Schools Holiday: తుఫాను ప్రభావంతో నేడు, రేపు పాఠశాలలకు సెలవు

 Schools Holiday: తుఫాను ప్రభావంతో నేడు, రేపు పాఠశాలలకు సెలవు

Schools Holiday: మిచౌంగ్ తుఫాను ముంచుకొస్తుండటంతో కోస్తా ప్రాంతంలో పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.

Schools Holiday: కోస్తా ప్రాంతంలో మిచౌంగ్ తుఫాను విరుచుకు పడుతుందనే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో పాఠశాలలు, విద్యా సంస్థలకు రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించారు. సోమ, మంగళవారాల్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు.

తుఫాను కారణంగా ఎన్టీఆర్‌ జిల్లాలో రెండు రోజుల పాటు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు ఉత్తర్వులు జారీ చేశారు. మిచౌంగ్ తుఫాను కారణంగా జిల్లా లో విస్తారంగా వర్షాలు, ఈదురు గాలులు వీయనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు చేసిన దృష్ట్యా జిల్లాలో పాఠశాలలకు సోమ, మంగళవారం రెండురోజులు సెలవు ప్రకటిస్తునట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు

మిచౌంగ్ తుఫాన్ వాతావరణ శాఖ హెచ్చరికలను దృష్టిలో ముందు జాగ్రత్త చర్యలలో భాగం గా ఈ నెల 4, 5 వ తేదీలు సోమ,మంగళ వారాలలో జిల్లా లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, మేనేజ్మెంట్ పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ వెల్లడించారు.

రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలకు సెలవులు…

మిచౌంగ్ తుఫాను కృష్ణా జిల్లాలో తీరం దాటనున్న నేపథ్యంలో కోస్తా జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. అనకాపల్లి, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.

మిచౌంగ్ తుపాను పరిస్థితులను ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సర్వసన్నద్ధం ఉందని ఎన్టీఆర్ కలెక్టర్ ఢిల్లీ రావు తెలిపారు. మిచౌంగ్ తుపాను నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ కమాండ్ కంట్రోల్‌ రూమ్‌‌లో ఏర్పాటు చేశారు.

తుఫాన్ పరిస్థితులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామని జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీ రావు తెలిపారు. జిల్లా యంత్రాంగాన్ని ఇప్పటికే అప్రమత్తం చేశామన్నారు. ప్రజలు అత్యవసర సహాయం, వాతావరణ సమాచారం కోసం 24 గంటలు అందుబాటులో ఉండే కమాండ్ కంట్రోల్‌ రూమ్‌ నంబర్ 0866- 2575833లో సంప్రదించాలని తెలిపారు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *