Secunderabad Bonalu 2025: రేపే ఉజ్జయిని మహంకాళి బోనాలు..సికింద్రాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర జులై 13 నుండి 15 వరకు ఘనంగా జరగనుంది. వేలాదిమంది భక్తులు ఆలయానికి చేరుకోనుండగా.. భక్తుల సౌకర్యం, రాకపోకల నిర్వహణ కోసం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు జారీ చేశారు.
సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర(Bonalu Celebrations) జులై 13 నుండి 15 వరకు ఘనంగా జరగనుంది. వేలాదిమంది భక్తులు ఆలయానికి చేరుకోనుండగా.. భక్తుల సౌకర్యం, రాకపోకల నిర్వహణ కోసం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు జారీ చేశారు.ఈ బోనాల జాతర(Bonalu Festival)లో సీఎం రేవంత్ రెడ్డి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. సోమవారం రంగం (భవిష్యవాణి) కార్యక్రమంతోపాటు అమ్మవారి అంబారీ (ఏనుగు ఊరేగింపు) కూడా జరగనుంది. లక్షలాది భక్తులు హాజరయ్యే ఈ ఆషాఢ మాస ఉత్సవంలో మహిళలు అమ్మవారికి బోనం అర్పిస్తారు. బోనాలు మరుసటి రోజు జరిగే రంగం కోసం కూడా జనాలు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఇక తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత నుంచి ప్రభుత్వం బోనాలను ఘనంగా నిర్వహిస్తోంది.
ఈ వేడుకలో భారీ రద్దీని నియంత్రించేందుకు ఆలయం చుట్టూ 2 కిమీ మేర ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దాదాపు 1,600 మంది పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. 70 సీసీటీవీ కెమెరాలతో నిరంతర నిఘా ఏర్పాట్లు చేసారు. ప్రతీ ఏటా ఈ జాతరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుండి ఇసుకవేస్తే రాలనంత మంది భక్తులు హాజరవుతారు. పండుగ సమయంలో ( జులై 13 నుంచి 15 వరకు) ఈ ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ – రోడ్డు అడ్డంకులు ఏర్పడే అవకాశం ఉన్నందున ప్రయాణికులు ప్యాట్నీ.. -ప్యారడైజ్… -బేగంపేట మార్గాలకు ప్రత్యాన్మయ మార్గాలు చూసుకోవాలని సూచించారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రయాణికులు చిలకల గూడ వైపు నుండి ప్లాట్‌ఫారమ్ నంబర్ 10 గేటు ద్వారా లోపలికి ప్రవేశించాలని పోలీసులు కోరుతున్నారు. దీనివల్ల సమయానికి స్టేషన్ చేరుకోవచ్చని సూచించారు. భక్తులు, ప్రయాణికులు ఈ సూచనలను గౌరవించి సహకరించాలనీ, వేడుకలను భద్రతగా జరుపుకోవాలని ట్రాఫిక్ పోలీసులు కోరుతున్నారు. టొబాకో బజార్, హిల్ స్ట్రీట్ నుండి మహంకాళి ఆలయం, బాటా ఎక్స్ రోడ్ల నుండి రోచా బజార్ వరకు సుభాష్ రోడ్డు,ఔదయ్య ఎక్స్ రోడ్ నుండి మహంకాళి ఆలయం, జనరల్ బజార్ నుండి మహంకాళి ఆలయం రోడ్లను జూలై 13న తెల్లవారుజామున 12 గంటల నుండి జూలై 15న తెల్లవారుజామున 3 గంటల వరకు మూసివేయనున్నారు.
శివసత్తులు, జోగినీలు జూలై 13 ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 3 గంటల వరకు అమ్మవారిని దర్శించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. బాటా జంక్షన్ నుంచి మొత్తం 6 క్యూలైన్లు ఏర్పాటు చేశారు. బోనం సమర్పించి అమ్మవారికి మొక్కులు చెల్లించుకొనే భక్తులు ఇబ్బంది రెండు క్యూలైన్లు ఉంటాయని స్పష్టం చేశారు. ఈ క్యూలైన్ లో బోనంతో వచ్చే మహిళతో పాటూ మరో ఐదుగురిని అనుమతిస్తారు. దివ్యాంగులు -… సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక క్యూలైన్లను నిర్వాహకులు.. పోలీసులు ఏర్పాటు చేశారు. ఆలయ పరిసరాలతో పాటు ఫలహార బండ్ల ఊరేగింపు జరిగే ప్రాంతాల్లో సీసీ కెమెరాలతో నిఘా కొనసాగుతుందన్నారు.
సికింద్రాబాద్ లష్కర్ బోనాల సందర్భంగా జూలై 13 ఆదివారం ఉదయం 6 గంటల నుంచి జూలై 15 మంగళవారం ఉధయం 6 గంటలవరకూ మందు దుకాణాలు మూతపడనున్నాయి. బార్లు, వైన్ షాపులు, కల్లుదుకాణాలు మూసివేయాలని సీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.