School Reopen: మోగిన బడిగంట.. స్టూడెంట్స్‌కు విద్యాశాఖ గ్రాండ్ వెల్‌కమ్! భలేగా ముస్తాబైన సర్కార్ స్కూళ్లు

 School Reopen: మోగిన బడిగంట.. స్టూడెంట్స్‌కు విద్యాశాఖ గ్రాండ్ వెల్‌కమ్! భలేగా ముస్తాబైన సర్కార్ స్కూళ్లు

విద్యార్థులు బడిబాట పట్టే టైం వచ్చేసింది. మరికాసేపట్లో బడిగంట మోగనున్న వేళ విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. స్టూడెంట్స్ గ్రాండ్ వెల్ కమ్ చెప్పేందుకు పాఠశాలలు రెడీ అయ్యాయి. కొత్త విద్యాసంవత్సరంలో కొన్ని పాత సమస్యలు స్వాగతం చెబతున్నా.. వాటిని అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నామంటోంది విద్యాశాఖ..

School Reopen: మోగిన బడిగంట.. స్టూడెంట్స్‌కు విద్యాశాఖ గ్రాండ్ వెల్‌కమ్! భలేగా ముస్తాబైన సర్కార్ స్కూళ్లు
హైదరాబాద్‌, జూన్‌ 12: సెలవుల సంబురం ముగిసింది. విద్యార్థులు బడిబాట పట్టే టైం వచ్చేసింది. మరికాసేపట్లో బడిగంట మోగనున్న వేళ విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. స్టూడెంట్స్ గ్రాండ్ వెల్ కమ్ చెప్పేందుకు పాఠశాలలు రెడీ అయ్యాయి. కొత్త విద్యాసంవత్సరంలో కొన్ని పాత సమస్యలు స్వాగతం చెబతున్నా.. వాటిని అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నామంటోంది విద్యాశాఖ. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు వేసవి సెలవుల తర్వాత తిరిగి జూన్ 12న ఉదయం 9 గంటలకు ఓపెన్ కాబోతున్నాయి. ఇప్పటికే అడ్మిషన్ల వేట కొనసాగిస్తున్న స్కూల్స్.. పాత, కొత్తగా చేరిన విద్యార్థులకు గ్రాండ్ వెల్ కమ్ చెప్పేందుకు రెడీ అయిపోయాయి.

రాష్ట్రంలో గతేడాది 1990 స్కూల్స్ విద్యార్థులు చేరలేదని మూతపడ్డాయి. ఈసారి ఆ గణాంకాలు ఎన్నో తేలాలంటే ఈ నెలాఖరు వరకు వేచి చూడాలి. ప్రభుత్వ విద్యాసంస్థలకు ప్రధాన సమస్యగా విద్యార్థుల నమోదు సమస్య మారింది. ప్రైవేటు వైపే ఎక్కువ శాతం పేరెంట్స్ మొగ్గు చూపుతున్నారు. గతేడాది ఫస్ట్ క్లాస్ లో చేరాల్సిన విద్యార్థులు లక్ష 25 వేల మంది ఉంటే అందులో కేవలం 27 వేల మంది ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. దాదాపు లక్ష మంది ప్రైవేటు స్కూల్స్ లోనే జాయిన్ అయినట్లు లెక్కలు చెబుతున్నాయి. అన్ని జిల్లాల్లో ప్రభుత్వ పాఠశాలలకు ఇప్పటికే పాఠ్యపుస్తకాలు చేరుకోగా.. కొన్ని స్కూల్స్ కు ఒక జత యూనిఫాంలు వచ్చాయని.. మరికొన్నిటికి అసలే రాలేదని టీచర్లు చెబుతున్నారు. సకాలంరో సౌకర్యాలు కల్పిస్తే నాణ్యమైన విద్య అందించేందుకు వీలు ఉంటుందని ఉపాధ్యాయులు అభిప్రాయ పడుతున్నారు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *