివారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. ఆస్తి వ్యవహారాల్లో కుటుంబీకుల మధ్య పరస్పర అవగాహన లోపిస్తుంది. సినీ, కళా రంగాల్లో వారికి మార్చులు అనుకూలం. ప్రింటింగ్‌ రంగాల వారికి అరకొర పనులే లభిస్తాయి. ఖర్చులు అంతగా లేకున్నా ఆర్థిక సంతృప్తి అంతగా ఉండదు. రియల్‌ ఎస్టేట్‌ రంగాల వారికి ఊహించని ఇబ్బందులెదురవుతాయి. మిథునరాశివారు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే ఆదివారం రోజు సూర్యాష్టకం పఠించడం, మహావిష్ణువును పూజించడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయి.
========================================================================
4.కర్కాటకం రాశి ఫలాలు 2023

కర్కాటక రాశి వారికి ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేదు. కుటుంబ సభ్యుల కోసం ధనము అధికముగా ఖర్చు చేస్తారు. కొన్ని వ్యవహారాలు అనుకూలించినా మరికొన్ని ఆందోళన కలిగిస్తాయి. కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు మంజూరవుతాయి. విద్యార్థులు అనవసర విషయాలకు దూరంగా ఉండటం మంచిది. కర్కాటక రాశివారు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే నవగ్రహ పీడాహర స్తోత్రం పఠించాలి. అరుణం పఠించడం లేదా వినడం మంచిది.
==========================================================================
సింహరాశి ఫలాలు 2023

సింహరాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థముగా ఉన్నది. ఉన్నత స్థాయి అధికారులకు కింది స్థాయి సిబ్బంది సహాయ సహకారాలు లభిస్తాయి. డాక్టర్లకు అనుభవజ్ఞులతో పరిచయాలు, మంచి గుర్తింపు లభిస్తుంది. రావనుకున్న మొండి బాకీలు వసూలవుతాయి. ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. ఉపాధ్యాయులు ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. సింహరాశివారికి మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయాలి. నవగ్రహ పీడాహర స్తోత్రం పఠించడం మంచిది.
============================================================================
6.కన్య రాశి ఫలాలు 2023

కన్యారాశి వారికి ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేదు. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం శ్రేయస్మరం. దైవకార్యాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు. నగదు చెల్లింపు చెక్కుల జారీ విషయంలో జాగ్రత్త వహించండి. మీ నిజాయితీకి మంచి గుర్తింపు, ప్రశంసలు లభిస్తాయి. పాత్రికేయులకు ఒత్తిడి, పనిభారం అధికం. కొత్త రుణాల కోసం అన్వేషిస్తారు. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం విష్ణు సహస్ర నామ పారాయణ చేయడం, ఆదిత్య హృదయం పారాయణ చేయడం మంచిది.
=============================================================================
7.తులారాశి రాశి ఫలాలు 2023

తులారాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థం నుండి అనుకూలంగా ఉన్నది. పెద్దల ఆరోగ్య విషయంలో వైద్యుని సలహా అవసరం. దంపతుల మధ్య మనస్పర్థలు కలహాలు తలెత్తగలవు. బ్యాంకు వ్యవహారాల్లో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. విద్యార్థుల్లో జ్ఞాపకశక్తి ‘పెంపొందడంతోపాటు తోటి విద్యార్థులతో పోటీ పడతారు. భాగస్వామిక, వాణిజ్య ఒప్పందాలు మెరుగుపడతాయి. తులారాళివారు మరింత శుభ ఫలితాలు పొందాలనుకుంటే ఆదివారం రోజు నవగ్రహ పీడాహర స్తోత్రం పఠించడం మంచిది. ఆదిత్య హృదయం పారాయణ చేయడం వలన శుభఫలితాలు కలుగుతాయి.
=============================================================================
8.వృశ్చికం రాశి ఫలాలు 2023

వృశ్చిక రాశి వారికి ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేదు. బ్యాంకింగ్‌ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. స్వతంత్ర వృత్తులలో వారికి జయం చేకూరును. ధనం నిల్వ చేయాలనే మీ ఆలోచన ఫలించదు. ఉత్తర ప్రత్యుత్తరాలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. సిమెంటు, కలప, ఐరన్‌, ఇటుక వ్యాపారులకు మందకొడిగా ఉంటుంది. వృశ్చికరాశివారు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే ఆదిత్య హృదయాన్ని పఠించడం, నవగ్రహా ఆలయాల్లో పూజలు వంటివి చేయడం వలన మరింత శుభఫలితాలు కలుగుతాయి.

====================================================================================

9.ధనుస్సు రాశి ఫలాలు 2023

ధనూరాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. వార్తాసంస్థలలోని సిబ్బందికి మార్పులు అనుకూలిస్తాయి. నూతన పరిచయాలు పెరుగుతాయి. ప్రభుత్వ రంగాలలో వారికి సమస్యలు తలెత్తుతాయి. ప్రింటింగ్‌ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో ‘శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. ముక్కుసూటి పోయే మీ ధోరణి ఇబ్బందులకు దారితీస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ధనూరాశివారు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే సూర్యాష్ట్రకాన్ని పఠించాలి. నవధాన్యాలను దానం ఇవ్వడం మంచిది. క్షీరాన్నాన్ని ఆలయాల్లో ప్రసాదంగా పంచడం మంచిది.
======================================================================================

10.మకరం రాశి ఫలాలు 2023

మకర రాశివారికి ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేదు. ఉమ్మడి వ్యాపారాలు, లీజు, ఎజెన్సీ వ్యవహారాలకు సంబంధించిన విషయాలలో మెళకువ వహించండి. స్త్రీలు అనవసర విషయాలకు దూరంగా ఉండటం మంచిది. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం. విద్యార్థులకు విద్యా విషయాలలో ఏకాగ్రత ముఖ్యం. ఖర్చులు మీ రాబడికి మించడం వల్ల స్వల్చ ఒడిదుడుకులు తప్పవు. మకరరాశివారు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే నవగ్రహ శాంతి చేసుకోవడం మంచిది. ఈ రోజు నవగ్రహ ఆలయాలను దర్శించడం మంచిది. సూర్యాష్ట్రకాన్ని పఠించండి..
=========================================================================================

11.కుంభం రాశి ఫలాలు 2023

కుంభరాశి వారికి ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేదు. సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. రిప్రజెంటేటివ్‌లకు సంతృప్తి కానవస్తుంది. ఉపాధ్యాయులకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. దూర ప్రయాణాలలో వస్తువుల పట్ల మెళకువ అవసరం. రావలసిన ధనం కొంత ముందు వెనుకలుగానైనా అందుతుంది. విద్యార్థులకు క్రీడలపట్ల ఆసక్తి పెరుగుతుంది. మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయాలి. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. నువ్వలతో చేసిన ప్రసాదాన్ని ఆలయాల్లో పంచి పెట్టండి.

======================================================================================

12.మీనం రాశి ఫలాలు 2023

మీన రాశి వారికి ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేదు. శత్రువులు మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. ఉద్యోగస్తులు తోటివారి నుండి ఆసక్తికరమైన విషయాలు గ్రహిస్తారు. ఐరన్‌, కలప, సిమెంట్‌ వ్యాపారస్తులకు మందకొడిగా ఉండగలదు. మీకు నచ్చని సంఘటనలు కొన్ని ఎదురు కావచ్చు. ముఖ్యులతో సంభాషించేటప్పుడు ఆచి, తూచి వ్యవహరించడం మంచిది. నవగ్రహ స్తోత్రం పారాయణ చేయండి. విష్ణుసహస్రనామ పారాయణ చేయడం వలన శుభఫలితాలు కలుగును.
===========================================================================================

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *