Secunderabad Bonalu : బోనాల చెక్కుల పంపిణీలో ఉద్రిక్తత..తన్నుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

 Secunderabad Bonalu :  బోనాల చెక్కుల పంపిణీలో ఉద్రిక్తత..తన్నుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

సికింద్రాబాద్‌లో బోనాల చెక్కుల పంపిణీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సికింద్రాబాద్ లోని పలు ఆలయాలకు సంబంధించి చెక్కులు పంపిణీ చేసేందుకు సికింద్రాబాద్ లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది.

Secunderabad Bonalu : సికింద్రాబాద్‌లో బోనాల చెక్కుల పంపిణీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సికింద్రాబాద్ లోని పలు ఆలయాలకు సంబంధించి చెక్కులు పంపిణీ చేసేందుకు సికింద్రాబాద్ లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి, సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావులతో పాటు డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి ఇతర కార్పొరేటర్లు హాజరయ్యారు.ఈ సందర్భంగా ప్రోటోకాల్ పాటించడం లేదంటూ బీఆర్‌ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. రెండు పార్టీల నాయకులు పోటాపోటీగా నినాదాలు చేశారు. చెక్కులు పంపిణీ చేస్తుండగా కరెంట్ కట్ చేయడంతో గందరగోళం నెలకొంది.

కాగా ప్రోటోకాల్ పాటించడం లేదంటూ బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆందోళనకు దిగటంతో డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఎమ్మెల్యే పద్మారావు, కాంగ్రెస్ ఇంఛార్జ్ సంతోష్ అనుచరులు ఒకరినొకరు పరస్పరం తోచుకున్నారు. ప్రోటోకాల్ పేరుతో ఎమ్మెల్యే పద్మారావు వివాదం సృష్టిస్తున్నారంటూ శ్రీలత శోభన్ రెడ్డి ఆరోపించారు. సికింద్రాబాద్ కట్టమైసమ్మకు సంబంధించిన బోనాల వేడుకకు సంబంధించి చెక్కుల పంపిణీ వివాదాస్పదంగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకుని కార్యకర్తలను చెదరగొట్టారు. అనంతరం చెక్కులు అందజేసిన నేతలు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *