Telangana: తెలంగాణలోనే మొట్టమొదటి RTC మహిళా బస్ డ్రైవర్.. ఆమె కథ తెలిస్తే కన్నీళ్లు ఆగవు

ఆమె పేరు సరిత. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం సీత్యాతండాలో పుట్టి పెరిగారు. రాష్ట్రంలోని TGSRTCలో ఉద్యోగం సంపాదించి తొలి మహిళా బస్‌డ్రైవర్‌గా చరిత్ర సృష్టించారు. మొదటిరోజు MGBS నుంచి మిర్యాలగూడ వరకు నాన్ స్టాప్ బస్ నడిపారు.
ఆమె పేరు సరిత. మారుమూల తండాలో పుట్టి పెరిగారు. రాష్ట్రంలోని TGSRTCలో ఉద్యోగం సంపాదించి.. తొలి మహిళా బస్ డ్రైవర్‌గా చరిత్ర సృష్టించారు. మొదటి రోజు హైదరాబాద్‌లోని MGBS నుంచి మిర్యాలగూడ వరకు నాన్ స్టాప్ బస్ నడిపారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
TGSRTC first woman rtc driver
వి.రాంకోటి, రుక్కల దంపతుల కుమార్తె సరిత. వీరిది యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం సీత్యాతండా. సరిత తన అక్క దగ్గర ఉంటూ దేవరకొండలో 8వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో చదివారు. ఆ తర్వాత ఓపెన్ స్కూల్‌లో 10వ తరగతి వరకు విద్యనభ్యసించారు. ఇక తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉండటంతో వారిని పోషించే బాధ్యతను ఆమె తీసుకున్నారు.
ఈ తరుణంలోనే ఆటో నడపడం నేర్చుకున్నారు. 5 ఏళ్లు సంస్థాన్ నారాయణపురం నుండి సీత్యాతండాకు ఆటో నడిపారు. ఆ తర్వాత బస్సు డ్రైవింగ్ నేర్చుకున్నారు. మొత్తానికి ఆజాద్ ఫౌండేషన్ సహకారంతో దేశ రాజధాని ఢిల్లీలో డ్రైవర్‌గా విధులు నిర్వర్తించారు. అలా రెండేళ్ల అనంతరం ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్‌లో 15 మంది మహిళా డ్రైవర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ పడింది. అందులో కేవలం సరిత ఒక్కరే సెలెక్ట్ అయి.. దేశంలో తొలి మహిళా డ్రైవర్‌గా గుర్తింపు సంపాదించారు.
అయితే తన తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉండటంతో వారి బాగుబాగోగులు చూసుకోవడానికి రాష్ట్రంలో బస్ డ్రైవర్‌గా అవకాశం కల్పించాలని కోరింది. ఈ మేరకు గతంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంబంధిత మంత్రి పొన్నం ప్రభాకర్‌కు లేఖ రాసింది. దీనిపై స్పందించి ఆమెకు టీజీఎస్ ఆర్టీసీ డ్రైవర్‌గా అవకాశం కల్పించారు.