TDP Vs Janasena: అలా అయితే పవనే సీఎం.. టీడీపీకి జనసేన స్ట్రాంగ్ కౌంటర్!
నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలంటూ టీడీపీ నేత శ్రీనివాసులు రెడ్డి నిన్న చేసిన వ్యాఖ్యలకు వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ఇదే జరిగితే చంద్రబాబును కేంద్ర మంత్రిగా చేసి.. పవన్ ను సీఎం చేయాలని డిమాండ్లు చేయడం సంచలనంగా మారింది.
నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలంటూ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులు రెడ్డి నిన్న చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. పలువురు జనసేన నేతలు ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడుతున్నారు. జనసేన సోషల్ మీడియాలోనూ ఈ కామెంట్స్ పై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే జరిగితే పవన్ కల్యాన్ ను సీఎంగా, లోకేష్ ను డిప్యూటీ సీఎంగా చేయాలని కొందరు జనసేన నేతలు కౌంటర్ స్టేట్మెంట్లు ఇస్తున్నారు.
ఏపీ పాలిటిక్స్ లో ఏం జరగబోతోంది?
మరికొందరు జనసేన లీడర్లు అయితే.. చివరి రెండున్నరేళ్లు పవన్ కు సీఎం పదవి ఇవ్వాలన్న డిమాండ్ కూడా చేస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. టీడీపీ నేతలు మాత్రం మరో పదేళ్లు చంద్రబాబే సీఎంగా ఉండాలంటూ గతంలో పవన్ చేసిన కామెంట్లను గుర్తు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దీంతో ఈ వివాదం ముగిసిపోతుందా? లేక కూటమిలో కుంపట్లకు దారి తీస్తుందా? అన్న అంశంపై ఏపీ పాలిటిక్స్ లో జోరుగా చర్చ జరుగుతోంది.