Surya Grahan 2026 ఫాల్గుణ అమావాస్య వేళ తొలి సూర్యగ్రహణం.. ఈ 5 రాశుల వారు తస్మాత్ జాగ్రత్త..!

 Surya Grahan 2026 ఫాల్గుణ అమావాస్య వేళ తొలి సూర్యగ్రహణం.. ఈ 5 రాశుల వారు తస్మాత్ జాగ్రత్త..!

Surya Grahan 2026 జ్యోతిష్యం ప్రకారం, ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో మొదటి సూర్య గ్రహణం ఏర్పడే సమయంలో కొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ కాలంలో ఏ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం…

Solar Eclipse 2026 (2)

Surya Grahan 2026 హిందూ మత విశ్వాసాల ప్రకారం, గ్రహణాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. జ్యోతిష్యం ప్రకారం, ఒకే ఏడాది సూర్య లేదా చంద్ర గ్రహణాలు సంభవించినప్పుడు, వాటి ప్రభావం కచ్చితంగా ప్రతి ఒక్కరి జీవితాలపై పడుతుంది. శాస్త్రాల ప్రకారం గ్రహణాలను అశుభకరమైనవిగా పరిగణిస్తారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది 17 ఫిబ్రవరి 2026 మంగళవారం రోజున ఫాల్గుణ అమావాస్య రోజున మధ్యాహ్నం 3:26 గంటలకు ప్రారంభమై రాత్రి 7:57 గంటల వరకు సూర్య గ్రహణం ఉంటుంది. ఈ సమయంలో సూర్యుడు శని రాశి అయిన కుంభ రాశిలో నివాసం ఉంటాడు. ఈ సమయంలో ద్వాదశ రాశులపై ప్రభావం పడుతుంది. అయితే మొదటి సూర్య గ్రహణ సమయంలో, కొన్ని రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ సమయంలో మీ శక్తి, ఆరోగ్యం, మానసిక స్థితి, జీవనశైలిపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఈ సందర్భంగా తొలి సూర్య గ్రహణం వేళ ఏ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం…

సింహ రాశి(Leo)..
​సింహ రాశి వారికి సూర్య భగవానుడే అధిపతిగా ఉంటాడు. ఈ నేపథ్యంలో ఫాల్గుణ అమావాస్య వేళ మొదటి సూర్య గ్రహణం వేళ తీవ్ర సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ కాలంలో మీరు చేసే పనులన్నింట్లో అడ్డంకులు ఎదురవుతాయి. ఈ సమయంలో మీ వ్యక్తి చేతిలో మోసపోయే అవకాశం ఉంది. ఇది మీ ధైర్యాన్ని దెబ్బతీస్తుంది. ఆర్థిక పరంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఆరోగ్య పరంగా బలహీనంగా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.

కన్య రాశి(Virgo)..
​కన్య రాశి నుంచి మొదటి సూర్య గ్రహణం ఆరో స్థానంలో సంభవించనుంది. ఈ సమయంలో అనేక సవాళ్లు ఏర్పడనున్నాయి. ఈ కాలంలో ఉద్యోగులు, వ్యాపారులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరినీ గుడ్డిగా నమ్మకూడదు. పెండింగ్ పనులు పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. ఆర్థిక పరమైన విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్య పరంగా కొంత ఇబ్బందిగా ఉంటుంది. మీ ప్రేమ సంబంధాలలో జాగ్రత్తగా ఉండాలి.

వృశ్చిక రాశి(Scorpio)..
వృశ్చిక రాశి నుంచి నాలుగో స్థానంలో సూర్య గ్రహణం సంభవించనుంది. ఈ సమయంలో మీ కుటుంబ జీవితంలో కొన్ని ఆందోళనలు పెరుగుతాయి. మీ తల్లిదండ్రుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. పెట్టుబడులు లేదా ఆస్తికి సంబంధించిన నిర్ణయాలు తెలివిగా తీసుకోవాలి. చెడు సహవాసాలను నివారించాలి.

కుంభ రాశి(Aquarius)..
కుంభ రాశి వారికి మొదటి సూర్య గ్రహణం వేళ ప్రతికూల ఫలితాలు ఎదురుకానున్నాయి. ఈ కాలంలో మీ మానసిక ఒత్తిడిని పెంచుతుంది. అంతేకాదు అనవసరమన ఆందోళన, ఒత్తిడి మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. ఈ కారణంతో మీ ఆరోగ్యం ప్రభావితం అవుతుంది. ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు చేసే పనులన్నింటిలో నిరాశ ఎదురవుతుంది. ఈ కాలంలో పెట్టుబడి పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.

మీన రాశి(Pisces)..
మీన రాశి వారు మొదటి సూర్య గ్రహణం సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులకు నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆర్థిక పరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ప్రణాళిక లేని ఖర్చులకు దూరంగా ఉండాలి. ఆరోగ్య పరంగా కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు చాలా ఓపికగా ఉండాలి.

గమనిక : ఇక్కడ అందించిన సమాచారం, పరిహారాలన్నీ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *