Sri Rama Navami: నవమి నాడు రాముడిని ఏ టైంలో పూజించాలో తెలుసా?

- ఈ ఏడాది శ్రీరామ నవమి పండుగను ఏప్రిల్ 6వ తేదీన జరుపుకుంటున్నారు. ఈ రోజున ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:35 నిమిషాల్లోగా రాముడిని పూజించాలని పండితులు సూచిస్తున్నారు. ఈ సమయంలో పూజిస్తేనే కోరిన కోరికలు నెరవేరుతాయని అంటున్నారు.
- హిందూ సంప్రదాయంలో శ్రీరామ నవమికి ఓ ప్రత్యేకత ఉంది. రాముడిని భక్తితో పూజించే చాలా మంది ఈ పండును జరుపుకుంటారు. ప్రతీ ఏడాది ఛైత్ర మాసంలో నవమి రోజున శ్రీరామ నవమి పండుగను ఘనంగా నిర్వహిస్తారు. అయితే ఈ ఏడాది ఈ పండుగను ఏప్రిల్ 6వ తేదీన జరుపుకుంటున్నారు. రామాయణం ప్రకారం శ్రీరాముడు నవమి రోజున జన్మించాడని అందుకే శ్రీరామ నవమిని నిర్వహిస్తారని చెప్పుకుంటారు.
- నవమి రోజు ఇలా పూజిస్తే..
- నవమి రోజున రాముడిని భక్తితో పూజిస్తే.. కోరిన కోరికలు అన్ని కూడా నెరవేరుతాయని పండితులు చెబుతుంటారు. అయితే నవమి తిథి ఉన్న సమయంలోనే రాముడిని పూజిస్తేనే ఫలితం ఉంటుంది. మరి నవమి రోజున రాముడిని పూజించడానికి సరైన సమయం ఏది? ఏ సమయంలో పూజిస్తేనే మంచిదో తెలుసుకుందాం.
-
హిందూ క్యాలెండర్ ప్రకారం చైత్ర మాసంలోని శుక్ల పక్ష నవమి తిథి ఏప్రిల్ 5న సాయంత్రం 7:26 గంటలకు ప్రారంభమై.. ఏప్రిల్ 6వ తేదీ సాయంత్రం 7:22 గంటల వరకు ఉంటుంది. అయితే సంప్రదాయాల ప్రకారం ఈ తిథి సమయంలోనే రాముడిని పూజించాలి. అయితే రాముడిని పూజించడానికి సరైన సమయం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.35 గంటల వరకు మాత్రమే.
- ఈ సమయంలో వీలు కాని వారు నవమి తిథి ఉన్న సమయంలో పూజ చేసుకోవచ్చు. ఈ టైంలో రాముడిని భక్తితో పూజిస్తే కోరిన కోరికలు అన్ని కూడా నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు. అలాగే శ్రీ రామ చరిత మానస్ కూడా చదివితే కోరిన కోరికలు అన్ని కూడా నెరవేరుతాయని పండితులు అంటున్నారు.