Solar Eclipse Time : సెప్టెంబర్‌ 21న వచ్చే సూర్య గ్రహణం వేళ చదవాల్సిన మంత్రాలివే.. 5 నిమిషాలు పఠిస్తే చాలు..

 Solar Eclipse Time : సెప్టెంబర్‌ 21న వచ్చే సూర్య గ్రహణం వేళ చదవాల్సిన మంత్రాలివే.. 5 నిమిషాలు పఠిస్తే చాలు..

Solar Eclipse September 2025 గ్రహణం (Surya Grahanam September 21) వల్ల కలిగే ప్రతికూల ప్రభావం మనపై ఉండకూడదు అంటే కొన్ని మంత్రాలు పఠించడం ప్రధానమని చెబుతారు పండితులు. ఈ సూర్య మంత్రాలు సూర్య భగవానుడి ఆశీస్సులు పొందడానికి, ఆధ్యాత్మిక శక్తి, మానసిక ప్రశాంతత పెంపొందడానికి ఉపయోగపడతాయి. అలాగే.. దోషాలను, ప్రతికూల శక్తులు తొలగిపోవడానికి కూడా తోడ్పడుతాయని విశ్వాసం. ఈక్రమంలో సెప్టెంబర్‌ 21 సూర్య గ్రహణం 2025 వేళ పఠించాల్సిన మంత్రాలు ఏవో తెలుసుకుందాం..

Surya Grahan 2025 సూర్య గ్రహణం అనేది ఒక ముఖ్యమైన సంఘటన. ఇది గ్రహాలు, నక్షత్రాలపై ప్రభావం చూపుతుంది. దీనివల్ల అశుభ ప్రభావాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. భూమికి, సూర్యడుకి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు సూర్య కిరణాలు భూమిని చేరవు. దీనివల్ల సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈ ఏడాది సెప్టెంబర్‌ 21 ఏర్పడనుంది. ఇది భారతదేశంలో కనిపించదు కాబట్టి సూతక కాలం పాటించాల్సిన అవసరం ఉండదు. అయినప్పటికీ సూర్య గ్రహణం (Solar Eclipse Septemeber 21) ప్రభావం ఉండకూడదు అనుకుంటే చదవాల్సిన మంత్రాలను ఇప్పుడు తెలుసుకుందాం..

2025 సెప్టెంబర్‌ 21వ తేదీన పాక్షిక సూర్య గ్రహణం (Surya Grahanam 2025 Septemeber 21) ఏర్పడనుంది. భారత కాలమానం ప్రకారం సెప్టెంబర్‌ 21వ తేదీ రాత్రి 10.59 అంటే 11 గంటల నుంచి సెప్టెంబర్‌ 22 తెల్లవారుజామున 3.23 గంటలకు వరకు ఉంటుంది. ఇది రాత్రి పూట సంభవించడం వల్ల భారతదేశంలో కనిపించదు. కాబట్టి మనం ఈ సూర్య గ్రహణం (Surya Grahan 2025) చూడాలంటే ఆన్‌లైన్‌ స్ట్రీమింగ్‌ ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది.

ఇక జ్యోతిష శాస్త్రం ప్రకారం సూర్య గ్రహణం సమయంలో సూర్యుడు, చంద్రుడు, బుధుడు కన్యా రాశిలో ఉంటారు. అలాగే.. శనీశ్వరుడు మీనరాశిలో ప్రత్యక్ష దృష్టిని కలిగి ఉంటారు. కుజుడు తులా రాశిలో, రాహువు కుంభ రాశిలో, బృహస్పతి మకర రాశిలో, శుక్రుడు, కేతువు కలిసి సింహ రాశిలో ఉంటారని పండితులు చెబుతున్నారు.

ఆదిత్య మంత్ర పఠనం

సూర్య గ్రహణం ముగిసిన తర్వాత అంటే సెప్టెంబర్‌ 22వ తేదీ ఉదయం వేకువజామున నిద్ర లేచిన వెంటనే ఉదయిస్తున్న సూర్యుడికి నమస్కరిస్తూ ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. అలాగే మనసులో ఆలోచనలు మొదలయ్యే సమయంలో కూడా ఈ సూర్య మంతం జపించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని విశ్వాసం.

నమః సూర్య శాన్తాయ సర్వరోగ నివారిణే
ఆయురారోగ్య మైశ్వైర్యం దేహి దేవః జగత్పత్తే

సూర్య బీజ మంత్రం

ఓం హ్రాం హ్రీం హ్రౌం సః సూర్యాయ నమః
ఈ బీజ మంత్రం సూర్యుని శక్తిని, సారాన్ని కలిగి ఉంటుంది. ఇది సూర్య శక్తిని సక్రియం చేయడానికి, సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది. అలాగే.. ఈ మంత్రం పఠించడం వల్ల శ్రేయస్సు, కీర్తి కలుగుతాయని వ్యాధులు, ప్రతికూల ప్రభావాలు దూరం జరుగుతాయని విశ్వాసం.

సూర్య గాయత్రీ మంత్రం

ఓం భాస్కరాయ విద్మహే దివాకరాయ ధీమహి.. తన్నో సూర్యః ప్రచోదయాత్‌
ఈ మంత్రం పఠించడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఒత్తిడి, ఆందోళ తగ్గి మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. సూర్యడు ఆత్మవిశ్వాసం, గౌరవానికి ప్రతీక కాబట్టి ఈ మంత్రం జపించడం వల్ల ఆత్మవిశ్వాసం, ధైర్యం పెరుగుతాయి. ప్రతికూల ఆలోచనలు, దుష్ట శక్తులు దూరమై.. జీవితంలో సానుకూలత, శుభాలు కలుగుతాయి.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *