TGSRTC: పండక్కి ఊరెళ్లే వారికి గుడ్ న్యూస్.. అదనంగా 5వేల బస్సులు

 TGSRTC: పండక్కి ఊరెళ్లే వారికి గుడ్ న్యూస్.. అదనంగా 5వేల బస్సులు

సంక్రాంతి పండుగకు హైదరాబాద్ నుంచి ఏపీకి ప్రజలు భారీగా వెళ్తుంటారు. ఈ క్రమంలో తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనంగా 5 వేల ప్రత్యేక బస్సులను ఏపీకి నడపనున్నట్లు తెలిపింది. పది రోజుల పాటు ఈ బస్సులు నడపనున్నారు

ఏపీలో ముఖ్యమైన పండుగల్లో సంక్రాంతి ఒకటి. ఈ పండుగ కోసం అందరూ ఎంతగానో ఎదురుచూస్తుంటారు. ఎంత దూరంలో ఉన్నా కూడా తప్పకుండా ఈ పండుగకి ఇంటికి చేరుకుంటారు. ఏపీ ప్రజలు చాలా మంది ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్తుంటారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో నివసించే వారు తప్పకుండా సంక్రాంతికి ఇంటికి వెళ్తారు.

బస్సులు, కార్లు, రైళ్లు ఏదో విధంగా అయిన కూడా పండగకి వెళ్లాలని అనుకుంటారు. సంక్రాంతి సమయంలో ఏ వాహనం కూడా ఖాళీ ఉండదు. దీంతో సొంతూళ్లకు వెళ్లడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారికి తెలంగాణ ఆర్టీసీ శుభవార్త తెలిపింది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రత్యేకంగా 5 వేల బస్సులను ఏపీకి నడపనున్నట్లు తెలిపింది.

జనవరి మొదటి వారం నుంచి పది రోజుల పాటు ఏపీకి ప్రత్యేక బస్సులు నడపనున్నారు. అయితే ఈ 5 వేల బస్సులు ఏయే రూట్లలో నడుస్తాయనే విషయాలు ఇంకా తెలియాలి. అలాగే బస్సు ఛార్జీలు పెంచుతున్నారా? లేకపోతే యథావిధిగానే ఉంటాయనే విషయాలు కూడా ఇంకా ఆర్టీసీ వెల్లడించలేదు.

హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లే వారి కోసం ఏపీఎస్ ఆర్టీసీ కూడా ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేయనుంది. 2400 బస్సులను ప్రత్యేకంగా నడపనున్నారు. పండగ సమయంలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలోనే ఏపీఎస్‌ ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ప్రత్యేక బస్సులను జనవరి 9 నుంచి 13 వరకు ప్రయాణికులకు అందుబాటులో ఉండనున్నాయని ఏపీఎస్ ఆర్టీసీ తెలిపింది.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *