Telangana Assembly Sessions Live News : ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం – అప్పులు లేని రాష్ట్రంగా మారుస్తామన్న సీఎం రేవంత్

 Telangana Assembly Sessions Live News : ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం – అప్పులు లేని రాష్ట్రంగా మారుస్తామన్న సీఎం రేవంత్

Telangana Assembly Session Live Updates : ఇవాళ ఉదయం 11 గంటలకు తెలంగాణ అసెంబ్లీ ప్రారంభమైంది. మొదట సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ‘తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు- శ్వేత పత్రం’పై చర్చ ప్రారంభమైంది. ఆర్థిక మంత్రి భట్టి… ఆర్థికస్థితిగతులను వివరించారు. బీఆర్ఎస్ తరపున హరీశ్ రావు మాట్లాడారు.

Wed, 20 Dec 202308:19 PM IST

శాసనసభ సమావేశాలు వాయిదా

తెలంగాణ శాసనసభ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి.

కాళేశ్వరం కార్పొరేషన్ల పేరుతో భారీగా రుణాలు- భట్టి విక్రమార్క

కాళేశ్వరం ప్రాజెక్టు కోసం కార్పొరేషన్ల పేరుతో భారీగా రుణాలు తెచ్చారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. గత ప్రభుత్వం రోజు వారీ ఖర్చుల కోసం ఓవర్ డ్రాఫ్ట్ తీసుకునేదని అన్నారు. ఆర్బీఐ నుంచి ఓడీ తీసుకువచ్చి ప్రభుత్వాన్ని నడిపించారన్నారు. 2014లో రాష్ట్రం ఏర్పడినప్పుడు రుణభారం కేవలం 14 శాతం ఉంటే ఇప్పుడు రుణభారం 34 శాతానికి పోయిందన్నారు. గత తొమ్మిదిన్నరేళ్లుగా ఆస్తుల సృష్టి జరగలేదన్నారు. అప్పులు మాత్రం భారీగా పెరిగాయన్నారు.

Wed, 20 Dec 202306:43 PM IST

విద్యుత్, సాగునీటి రంగాలపై శ్వేత పత్రాలు విడుదల చేస్తాం- సీఎం రేవంత్ రెడ్డి

గత పాలకులు వాస్తవాలు దాచి గొప్పులు చెప్పుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. చివరికి ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి తెచ్చారన్నారు.వాస్తవాలు కఠోరంగా ఉన్నప్పుడు వాటిని అంగీకరించాలన్నారు. ఈ వాస్తవాలు కొందరికి చేదుగా ఉండొచ్చన్నారు. విద్యుత్, సాగు నీటి రంగాలపై శ్వేత పత్రాలు విడుదల చేస్తామన్నారు.

Wed, 20 Dec 202306:05 PM IST

అప్పులు చేయడం తప్పు కాదు, ఆ సొమ్ము దేనికి ఖర్చు చేశారో ముఖ్యం- కూనంనేని

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య వాడీవేడి చర్చలు జరుగుతున్నాయి. సభలో సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ… అప్పులు చేయడం తప్పు కాదు, కానీ ఆ సొమ్ము దేనికి ఖర్చు చేశారన్నదే ముఖ్యమన్నారు. ప్రజల బతుకుల బాగు కోసం అప్పులు చేయడంలో తప్పు లేదన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా అభివృద్ధి జరగాలన్నారు. ఇప్పటికీ రాష్ట్రంలో పోషకాహార లోపంతో పిల్లలు మరణించడం బాధాకరం అన్నారు.

అఖిలపక్ష సమావేశం

గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. అన్ని పార్టీల ఎమ్మెల్యేలతో మాట్లాడుతామని అన్నారు. అన్నివర్గాలను పిలిచి అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు.

Wed, 20 Dec 202305:30 PM IST

సూచనలు స్వీకరిస్తాం – సీఎం రేవంత్

శ్వేతపత్రంపై అనుమానాలు ఉంటే నివృత్తి చేస్తామని చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రతిపక్షాల సలహాలు, సూచనలను స్వీకరిస్తామని అన్నారు.

Wed, 20 Dec 202305:22 PM IST

కీర్తిని పెంచుతాం – సీఎం రేవంత్

ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ కీర్తిని పెంచే దిశగా పని చేస్తామని చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అప్పులు తీసుకునే లేకుండా రాష్ట్రాన్ని ముందుగా తీసుకొస్తామని చెప్పారు సీఎం రేవంత్.

Wed, 20 Dec 202305:12 PM IST

సీఎం రేవంత్ రియాక్షన్…

అక్బరుద్దీన్ స్పీచ్ పై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. శ్వేతపత్రాన్ని బయటపెట్టడం వెనక ఇతర ఉద్దేశ్యాలు లేవన్నారు. తెలంగాణలో ఏం జరిగిందని చెప్పటం కోసం ఈ శ్వేతపత్రాన్ని ప్రకటించామన్నారు. కానీ రాష్ట్రం దివాలా తీసిందనే చెప్పే ప్రయత్నం చేయటం లేదన్నారు.

Wed, 20 Dec 202305:06 PM IST

అక్బరుద్దీన్ కామెంట్స్

తెలంగాణ ముమ్మాటికీ ధనిక రాష్ట్ర‌మే అని చెప్పే ప్రయత్నం చేశారు అక్బ‌రుద్దీన్ ఓవైసీ. అప్పులు పెరిగినా అభివృద్ధి కూడా గ‌ణ‌నీయంగా జ‌రిగిందని గుర్తు చేశారు అక్బరుద్దీన్. 55 ఏండ్ల‌లో జ‌ర‌గ‌ని అభివృద్ధి ఈ ప‌దేండ్ల కాలంలో జ‌రిగిందన్నారు. రాష్ట్రంలోనే కాదు కేంద్రంలోనూ అప్పులు పెరిగాయని… వాటిపై కూడా మాట్లాడాలని సూచించారు. రాజ‌కీయ కోణం ఉండొచ్చు కానీ… కానీ మాకు రాష్ట్ర స‌మ‌గ్ర‌త‌, అభివృద్ధిని కాపాడ‌టమే ఎంఐఎం కర్తవ్యమని చెప్పారు.

తెలంగాణ లాభ‌దాయ‌క రాష్ట్ర‌మే – అక్బరుద్దీన్

స‌భ‌ను త‌ప్పుదోవ ప‌ట్టించిన బ్యూరోక్రాట్ల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అక్బ‌రుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేశారు.తెలంగాణ ముమ్మాటికీ లాభ‌దాయ‌క రాష్ట్ర‌మే అని స్పష్టం చేశారు.

Wed, 20 Dec 202304:50 PM IST

ఎన్నో రంగాల్లో ప్రగతి

కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం… అనేక రంగాల్లో ప్రగతి సాధించిందని చెప్పారు అక్బరుద్దీన్.

Wed, 20 Dec 202304:42 PM IST

సరికాదు

తెలంగాణ దీవాలా తీసిందని చెప్పడం సరికాదన్నారు అక్బరుద్దీన్. రాష్ట్రానికి వచ్చే పరిశ్రమలకు తప్పుడు సంకేతాలు ఇవ్వవద్దని కోరారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించారు.

Wed, 20 Dec 202304:25 PM IST

వేటిని నమ్మాలి – అక్బరుద్దీన్

ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల విషయంలో కాగ్ ఇచ్చిన లెక్కలు, శ్వేతపత్రంలోని లెక్కలు పూర్తి తేడాగా ఉన్నాయని అన్నారు. వీటిల్లో వేటిని నమ్మలాని ప్రశ్నించారు. సరైన గణాంకాలను ఇవ్వాలని కోరారు.

Wed, 20 Dec 202304:20 PM IST

సరైన ప్రశ్నలే అడుగుతున్నాను….

తాము నిర్మాణాతమ్మకమైన ప్రశ్నలు అడుగుతున్నామని… రాష్ట్ర అభివృద్ధే తమ లక్ష్యమని చెప్పారు అక్బరుద్దీన్. తప్పులనే అడుగుతున్నాననిపేర్కొన్నారు.

Wed, 20 Dec 202304:20 PM IST

రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతింటుంది – అక్బరుద్దీన్

తప్పుదోవ పట్టించేలా పలు అంశాలు ఉన్నాయని అక్బరుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి లేదంటూ ఇచ్చిన ఈ శ్వేతపత్రాలతో రాష్ట్ర ఇమేజ్ దెబ్బతింటుందని కామెంట్స్ చేశారు.

Wed, 20 Dec 202304:16 PM IST

సీఎం క్లారిటీ

శ్వేతపత్రంలోని అంకెలు పూర్తిగా తేడాగా ఉన్నాయని విమర్శించారు అక్బరుద్దీన్. అయితే వీటిపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

Wed, 20 Dec 202304:13 PM IST

అక్బరుద్దీన్ స్పీచ్…

శ్వేతపత్రంపై అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడారు. శ్వేతపత్రంలోని పలు అంశాలు తప్పుగా ఉన్నాయని పేర్కొన్నారు. కాగ్ నివేదికలోని అంకెలు… ప్రస్తుతం ఇచ్చిన శ్వేతపత్రంలోని అంకెలు తేడాగా ఉన్నాయని చెప్పారు.

విచారణ ఆగదు

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడీగా సాగుతున్నాయి. ఆర్థికపరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయగా… అధికార, ప్రతిపక్ష పార్టీలు కీలక అంశాలను ప్రస్తావించారు. శ్వేతపత్రంపై బీఆర్ఎస్ తరపు హరీశ్ రావు సుదీర్ఘంగా మాట్లాడారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు గురించి స్పందిస్తూ… కాళేశ్వరంపై వెంటనే సెట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు. నిప్పులో కాల్చితేనే బంగారం విలువ తెలుస్తుందంటూ కామెంట్స్ చేశారు.

Wed, 20 Dec 202303:53 PM IST

ఆయకట్టు ఎంత..?

కాళేశ్వరం కింద లక్ష ఎకరాల ఆయకట్టు కూడా లేదన్నారు మంత్రి ఉత్తమ్. ఇందుకోసం లక్ష కోట్లు ఖర్చు చేశారని విమర్శించారు.

Wed, 20 Dec 202303:52 PM IST

విచారణ జరిపిస్తాం – మంత్రి ఉతమ్

ప్రాజెక్టులపై విచారణకు సిద్ధమన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. అవినీతి వెనక ఉన్న వారికి శిక్ష వేస్తామని చెప్పారు.

Wed, 20 Dec 202303:51 PM IST

మంత్రి ఉత్తమ్ స్పీచ్

శ్వేతపత్రంలోని పలు అంశాలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. హరీశ్ రావు ప్రసంగంలోని పలు అంశాలు పూర్తిగా తప్పుగా ఉన్నాయని అన్నారు.

Wed, 20 Dec 202303:39 PM IST

మంత్రుల కౌంటర్

బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వరిరెడ్డి ప్రసంగానికి అడుతగిలారు మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్. కేంద్రంలో ఇచ్చిన బీజేపీ ఇచ్చిన హామీలపై మాట్లాడాలని హితవు పలికారు.

Wed, 20 Dec 202303:52 PM IST

మాకు సమయం ఇవ్వాలి

తమకు ఎక్కువ సమయం ఇవ్వాలని కోరారు బీజేపీ ఎమ్మెల్యే పరమేశ్వర్ రెడ్డి. సభలో మాది మూడో అతిపెద్ద పార్టీ అని చెప్పారు.

Wed, 20 Dec 202303:42 PM IST

వంద రోజుల సమయం ఇస్తాం

కాంగ్రెస్ కు వంద రోజుల సమయం ఇస్తామని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అన్నారు. చేయకపోతే… బీజేపీ పోరాడుతుందన్నారు.

Wed, 20 Dec 202303:12 PM IST

ఎలా అమలు చేస్తారు – మహేశ్వర్ రెడ్డి

మోటర్లకు మీటర్లు పెడ్తామని కేంద్రం ఎక్కడా చెప్పలేదని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఆరు గ్యారెంటీలను ఎలా అమలు చేస్తారనే విషయాన్ని కాంగ్రెస్ చెప్పాలని కోరారు.

Wed, 20 Dec 202303:42 PM IST

కేంద్రం సాకారం ఇచ్చింది

తెలంగాణకు ఎన్నో రకాలుగా కేంద్రం సాకారం అందించిందని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అన్నారు. హరీశ్ రావు తప్పుడు వ్యాఖ్యలు చేశారని… వారి లోపాలను కేంద్రపైకి నెట్టే యత్నం చేశారని అన్నారు.

Wed, 20 Dec 202302:56 PM IST

అమలు చేస్తాం

ఎల్లారెడ్డిలో బస్తీ దవాఖానాలు కూడా సరిగా పని చేయలేని స్థితిలో ఉన్నాయని అన్నారు మదన్ మోహన్ రెడ్డి. రాబోయే రోజుల్లో అన్ని గ్యారెంటీలను అమలు చేస్తామని అన్నారు.

Wed, 20 Dec 202303:20 PM IST

అప్పుల కుప్పగా మార్చారు

పదేళ్లలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు విమర్శించారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థ కుప్పకూలిందన్నారు.

Wed, 20 Dec 202302:40 PM IST

స్పీకర్ ప్రకటన

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను తొలగిస్తే… నా వ్యాఖ్యలను తొలగించాలని కోరారు హరీశ్ రావు. అయితే స్పీకర్.. హరీశ్ కామెంట్స్ ను తొలగిస్తున్నట్లు ప్రకటించారు.

Wed, 20 Dec 202302:39 PM IST

హరీశ్ కామెంట్స్ తొలగింపు…

పీసీసీ అధ్యక్ష పదవికి సంబంధించి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలను తొలగించాలని స్పీకర్ ప్రకటించారు.

Wed, 20 Dec 202302:29 PM IST

హరీశ్ కామెంట్స్ పై వాగ్వాదం

సభలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై హరీశ్ రావు స్పందించారు. ఈ సందర్భంలో పీసీసీ పదవి అంశాన్ని ప్రస్తావించటంతో సభలో వాగ్వాదం నెలకొంది.

Wed, 20 Dec 202302:23 PM IST

సభలో వాగ్వాదం

సభలో వాగ్వాదం నెలకొంది. హరీశ్ రావుకు మైక్ ఇవ్వాలని బీఆర్ఎస్ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

Wed, 20 Dec 202302:22 PM IST

కోమటిరెడ్డి కౌంటర్…

హరీశ్ కామెంట్స్ కు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తనకు మంత్రి పదవి రావటం విషయంలో చేసిన వ్యాఖ్యలను ఖండించారు.

Wed, 20 Dec 202302:14 PM IST

హరీశ్ పై సీఎం కామెంట్స్

సభలో హరీశ్ రావును టార్గెట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. తప్పుడు సమాచారాన్ని చెప్పే వారిపై చర్యలు తీసుకోవాలని సభా వ్యవహారాల శాఖ మంత్రిని కోరారు.

Wed, 20 Dec 202302:12 PM IST

సీఎం రేవంత్ కామెంట్స్

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడీగా సాగుతున్నాయి. బుధవారం ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయగా… బీఆర్ఎస్ నుంచి హరీశ్ రావు మాట్లాడారు. ఈ సందర్భంగా పలు అంశాలను ప్రస్తావించారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడే సందర్భంలో… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మైక్ తీసుకున్నారు.

Wed, 20 Dec 202301:41 PM IST

మంత్రి కొండా సురేఖ విమర్శలు

హరీశ్ రావు మాట్లాడుతుండగా… మంత్రి కొండా సురేఖ జోక్యం చేసుకున్నారు. గత ప్రభుత్వంలో విలువైన ఆస్తులను ధ్వంసం చేశారని విమర్శించారు. అప్పులు తీసుకువచ్చి… పేదలకు ఎలాంటి పనులు చేయలేదన్నారు. విద్య, వైద్యాన్ని నాశనం చేసిన సర్కార్ బీఆర్ఎస్ ది అని చెప్పారు.

Wed, 20 Dec 202301:34 PM IST

అలా ఎక్కడా లేదు – మంత్రి ఉత్తమ్

రైతుల నుంచి బిల్లు వసూలు చేయాలని ఎక్కడా లేదని చెప్పారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మీటర్లు పెట్టి రైతుల నుంచి బిల్లు వసూలు చేయండి అని నిబంధనలు లేవు.. హరీశ్‌రావు అబద్ధం చెప్తున్నారని కామెంట్స్ చెప్పారు.

Wed, 20 Dec 202301:31 PM IST

కట్టుకథలు అల్లారు – హరీశ్ రావు

డిస్కం బకాయిలను కూడా అప్పులుగా చూపారని అన్నారు హరీశ్ రావు. రాజకీయ ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ ప్రయత్నిస్తోందన్నారు. ఏపీ నుంచి విద్యుత్ బకాయిలు రాలేదన్నారు. ఆదాయం, అస్తులు ఎలా పెరిగయో చెప్పలేదని పేర్కొన్నారు.

Wed, 20 Dec 202301:29 PM IST

హరీశ్ రావు కామెంట్స్….

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. దీనిపై బీఆర్ఎస్ తరపున హరీశ్ రావు మాట్లాడుతూ…కాంగ్రెస్‌ రాష్ట్ర ఆర్థిక పరిస్థిపై తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలని హితవు పలికారు. ప్రభుత్వం… అంకెల గారడీ చేసే ప్రయత్నం చేసిందే తప్ప, వాస్తవాలను చెప్పలేదని పేర్కొన్నారు.శ్వేతపత్రంలోని వివరాలు శుద్ధతప్పు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Wed, 20 Dec 202301:16 PM IST

మొత్తం అప్పు…

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 57 ఏళ్లలో తెలంగాణ ప్రాంత అభివృద్ధికి రూ. 4,98 లక్షల కోట్లు ఖర్చు చేశారు. దీనికి విరుద్ధంగా గత పదేళ్లలో రాష్ట్రం మరియు ఎస్పీవీల మొత్తం అప్పు 2014 -15లో రూ. 72,658 కోట్ల నుంచి రూ. 6,71,757 కోట్లకు పెరిగింది.

Wed, 20 Dec 202301:03 PM IST

అప్పులను మాత్రమే ప్రస్తావించి….

కేవలం అప్పులను మాత్రమే ప్రస్తావించి.. గత ప్రభుత్వాన్ని విమర్శించే విధంగా శ్వేతపత్రాన్ని తయారు చేశారని హరీశ్ రావు వ్యాఖ్యానించారు.

Wed, 20 Dec 202301:01 PM IST

వారితో తయారు చేయించారు….

గత ప్రభుత్వాన్ని బద్నామ్ చేస్ విదంగా ఒక సస్పెండ్ అయినా మాజీ ఫైనాన్స్ అధికారితో ఈ శ్వేతపత్రాన్ని తయారు చేయించారని ఆరోపించారు హరీశ్ రావు. సమయం వొచ్చినప్పుడు పేర్లతో సహా బయట పెడతామన్నారు.

Wed, 20 Dec 202301:00 PM IST

హరీశ్ విమర్శలు

బీఆర్ఎస్ తరపున హరీశ్ రావు మాట్లాడుతూ… శ్వేతపత్రంలోని పలు అంశాలను తప్పుబట్టారు. ప్రభుత్వం కేవలం వారికి అనుకూలంగా ఉండే విధంగా మాత్రమే గణాంకాలను తీసుకుందని తెలిపారు. ప్రధానంగా కరోనా కాలంలోని గణాంకాలను తీసుకుందని విమర్శించారు.

జీతాలపై ప్రకటన

2014 – 15లో జీతాలు, పెన్షన్ల వ్యయం రూ. 17, 130 కోట్లు ఉండగా… 2021 – 22లో రూ. 48,809 కోట్లుగా ఉంది. దాదాపు మూడు రెట్లు పెరిగిందని ప్రభుత్వం ప్రకటించిన శ్వేతపత్రంలో తెలిపింది.

Wed, 20 Dec 202312:49 PM IST

సభ ప్రారంభం

విరామం తర్వాత తిరిగి అసెంబ్లీ ప్రారంభమైంది. బీఆర్ఎస్ తరపున హరీశ్ రావు… మాట్లాడుతున్నారు.

Wed, 20 Dec 202312:46 PM IST

బకాయిలు

గృహనిర్మాణశాఖకు సంబంధించి 6,470 కోట్ల బకాయిలు పెండింగ్ ఉన్నాయి. తాగునీటి కార్పొరేషన్ కు సంబంధించి రూ. 20,200 కోట్ల బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు సంబంధించి రూ. 2,951 కోట్ల బకాయిలు ఉన్నాయి.

Wed, 20 Dec 202312:30 PM IST

14 SPVల నుంచి రుణాలు

రాష్ట్రంలో ఉన్న 14 SPVలు మరియు సంస్థలు మొత్తం రూ. 1,18,557 కోట్ల రుణాన్ని సేకరించాయి.

Wed, 20 Dec 202312:28 PM IST

కాసేపట్లో అసెంబ్లీ ప్రారంభం

మరికాసేపట్లో అసెంబ్లీ ప్రారంభం కానుంది. ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంపై చర్చ జరగనుంది.

Wed, 20 Dec 202312:08 PM IST

మొత్తం అప్పు…

తెలంగాణలో మొత్తం అప్పులు రూ.6,71,757 కోట్లుగా పేర్కొంది కొత్త ప్రభుత్వం. ఈ మేరకు వివరాలను పేర్కొంది.

Wed, 20 Dec 202312:01 PM IST

42 పేజీల శ్వేతపత్రం

10 ఏళ్ళ బీఆర్ఎస్ పరిపాలనలో తెలంగాణ అప్పుల పాలైయ్యిందన్నారు భట్టి విక్రమార్క. ఈ మేరకు 42 పేజీల శ్వేతపత్రం విడుదల చేశారు.

Wed, 20 Dec 202311:47 AM IST

ఆర్థిక అరాచకం – డిప్యూటీ సీఎం భట్టి

ఎన్నో ఆశలు, ఆకాంక్షల మధ్య తెలంగాణ రాష్ట్రం ఏర్పడింద్నారు భట్టి. కలలన్నీ గత ప్రభుత్వం హయాంలో కల్లలుగా మిగిలిపోయాయాని విమర్శించారు. రోజువారీ ఖర్చులకు కూడా ఓడీ తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడిందని… దశాబ్ద కాలంగా జరిగిన ఆర్థిక అరాచకం ప్రజలకు తెలియాలని అభిప్రాయపడ్డారు.

 

Wed, 20 Dec 202311:45 AM IST

బీఆర్ఎస్ డాక్యుమెంట్

రాష్ట్ర ఆస్తుల వివరాలతో బీఆర్‌ఎస్‌ ఒక డాక్యుమెంట్‌ను విడుదల చేసింది. గత పదేళ్ల హయాంలో సృష్టించిన ఆస్తుల జాబితాను అందులో పేర్కొంది. మొత్తం 51 పేజీలతో ఈ డాక్యుమెంట్ ఉంది.

Wed, 20 Dec 202311:26 AM IST

30 నిమిషాలపాటు వాయిదా

అసెంబ్లీని 30 నిమిషాలపాటు వాయిదా వేశారు స్పీకర్. టీ విరామం ఇస్తున్నట్లు ప్రకటించారు.

Wed, 20 Dec 202311:27 AM IST

సమయం ఇవ్వండి…

శ్వేతపత్రంపై చర్చించేందుకు సమయం కావాలని బీఆర్ఎస్, ఎంఐఎం కోరింది.

Wed, 20 Dec 202311:23 AM IST

40 పేజీల శ్వేతపత్రం…

40 పేజీలతో కూడిన శ్వేతపత్రాన్ని విడుదల చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం.

Wed, 20 Dec 202311:27 AM IST

హరీశ్ రావు కామెంట్స్…

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రాన్ని విడుదల చేసింది కాంగ్రెస్ సర్కార్. ఈ మేరకు భట్టి ప్రకటన చేశారు. తొలుత బీఆర్ఎస్ నుంచి హరీశ్ రావుకు అవకాశం ఇచ్చారు.

Wed, 20 Dec 202311:18 AM IST

సీపీఐ శాసనసభాపక్ష నేతగా కూనంనేని

సీపీఐ శాసనసభాపక్ష నేతగా కూనంనేనిని ప్రకటించారు అసెంబ్లీ స్పీకర్.

Wed, 20 Dec 202311:18 AM IST

భట్టి స్పీచ్…

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క… శ్వేతపత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఇందులో భాగంగా… ఆయన ప్రసంగిస్తున్నారు.

Wed, 20 Dec 202311:14 AM IST

ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం

ఆర్థిక పరిస్థితిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క… చర్చ మొదలుపెట్టారు. శ్వేతపత్రాన్ని విడుదల చేస్తున్నారు.

Wed, 20 Dec 202311:07 AM IST

సభ ప్రారంభం

తెలంగాణ అసెంబ్లీ ప్రారంభమైంది. పలు సంతాప తీర్మానాలను స్పీకర్ ప్రకటించారు.

Wed, 20 Dec 202311:04 AM IST

ఎంఐఎం పక్ష నేతగా అక్బరుద్దన్ ఓవైసీ

ఎంఐఎం పక్ష నేతగా అక్బరుద్దన్ ఓవైసీని ప్రకటించారు అసెంబ్లీ స్పీకర్. ఈ మేరకు ప్రకటన చేశారు.

Wed, 20 Dec 202310:53 AM IST

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల భేటీ

శాసనసభ కార్యాలయంలో బీఆర్‌ఎస్ నేతల సమావేశమయ్యారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై సమాలోచనలు చేశారు.

Wed, 20 Dec 202310:42 AM IST

బీజేపీ శాసనసభాపక్షనేత ఎవరు..?

బీజేపీ తెలంగాణ ఫ్లోర్ లీడర్ ఎవరనేది ఆసక్తికరంగా మారింది. ఈ రేసులో ఎమ్మెల్యేలు రాజాసింగ్, కాటపల్లి వెంకటరమణారెడ్డితో పాటు మహేశ్వర్ రెడ్డి కూడా ఉన్నారు.

Wed, 20 Dec 202310:37 AM IST

ప్రభుత్వం తరపున వీరే….

ప్రభుత్వం తరపున సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్ ప్రధానంగా మాట్లాడే అవకాశం ఉంది. గత ప్రభుత్వంలో ఏం జరిగిందనే దానిపై వివరాలను వెల్లడిస్తారని తెలుస్తోంది.

Wed, 20 Dec 202310:26 AM IST

బీఆర్ఎస్ డాక్యూమెంట్…

రాష్ట్ర ఆస్తుల వివరాలతో బీఆర్‌ఎస్‌ ఒక డాక్యుమెంట్‌ను విడుదల చేసింది. గత ప్రభుత్వ హయాంలో సృష్టించిన ఆస్తుల జాబితాను అందులో పేర్కొంది.

Wed, 20 Dec 202310:25 AM IST

పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఉంటుందా..?

సభలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వటంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అయితే ప్రజంటేషన్ ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. దీనిపై మరికాసేపట్లో క్లారిటీ రానుంది.

Wed, 20 Dec 202310:24 AM IST

సభ ముందుకు నివేదిక…

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై నేడు అసెంబ్లీలో చర్చ జరగనుంది. సభలో నివేదిక ప్రవేశపెట్టనున్నారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క.

Wed, 20 Dec 202310:19 AM IST

కీలక అంశాలివే

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, విద్యుత్ పై ఇవాళ ప్రధానంగా సభలో చర్చ జరగనుంది. ఈ మేరకు ప్రభుత్వం సిద్ధమైంది.

Wed, 20 Dec 202310:10 AM IST

బీఆర్ఎస్ ఏం చేయబోతుంది..

పవర్ పాయింట్ ప్రజంటేషన్ విషయంలో బీఆర్ఎస్ కు అనుమతి ఇవ్వని నేపథ్యంలో… ఆ పార్టీ ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

Wed, 20 Dec 202310:05 AM IST

బీఆర్ఎస్ సిద్ధం…!

కాంగ్రెస్ ప్రభుత్వానికి ధీటుగా జవాబు ఇచ్చేందుకు ప్రతిపక్ష బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. ప్రధానంగా.. కేటీఆర్, హరీశ్ రావు, కడియం శ్రీహరి మాట్లాడే అవకాశం ఉంది.

Wed, 20 Dec 202309:58 AM IST

నేరుగా అసెంబ్లీకి…

ఢిల్లీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి… కాసేపట్లో హైదరాబాద్ కు చేరుకోనున్నారు. అక్కడ్నుంచి నేరుగా అసెంబ్లీకి రానున్నారు.

Wed, 20 Dec 202309:53 AM IST

మూడు రోజుల విరామం అనంతరం…

తాజాగా మూడు రోజుల విరామం అనంతరం సభ ఇవాళ ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతోంది. ఈ రోజు సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు- శ్వేత పత్రంపై చర్చ జరిగనుంది.

Wed, 20 Dec 202309:45 AM IST

బీఆర్ఎస్ కు షాక్…

బీఆర్ఎస్ అడిగిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ కు అనుమతి నిరాకరించారు అసెంబ్లీ స్పీకర్. ఈ మేరకు సమాచారాన్ని అందించారు.

Wed, 20 Dec 202309:44 AM IST

రెడీ అంటున్న బీఆర్ఎస్

మరోవైపు ధీటుగా సమాధానం ఇచ్చేందుకు బీఆర్‌ఎస్‌ సిద్ధమవుతోంది. తమకు కూడా ప్రజంటేషన్ ఇచ్చేందుకు అవకాశం ఇవ్వాలని కోరింది. ఇవాళ సభ వాడీవేడిగా చర్చ నడిచే అవకాశం ఉంది.

Wed, 20 Dec 202309:45 AM IST

పవర్ పాయింట్ ప్రజంటేషన్…

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తెలంగాణ సర్కార్‌ శ్వేత పత్రం విడుదల చేయనుంది. అప్పులు, నీటి పారుదల, విద్యుత్‌ పరిస్థితులపై వివరించనుంది. 2014 నుంచి ఆదాయ-వ్యయాలు అప్పుల ప్రస్తావించటంతో పాటు… పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇవ్వనుంది. సీఎం రేవంత్‌తో పాటు భట్టి, ఉత్తమ్‌ ప్రసంగించే ఛాన్స్‌ ఉంది.

 

Wed, 20 Dec 202309:42 AM IST

Telangana Assembly Sessions Live News : అసెంబ్లీ సమావేశాలు

ఇవాళ ఉదయం 11 గంటలకు తెలంగాణ అసెంబ్లీ ప్రారంభం కానుంది. మొదట సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టనున్నారు. ఆ తర్వాత ‘తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు- శ్వేత పత్రం’పై చర్చ ఉంటుంది. పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చేందుకు కాంగ్రెస్ సర్కార్ సిద్ధమైంది.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *