Sesame Jaggery Laddu : నువ్వులతో బెల్లం కలిపి తింటే ఎన్ని రోగాలు నయం అవుతాయో తెలుసా?
Sesame Jaggery Laddu Benefits : నువ్వులతో పాటు బెల్లం తినడం వల్ల శరీరానికి అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. దీని ద్వారా చాలా సమస్యల నుంచి బయటపడొచ్చు.
పొటాషియం, సోడియం, ఐరన్ వంటి పోషకాలు బెల్లంలో లభిస్తాయి. అదేవిధంగా నువ్వులు వివిధ రకాల పోషకాలను కలిగి ఉంటాయి. అందుకే మన పూర్వీకులు నువ్వులు, బెల్లంతో చిరుతిళ్లు చేసి పిల్లలకు పెట్టేవారు. పిల్లల పోషణను పెంచడంలో నువ్వులు, బెల్లం ప్రధాన పాత్ర పోషిస్తాయి. బెల్లం, నువ్వులు ఈ రెండు పదార్థాలు మన శరీరంలో వేడిని సృష్టిస్తాయి. దీని వల్ల చాలా మంది దూరంగా ఉంటారు. అయితే కాల్చిన నువ్వులు, బెల్లం కలిపి తింటే గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.
నువ్వులు, బెల్లం మిశ్రమంలో అసంతృప్త కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఈ మిశ్రమాన్ని రోజూ కొద్దిగా తింటే గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇది మీ గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
మధుమేహం ఉన్నవారు బెల్లం తినకూడదు. కానీ ఇందులో చాలా పోషకాలు ఉన్నందున, దీనిని తక్కువ పరిమాణంలో తినవచ్చు. రోజులో అర చెంచా కంటే తక్కువ బెల్లం తీసుకుంటే శరీరానికి మేలు జరుగుతుంది. అతిగా తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది.
రక్తహీనత ఉన్నవారు, శరీరంలో ఐరన్ తక్కువగా ఉన్నవారు వేయించిన నువ్వులు, బెల్లం తినవచ్చు. రోజూ ఒక చెంచా నువ్వులు, బెల్లం కలిపి తీసుకుంటే శరీరంలో ఐరన్ లోపం తగ్గుతుంది. ఐరన్ లోపం ఎక్కువగా స్త్రీలు, పిల్లలలో సంభవిస్తుంది. వారు దీనిని తినాలి.
రోజూ 1 చెంచా నువ్వులు, బెల్లం కలిపి తింటే బరువు తగ్గుతారు. ఎందుకంటే ఇలా తింటే ఎక్కువసేపు ఆకలి వేయదు. ఈ విధంగా మీరు కేలరీలు అధికంగా ఉండే ఆహారాన్ని తినకుండా నివారించవచ్చు.
నువ్వులు, బెల్లం తింటే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ త్వరగా తగ్గిపోతుంది. కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారు ప్రతిరోజూ ఒక చెంచా నువ్వులు, బెల్లం తినవచ్చు. ఇది సహజంగా చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో మీకు సహాయపడుతుంది.
మధుమేహం ఉన్నవారు అర చెంచా కంటే ఎక్కువ తినకూడదు. ఈ విషయం కచ్చితంగా గుర్తుంచుకోవాలి. అవసరమైతే నిపుణుల సలహా తీసుకోవాలి.
పిల్లలు ఒక చెంచా నుండి 2 చెంచాలలో నువ్వులు ప్లస్ బెల్లం మిశ్రమాన్ని తినవచ్చు. నువ్వుల లడ్డూ అయితే అందులో సగం లడ్డూ తినొచ్చు.
కొంతమంది పిల్లలు నువ్వులు తినడానికి ఇష్టపడరు. నువ్వుల పొడిని బెల్లం, నెయ్యి, యాలకులు కలిపి లడ్డూలుగా చేసుకుని తింటారు.