Today Horoscope : నేటి రాశి ఫలాలు తేదీ 09 అక్టోబరు 2023 సోమవారం
జ్యోతిష్య శాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మీ దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
తెలుగురాశి ఫలితములు (దిన ఫలితము) 09.10.2023, వారం: సోమవారం,
తిథి : దశమి,
నక్షత్రం : ఆశ్లేష పూర్తి,
మాసం : భాద్రపదం,
సంవత్సరం: శోభకృత్ నామ,
అయనం: దక్షిణాయనం
1.మేషరాశి ఫలాలు 2023
మేషరాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. పెట్టుబడికి కావలసిన ధనం అప్పు చేస్తారు. రహస్యంగా చర్చలు సాగిస్తారు. అన్నీ మీరే అయ్యి సంస్థను ముందుకు నడిపిస్తారు. విప్లవాత్మక నిర్ణయలు తీసుకుంటారు. ఆరోగ్య సూత్రాలకు ప్రాధాన్యతనిస్తారు. న్యాయబద్ధంగా నడుచుకునే మీ నడవడిక వల్ల ఎంతగానో లాభపడతారు. పుకార్లను నమ్మకంది. మేషరాశివారు ఈరోజు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే శివాష్టకం పఠించడం మంచిది. శివుడికి చెరుకురసంతో అభిషేకం చేయడం వలన ఉన్నత పదవులు మరియు ధనమును పొందెదరు
==========================================================================
2.వృషభం రాశి ఫలాలు 2023
వృషభరాశివారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. ముఖ్యమైన సందర్భాల్లో మీదే పై చేయిగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు దీక్షలను నిర్వహిస్తారు. సహ ఉద్యోగుల వల్ల ఇబ్బందులు ఏర్పడే సూచనలున్నాయి. కోర్టు తీర్పులు అనుకలంగా ఉంటాయి. గతంలో దూరమైన వర్గం తిరిగి చేరువవుతుంది. వృషభరాశివారు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే శివుడిని పంచామృతాలతో అభిషేకం చేసుకోవడం మంచిది. పంచాక్షరీ మంత్రంతో 108 సార్లు శివనామస్మరణ చేయడం శుభఫలితాలు కలుగుతాయి.
===========================================================================
3.మిథునం రాశి ఫలాలు 2023
మిథునరాశివారికి ఈ రోజు మీకు సాధారణ ఫలితాలున్నాయి. బ్యాంకు రుణాలు కలసివస్తాయి. దైవం మీద భారం వేసి ముఖ్యమైన వ్యవహారాలు చకృబెట్టుకుంటారు. ఆస్తుల పరిరక్షణ కష్టతరమవుతుంది. ఎంత శ్రమించినా శ్రమకు అంతంత మాత్రపు ఫలితాలున్నాయి. మిథునరాశి వారికి మరింత శుభఫలితాలు కలగాలంటే శివుడిని తేనెతో అభిషేకం చేయడం మంచిది. శివాష్టకం పఠించండి. గోవులకు అరటిపళ్ళు తినిపించండి.
========================================================================
4.కర్కాటకం రాశి ఫలాలు 2023
కర్కాటక రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. విదేశాల నుంచి విలువైన సమాచారం అందుకుంటారు. గృహం లేదా వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపార విస్తరణ కార్యక్రమాల కోసం మీరు చేసే కృషి ఫలిస్తుంది. రుణం ఇవ్వడం, తీసుకోవడం రెండూ కలసిరావు. ముఖ్యమైన కార్యక్రమాలు సత్ఫలితాలను ఇస్తాయి. కర్మాటకరాశివారికి వారికి మరింత శుభఫలితాలు కలగాలంటే పాలతో శివుడిని అభిషేకం చేసుకోవడం మంచిది. శివారాధన మరియు పంచాక్షరీ జపం వలన శుభఫలితాలు కలుగుతాయి.
==========================================================================
సింహరాశి ఫలాలు 2023
సింహరాశి వారికి ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలున్నాయి. బ్యాంకు రుణాల విషయంలో సాంకేతిక లోపాలు చోటు చేసుకుంటాయి. విబేధాలు తారాస్థాయికి చేరుకోకుండా ఆదిలోనే పరిష్మరించుకుంటే మంచిది. ఉచిత సలహాలిచ్చేవారు ఎక్కువవుతారు. మీరు చేసే పనులలో ఇబ్బందులను అధిమగించి పనులను సాధిస్తారు. సింహరాశివారు మరింత శుభఫలితాలు పొందడానికి చెరుకురసంతో శివుడికి అభిషేకం చేసుకోవడం మంచిది.
============================================================================
6.కన్య రాశి ఫలాలు 2023
కన్యారాశి వారికి ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేదు. ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఆదాయ, వ్యయాలలో సమతుల్యతను సాధించడానికి మీరు చేసే కృషి నామమాత్రపు ఫలితాలనిస్తుంది. కీలకమైన వ్యవహారాలలో ఏర్చడిన ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ఇతరులకు ఆచరణ సాధ్యం కాని పనులను మీరు చేయగలుగుతారు. కన్యారాశి వారికి మరింత శుభఫలితాలు కలగాలంటే పంచామృతాలతో శివుడిని అభిషేకం చేయాలి. శివ అష్టోత్తర శతనామావళి పఠించండి.
=============================================================================
7.తులారాశి రాశి ఫలాలు 2023
తులారాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉంది. విలువైన సమాచారం తెలుసుకుంటారు. చురుగ్గా వ్యవహరిస్తారు. ప్రతి వానిని ఒక క్రమ పద్ధతిలో నిర్వహిస్తారు. ధనాన్ని కన్నా వ్యక్తిగత గౌరవానికి అధిక ప్రాముఖ్యతనిస్తారు. వృత్తి ఉద్యోగాలపరంగా స్థిరత్వం సాధిస్తారు. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. తులారాశి వారికి మరింత శుభఫలితాలు కలగాలంటే శివాష్టకం పఠించండి. ఈశ్వరుణ్ణి పళ్ళ రసాలతో అభిషేకం చేయడం మంచిది.
=============================================================================
8.వృశ్చికం రాశి ఫలాలు 2023
వృశ్చికరాశి వారికి ఈరోజు మీకు సానుకూల ఫలితాలున్నాయి. దూరప్రాంత వ్యవహారాలు ఫలిస్తాయి. రావాల్సిన ధనం చేతికంది వస్తుంది. శత్రువులు మీపై చేస్తున్న దుష్ప్రచారం తిప్పికొడతారు. మీకంటూ ఓ ప్రత్యేకతను ఏర్చరచుకోవడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తారు. మానసిక సంఘర్షణకు గురౌతారు. మారుతున్న సామాచిన పరిస్థితులు ఆలోచింపచేస్తాయి. వృశ్చికరాశి వారికి మరింత శుభఫలితాలు కలగాలంటే పంచాక్షరీ మంత్రంతో 18 సార్లు శివనామస్మరణ చేయాలి. శివ అష్టోత్తర శతనామావళి పఠించండి.
====================================================================================
9.ధనుస్సు రాశి ఫలాలు 2023
ధనూరాశి వారికి ఈరోజు మీకు మధ్యస్తముగా ఉంది. పొదుపు పథకాలు పాటించడంలో వైఫల్యం చెందుతారు. మానసిక ప్రశాంతతకు భంగం కలిగించేలా కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటాయి. మీ మంచితనమే మీకు శ్రీరామరక్ష చాలా సందర్భాల్లో మీ అంచనాలు తారుమారు అవుతాయి. పెట్టుబడులు, కీలకమైన చర్చలు, ప్రయాణాల్లో నిదానంగా వ్యవహరించండి. వృత్త ఉద్యోగాల్లో మీ స్థాయి యథాతథం. ధనూరాశివారికి మరింత శుభఫలితాలు కలగాలంటే శివాష్టకాన్ని పఠించండి. బిల్వాష్టకము పఠించి శివారాధన చేయడం మంచిది.
======================================================================================
10.మకరం రాశి ఫలాలు 2023
మకరరాశి వారికి ఈరోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. ఏ పని ఎందుకు చేస్తున్నారో మీకు తప్ప ఇతరులకు తెలియనివ్వరు. రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పడతాయి. విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. మీలోని సృజనాత్మకత వెలుగు చూస్తుంది. పలువురు ప్రశంసించే విధంగా ఉంటుంది మీ నడవడిక. కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. శుభకార్య చర్చలు సాగిస్తారు. మకరరాశివారు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే పంచామృతాలతో శివుడిని అభిషేకం చేసుకోవడం మంచిది. శివ అష్టోతర శతనామావళి పఠించండి.
=========================================================================================
11.కుంభం రాశి ఫలాలు 2023
కుంభ రాశి వారికి ఈరోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. నూతన వస్తువులు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు. న్యాయపరమైన చిక్కుల్లో చిక్కుకున్న మీ వారిని రక్షించాల్సిన బాధ్యత మీపైన బాధపడుతుంది. ఇతరులకు మీవంతు సహాయ సహకారాలు సంపూర్ణంగా అందిస్తారు. ఆర్థికంగా పూర్తిస్థాయిలో కాకపోయినా కొంతవరకు ఊరట చెందుతారు. కొత్త అవకాశాలు కలసివస్తాయి. కుంభరాశి వారికి మరింత శుభఫలితాలు కలగాలంటే బిల్వాష్టకం పఠించండి. విశ్వనాథాష్టకం పఠించండి. పంచామృతాలతో శివుడిని అభిషేకం చేసుకోవడం వలన శుభఫలితాలు కలుగుతాయి.
======================================================================================
12.మీనం రాశి ఫలాలు 2023
మీన రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. ముఖ్యమైన కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేస్తారు. మీ నిజాయితీని రుజువు చేసుకుంటారు. పరోపకారం బుద్ధి కలిగి ఉంటారు. వ్యాపారాలకు లాభాలు రొటేషన్ల రూపంలో ఉంటాయి. ఉచిత సలహాలు ఇవ్వడం, తీసుకోవడం రెండూ కలసిరావు. సినీ, కళా సాంస్కృతిక రంగాల్లోని వారు జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఆరోగ్య సమస్యలన అధిగమించడానికి వైద్యుణ్ణి మార్చు చేస్తారు. మీనరాశివారు మరింత శుభఫలితాలు పొందడానికి బిల్వ పత్రాలతో శివ అష్టోత్తర శతనామావళితో ఈశ్వరుణ్ణి పూజించండి. విశ్వనాథాష్టకం పఠించండి.
==========================================================================================