Thread on wrist: మణికట్టుకి రంగు దారం ఎందుకు కట్టుకుంటారు?

 Thread on wrist: మణికట్టుకి రంగు దారం ఎందుకు కట్టుకుంటారు?

Thread on wrist: అమ్మాయిలు, అబ్బాయిలు అనే తేడా లేకుండా చాలా మంది చేతుల మణికట్టుకి ఎరుపు, పసుపు రంగుల తాడు చూస్తూనే ఉంటాం. అసలు ఆ దారం ఎందుకు కట్టుకుంటారో తెలుసా?

Thread on wrist: చాలా మంది చేతులకు ఎరుపు లేదా పసుపు రంగు దారాలు కట్టుకుని కనిపిస్తారు. దారం రంగు మారిపోతే కొత్త దారం కట్టుకుంటారు. మణికట్టు చుట్టూ దారాన్ని కట్టుకోవడం అనేది హిందూమతంలో చాలా పవిత్రంగా భావిస్తారు. పూజలు, వ్రతాలు, నోములు లేదా ఇతర మతపరమైన వేడుకల ప్రారంభానికి ముందు మణికట్టు చుట్టూ దారం కట్టుకుంటారు. దీన్నే కంకణం అని కూడా పిలుస్తారు. పసుపు, ఎరుపు, నారింజ రంగులో ఉండే వాటిని మౌళి దారాలు అంటారు. ఇది పురాతనమైన ఆచారం.

పవిత్ర దారం వెనుక చరిత్ర

మణికట్టుకి దారం కట్టే సంప్రదాయానికి హిందూ మతంలో గొప్ప చరిత్ర ఉంది. రక్షణకి చిహ్నంగా, వ్యక్తుల మధ్య ఉన్న పవిత్ర బంధానికి గుర్తుగా దీన్ని పరిగణిస్తారు. అసురుడైన బలి చక్రవర్తి దానాలు చేయడంలో చాలా గొప్పవాడు. అతడిని అంతమొందించడానికి విష్ణువు వామనుడు అవతారం ఎత్తాడు. తన వద్దకి వచ్చిన వామనుడిని చూసిన బలి చక్రవర్తి ఏం కావాలో కోరుకోమని చెప్తాడు. మూడడుగుల స్థలం కావాలని కోరతాడు. ఓ అడుగు భూమిపై, మరొక అడుగు ఆకాశంపై పెడతాడు. మరో అడుగు ఎక్కడ పెట్టాలని అంటే వామనుడు తన తల మీద పెట్టమని చెప్తాడు.

వామనుడు తన కాలిని నెత్తి మీద పెట్టగానే పాతాళంలోకి వెళ్ళిపోతాడు. బలి దాన గుణం మెచ్చిన వామనుడు అతడిని మృత్యుంజయుడిగా ఉండేలా వరం ఇస్తూ దారాన్ని కడతాడు. అలా మౌళి దారం వచ్చింది. దారం కట్టేదానికి మరొక కథ కూడా ఉంది. శ్రీకృష్ణుడు తన వేలికి దెబ్బ తగిలినప్పుడు ద్రౌపది తన చీర ముక్కని చింపి రక్తస్రావం ఆగడానికి కట్టు కడుతుంది. అప్పటి నుంచి కృష్ణడు ద్రౌపదిని కాపాడతానని వాగ్ధానం చేస్తాడు. ఈ సంఘటనలు మతపరమైన సందర్భాలు, వేడుకలు, పండుగ సమయంలో మణికట్టుపై పవిత్రమైన దారాన్ని కట్టేందుకు పునాది వేసింది.

మణికట్టుకి కట్టే దారాన్ని కలవా అని కూడా పిలుస్తారు. ఇది దీర్ఘాయువు, రక్షణ, ప్రేమ, ఆశీర్వాదాలకి ప్రతీకగా ధరిస్తారు. ఎరుపు దారం కట్టడం అనేది చెడు, ప్రతికూల శక్తుల నుంచి రక్షించే దైవిక శక్తుల్ని సూచించడానికి గుర్తుగా కట్టుకుంటారు.

చెట్టు చుట్టూ దారం ఎందుకు కడతారు?

కొన్ని ఆలయాల్లో భక్తులు రావి చెట్టు చుట్టూ పసుపు, ఎరుపు రంగుల దారాలు కడతారు. అలా చేయడం వల్ల వారి కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. ఈ దారం దేవతల మీద భక్తులకున్న భక్తిని సూచిస్తుంది. దారం కట్టి కోరిన కోరిక తీరిన తర్వాత ప్రతిఫలంగా దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతూ దారం కడతారు.

పవిత్ర దారం వెనుక శాస్త్రీయ కారణం

మణికట్టుకి దారం కట్టుకోవడం వెనుక సంప్రదాయం మాత్రమే కాదు శాస్త్రీయ కారణం కూడా ఉంది. మణికట్టు పల్స్ పాయింట్. మానవ శరీర నిర్మాణంలో దాదాపు 72 వేల ప్రధాన సిరలు మణికట్టు నుంచి ఇతర శరీర భాగాలకి అనుసంధానించబడి ఉంటాయి. మణికట్టుకి దారం కట్టుకోవడం వల్ల పల్స్ పాయింట్ ని ప్రేరేపిస్తుంది. ఈ దారాలు కాటన్ లేదా సిల్క్ వంటి పదార్థాలతో తయారు చేస్తారు. ఇవి చర్మానికి ప్రయోజనకరమైన సహజ లక్షణాలని కలిగి ఉంటాయి.

ఏ చేతికి కట్టుకోవాలి?

సంప్రదాయం ప్రకారం దారం, మౌళి, కలవా, రాఖీ ఇలా ఏ తాడు అయిన కుడి చేతి మణికట్టుకి కట్టాలి. కుడి చెయ్యి మంగళకరమైనది. బలం, శక్తి, ధర్మాన్ని సూచిస్తుంది. రాఖీ లేదా కలవాని కుడి చేతి మణికట్టుపై కట్టడం వల్ల ధరించేవారు జీవితంలో సవాళ్ళని ఎదుర్కొనే రక్షణ, శక్తిని పొందుతారని నమ్ముతారు. ఈ దారాన్ని మణికట్టు చుట్టూ మూడు సార్లు మాత్రమే చూట్టాలి. అలాగే వీటిని చెత్త డబ్బాల్లో పారేయకూడదు. దీన్ని రావి చెట్టు కింద పాతిపెట్టొచ్చు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *