Sankranti Wishes Telugu : సరదాల సంక్రాంతి విషెస్ మీ కోసం

 Sankranti Wishes Telugu : సరదాల సంక్రాంతి విషెస్ మీ కోసం

Sankranti Wishes In Telugu : మకర సంక్రాంతి రోజున మీ ప్రియమైన వారికి నచ్చేలా విష్ చేయండి. మీ కోసం కొన్ని కోట్స్ ఇక్కడ అందిస్తున్నాం.

సంక్రాంతి శుభాకాంక్షలు

సంక్రాంతి శుభాకాంక్షలు

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు ధనుస్సు రాశిని విడిచిపెట్టి మకరరాశిలోకి ప్రవేశించినప్పుడు సంక్రాంతి పండుగను నిర్వహించుకుంటారు. మకర సంక్రాంతి సోమవారం, జనవరి 15 2024న వచ్చింది. సంక్రాంతి రోజు ప్రధానంగా సూర్యునికి అంకితం చేసిందిగా చెబుతారు. ఈ రోజు సూర్య భగవానుని ఆరాధిస్తారు. మీరు మీ ప్రియమైనవారికి కొన్ని సందేశాల ద్వారా మకర సంక్రాంతి శుభాకాంక్షలు పంపవచ్చు.

నువ్వులు బెల్లం తిని తియ్యని మాటలు మాట్లాడుకుందాం.. అన్ని చేదు జ్ఞాపకాలనను మరచి మంచి సంబంధాలు కలిగి ఉందాం.. మకర సంక్రాంతి శుభాకాంక్షలు 2024

తెలుగు ప్రజలందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు

మకర సంక్రాంతి శుభ సందర్భంగా సూర్య భగవానుడు అందరికి సంతోషం, శాంతి, శ్రేయస్సును ప్రసాదించాలి.. Happy Sankranti

మీ జీవితం ఆనందం, శ్రేయస్సు, ప్రేమతో నిండి ఉండాలి.. మీకు, మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు

కొత్త దిశలో ఉదయించే సూర్యుడు మీ జీవితంలో ఆనందం, శ్రేయస్సు, ఆనందాన్ని తీసుకురావాలి.. సంక్రాంతి శుభాకాంక్షలు

ఈ రోజున సూర్యుడు తన మార్గాన్ని మార్చుకున్నట్లుగా మీ జీవిత మార్గం మారవచ్చు. ఇది మీకు ఆనందం, శాంతి, ఆనందం, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది.. హ్యాపీ సంక్రాంతి

శ్రేయస్సుకు ప్రతీక అయిన సంక్రాంతి పండుగ మీ కుటంబానికి ఆనందాన్ని కలిగించుగాక .. సంక్రాంతి శుభాకాంక్షలు 2024.

చేదు జ్ఞాపకాలు మాయమై..,

తీపి జ్ఞాపకాలు కలకాలం నిలిచిపోవాలని..,

రాబోయే రోజుల్లో మీ కలలు నెరవేరాలని..,

మీ జీవితం ప్రశాంతంగా ఉండాలని.. కోరుకుంటూ Happy Makara Sankranti 2024

మకర సంక్రాంతి సంవత్సరం మొదటి పండుగ, ప్రతి ఒక్కరూ కొత్త ఉత్సాహం, కొత్త స్ఫూర్తి, ప్రశాంతతతో ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నాను.. మకర సంక్రాంతి శుభాకాంక్షలు.

సరదాల సంక్రాంతి వచ్చేసింది.. జీవితంలోకి ఆనందాన్ని తెచ్చేసింది.. నన్ను నిన్ను కలిపింది.. మదిలో ఆనందాన్ని నింపింది.. Happy Sankranti

ఉప్పొంగే ఉత్సాహంతో సరదాల సంక్రాంతి జరుపుకోవాలని కోరుకుంటూ.. హ్యాపీ సంక్రాంతి

మీ ఇల్లు ఆనందనిలయమవ్వాలి.. సుఖసంతోషాలతో నిండి ఉండాలి.. Happy Sankranti 2024

నింగి నుంచి నేలకు దిగొచ్చే హరివిల్లులు.. మన ముంగిట్లో మెరిసే రంగవల్లులు.. పంచెకట్టులు, పందెంకోళ్లు.. తెలుగు సంప్రదాయం గుర్తుచేసే అందమైన వేడుక.. ఈ సంక్రాంతి పండుగ.. Happy Pongal 2024

పాలలోని తెల్లదనం.. చెరుకులోని తియ్యదనం.. ముగ్గులోని రంగుల అందం.. పండుగ రోజున మీ ఇంట్లో వెల్లివిరియాలి ఆనందం.. మకర సంక్రాంతి శుభాకాంక్షలు

భోగి పండ్లుగా మారిన రేగుపండ్లు.. ముద్దుల చిన్నారుల నవ్వులు.. రంగవల్లుల మధ్య గొబ్బిళ్లు.. ఎక్కడ ఉన్నా మరవలేని మన పండుగలు.. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు..

మీ ఇంటిల్లిపాదికి ఈ సంక్రాంతి శుభాలతో కూడిన భవిష్యత్‌ను అందించాలని కోరుకుంటూ.. Happy Sankranti

మీ ఇంట్లో ఈ సంక్రాంతి సిరిసంపదలను తీసుకురావాలని కోరుకుంటూ Happy Makara Sankranti

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *